admin
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేటి నుంచి విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్‌ః పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం నుంచి విచారణ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో అధికారులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రావద్దని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడరాదని సూచిస్తూ బులిటెన్ విడుదల చేశారు.
ఇదిలాఉండగా సోమవారం ఉదయం 11 గంటలకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే బి. ప్రకాష్ గౌడ్ అనర్హత పిటిషన్‌పై విచారణ ప్రారంభమవుతుంది. పన్నెండు గంటలకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, మధ్యాహ్నం ఒంటి గంటకు గూడెం మహిపాల్ రెడ్డి, మూడు గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టనున్నారు. తమ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినందున పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరుతూ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో స్పీకర్ సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నందున అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు.
ఉన్నదే మునుగుతుంటే ఫ్యూచర్ సిటీయా?: కెటిఆర్
మీ Personal loan దరఖాస్తు రిజెక్ట్ అయ్యిందా? ఇవి కారణాలు! మీరు ఏం చేయాలంటే..
శాంతించిన మూసీ
నేడే సద్దుల బతుకమ్మ
Ind vs Pak Asia cup final : ‘క్రీడా మైదానంలో ఆపరేషన్ సిందూర్’- టీమిండియాకు మోదీ అభినందనలు..
ఆసియా కప్ మనదే.. ఫైనల్లో పాక్‌పై ఉత్కంఠ విజయం
సోమవారం రాశి ఫలాలు
మేషం – శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభ సాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
వృషభం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది న్యాయ నిపుణుల సలహాలను పరిగణలోనికి తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
మిథునం – మీ నడవడిక సూటిగా ఉంటుంది. మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు.
కర్కాటకం – ఆర్థిక విలువైన పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయవ్యయాలు సరి సమానంగా ఉంటాయి. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలలో కొంత సందిగ్ధత ఏర్పడును.
సింహం – జీవితంలో ఏదో సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించడానికి గాను కావలసిన సలహాలను, సూచనలను పెద్దల నుండి అందుకుంటారు.
కన్య – మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మార్పులు కోరుకుంటారు. నిష్కారమైన తగాదాలు అపనిందలు తప్పకపోవచ్చు. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి.
తుల – రుణాలు మొత్తం తీర్చి వేస్తారు. మిత్రబృందంలోనికి కొత్తవారికి చోటు కల్పిస్తారు. ఇతరుల అతి జోక్యం వలన కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తలు పాటించండి.
వృశ్చికం – అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శన ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.
ధనుస్సు – అనుకున్న విధంగా నిర్ణయాలను అమలు చేయగలుగుతారు. ఎదుటివారు చెప్పేది ఆసాంతం వినడం విసుగు, కోపాలకు దూరంగా ఉండటం వలన లాభపడగలుగుతారు.
మకరం – సున్నిత వ్యవహారాలలో ఓర్పును చూపడం వలన లాభ పడతారు. ఉద్యోగములలో బదిలీ వేటు ఉన్న ఉన్నత పదవి ప్రాప్తి సూచనలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
కుంభం – లిఖితపూర్వక ఒప్పందములకు వక్రభాషములను తెచ్చే వర్గం పట్ల అప్రమత్తంగా ఉండండి. వాయిదాలలో ఉన్న కొన్ని కోర్టు కేసులు అనుకూలమైన మలుపు తిరుగుతాయి.
మీనం – భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూల పడతాయి. కంప్యూటర్ విద్య అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గీయులు కొన్ని కారణముల వలన దూరంగా ఉంటారు.