admin
గాల్లో విమానం.. ఎమ్మెల్యేతో గొడవపడ్డ ప్రయాణికుడు..
లక్నో: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికులు, ఎమ్మెల్యే మధ్య మంగళవారం చోటు చేసుకుంది. ఎయిరిండియా ఎఐ-837 విమానం మంగళవారం ఢిల్లీ నుంచి లక్నోకి బయలుదేరింది. ఆ విమానంలో అమేథీ.. గౌరీగుంజ్ ఎమ్మెల్యే రాకేశ్ ప్రతాప్‌సింగ్ ఉన్నారు. తన తోటి ప్రయణికుడు సమద్ అనే వ్యక్తితో ఎమ్మెల్యేకి వాద్వాగం జరిగింది. తొలుత సమద్ గట్టిగా అరవడంతో రాకేశ్ జోక్యం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సమద్ అసభ్యపదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అంతేకాక.. ఆయనపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో సిబ్బంది కలగజేసుకొని గొడవను పరిష్కరించారు.
అయితే విమానం లక్నోలో ల్యాండైన వెంటనే ప్రయాణికుడిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేసి ఫతేపుర్ జిల్లాలో సమద్‌ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు..
క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటాం: బి. శివధర్ రెడ్డి
హైదరాబాద్: లక్డీకపూల్ లోని డిజిపి కార్యాలయంలో కొత్త డిజిపిగా బి. శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డిజిపి కార్యాలయంలోని ఛాంబర్లో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 1994 బ్యాచ్ కు ఐపిఎస్ అధికారి బి. శివధర్ రెడ్డి చెందారు. ఈ సందరర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. బేసిక్ పోలీసింగ్ సాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామని, క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామని తెలిపారు.
పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని నక్సల్ నేత ఇటీవల లేఖ రాశారని, జనజీవన స్రవంతిలో కలవాలని నక్సల్ ను కోరుతున్నామని అన్నారు. లొంగిపోయిన నక్సల్ కు అన్ని రకాలుగా అండగా ఉంటామని, సమాజాభివృద్ధిలో భాగం కావాలని నక్సల్ ను కోరుతున్నామని డిజిపి పేర్కొన్నారు. పిఎస్ ల సంఖ్య కంటే పోలీసుల్లో నైపుణ్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, పోలీసుశాఖ ప్రత్యేక విభాగాల్లోని ఖాళీలను నిపుణులతో భర్తీ చేస్తామని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నకిలీ వార్తల ప్రచారం, వ్యక్తిత్వ హననం చేస్తే కఠిన చర్యలు తప్పవని డిజిపి శివధర్ రెడ్డి హెచ్చరించారు.
ఈఎంఐలు చెల్లించకపోతే మీ మొబైల్‌ను బ్యాంకులు లాక్ చేస్తాయా? ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారంటే
భారత సంస్కృతికి మూలం మన కుటుంబ విలువలే : మోడి
ఢిల్లీ: అసత్యంపై సత్యం.. అన్యాయంపై న్యాయం.. అధర్మంపై ధర్మం గెలుస్తుందని, భారత ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. దేశానికి సేవ చేసేందుకు సంఘ్ కార్యకర్తలు ఎప్పడూ ముందుంటారని అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలకు మోడి హాజరయ్యారు. రూ.వంద నాణెం, పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోడి మీడియాతో మాట్లాడుతూ.. శతాబ్ది వేడుకలు చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం మహర్నవమి శుభదినం అని గురువారం విజయదశమి అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నది తన ప్రవాహంలో అనేక భూముల్లో పచ్చదనం పెంచుతుందని, నది ప్రవాహంలా ఆర్ఎస్ఎస్ కూడా ప్రజలకు సేవ చేస్తోందని చెప్పారు.
విద్య, వైద్యం, రైతులకు అనేక విధాలుగా సంఘ్ సేవలు అందిస్తోందని, మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు సంఘ్ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఆర్ఎస్ఎస్ చేసే ప్రతి పనిలో ఒకటే కనిపిస్తోందని.. అదే నేషనల్ ఫస్ట్ అని మోడి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ.. ప్రతి ఒక్కరి నినాదం కావాలని, వోకల్ ఫర్ లోకల్ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయం కల్పన దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన బలమని తెలియజేశారు. భారత సంస్కృతికి మూలం మన కుటుంబ విలువలేనని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంట్లో పెద్దలను గౌరవించాలని.. పిల్లలను ప్రోత్సహించాలని.. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత చిత్తశుద్ధితో నిర్వహిస్తేనే వికసిత్ భారత్ సాధ్యమని మోడి స్పష్టం చేశారు.
అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిన మల్లికార్జున్ ఖర్గే
కెప్టెన్సీ తీసుకొనే ముందు ఆ ముగ్గురితో మాట్లాడా: గిల్
టెస్ట్ క్రికెట్‌కి రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంతో అతడి స్థానంలో కెప్టెన్‌గా ఎవరు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా శుభ్‌మాన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మొదటి సిరీసే పటిష్టమైన ఇంగ్లండ్‌తో తలపడే సవాల్‌ను గిల్ ముందుంచారు. అయితే ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో శుభ్‌మాన్ భారత జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. సిరీస్ డ్రాగా ముగిసింది. మరోవైపు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసింది కూడా గిల్‌యే కావడం మరో విశేషం. అయితే ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కి గిల్ సన్నద్ధమవుతున్నాడు. ఈ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొనే ముందు సచిన్ టెండూల్కర్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్‌సన్‌ల నుంచి సలహాలు తీసుకున్నట్లు అతడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
సచిన్‌తో తొలుత మాట్లాడాలంటే భయం వేసిందని.. కానీ, మాట్లాడాక మాత్రం అద్భుతమైన అనుభూతి కలిగిందని శుభ్‌మాన్ గిల్ పేర్కొన్నాడు. మిడాఫ్ ఆడేటప్పుడు బంతిని స్టంప్స్ పైకి రానివ్వకుండా చూడాలని.. అప్పుడు అలాంటి బంతులు స్క్వేర్ లెగ్ వైపు ఆడేందుకు వీలుంటుందని సచిన్ సూచించినట్లు తెలిపాడు. తన బ్యాటింగ్‌లో లోపాలను సచిన్ కనిపెట్టారని.. ఆ తర్వాత నుంచి నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్ చేశానని గుర్తు చేసుకున్నాడు.
ఇక స్టీవ్ స్మిత్ మానసికంగా బలంగా ఉండాలని చెప్పాడని గిల్ అన్నాడు. ఇంగ్లండ్ పేసర్లను ఎదురుకొవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలని స్మిత్ చెప్పాడన్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా మంచి సూచనలు ఇచ్చాడని గిల్ తెలిపాడు.