admin
హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా?
హైదరాబాద్: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. బిసి రిజర్వేషన్లపై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు ధర్మాసనం స్వీకరించలేమని తెలిపింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వనందువల్ల సుప్ర్రీం కోర్టుకు పిటిషనర్ వచ్చామన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని ప్రశ్నించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేశారు.
అంబేడ్కర్ విగ్రహం తగలబెట్టి… ఫిర్యాదుదారుడు అరెస్టు… ఇది మీకు న్యాయామా?
అమరావతి: అంబేడ్కర్ విగ్రహం తగలబెట్టారని ఫిర్యాదు ఇచ్చిన మా నాన్ననే అరెస్ట్ చేశారని దేవళంపేట దళిత సర్పంచ్ గోవిందయ్య కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘జరిగిన విషయం ఏంటీ?… పోలీసులు మా నాన్న మీద పెట్టిన కేసు ఏంటీ?.. ఇది మీకు న్యాయమా?’ అని ప్రశ్నించారు. టిడిపి నేత సతీష్ నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అతడు ప్రశ్నించాడు. మా నాన్న లాకప్ డెత్ అయితే పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు. దేవళంపేట ప్రధాన కూడలిలో మూడు రోజుల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. విగ్రహానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు, దళితులు డిమాండ్ చేశారు. టిడిపి నేత సతీష్ నాయుడు, అతని అనుచరులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారని దళిత సర్పంచ్ చొక్కా గోవిందయ్య ఆరోపణలు చేసిన విషయం విధితమే.
–
ఎంబిబిఎస్ విద్యార్థినిపై అత్యాచారం… వీడియో రికార్డు… బ్లాక్‌మెయిల్
ఢిల్లీ: స్నేహం పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఎంబిబిఎస్ విద్యార్థినిపై స్నేహితుడు అత్యాచారం చేసి అనంతరం వీడియో రికార్డు చేశాడు. దీంతో అతడిపై ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మెడికో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన ఓ ఎంబిబిఎస్ విద్యార్థిని ఢిల్లీలోని ఆదర్శ్‌నగర్ ప్రాంతంలో డా.బాబా సాహెబ్ అంబేడ్కర్ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటుంది. అమన్‌ప్రీత్ అనే యువకుడు మాయమాటలతో యువతికి పరిచయమయ్యాడు. పరిచయం కాస్త చనువుగా మారడంతో స్నేహం పేరుతో ఆపిల్ హోటల్ కు తీసుకెళ్లాడు. హోటల్ రూమ్‌లో ఆమెపై అత్యాచారం చేసి వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడంతో తనతో కలిసి ఉండాలని బలవంతం చేస్తున్నాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూటమి పాలనలో కల్తి మద్యం ఏరులై పారుతోంది: భూమన
అమరావతి: కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసు అంటూ వైఎస్ఆర్ సిపిపై దుష్ప్రచారం చేశారని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నకిలి మద్యాన్ని కుటీర పరిశ్రమలా మార్చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి నేతల పోరాటం వల్లే కల్తి మద్యం బయటపడిందని, కూటమి పాలనలో మద్యం షాపులు బార్ లా మారిపోయాయని భూమన విమర్శించారు. నకిలీ మద్యాన్ని పల్లెపల్లెకు పంపారని, కూటమి పాలనలో కల్తి మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి, జనసేన నేతల కల్తి మద్యం దందా నడుస్తోందని, ఎపిలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తి మద్యమే అని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కల్తీ మద్యం ఏరులై పారుతోంది: భూమన
అమరావతి: కూటమి ప్రభుత్వం లిక్కర్ కేసు అంటూ వైఎస్ఆర్ సిపిపై దుష్ప్రచారం చేశారని వైసిపి మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమలా మార్చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సిపి నేతల పోరాటం వల్లే కల్తీ మద్యం బయటపడిందని, కూటమి పాలనలో మద్యం షాపులు బార్ లా మారిపోయాయని భూమన విమర్శించారు. నకిలీ మద్యాన్ని పల్లెపల్లెకు పంపారని, కూటమి పాలనలో కల్తీ మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో టిడిపి, జనసేన నేతల కల్తీ మద్యం దందా నడుస్తోందని, ఎపిలో అన్ని వైన్ షాపుల్లో దొరికేది కల్తీ మద్యమే అని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
రాంగ్ నంబర్ కాల్… అదృశ్యమైన రెండు సంవత్సరాల తరువాత అస్థిపంజరం లభ్యం
లక్నో: రాంగ్ నంబర్ కాల్ ఓ యువతి ప్రాణం తీసింది. యువతి అదృశ్యమైన రెండున్నర సంవత్సరాల తరువాత ఆమె అస్థిపంజరం లభించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2023 ఫిబ్రవరిలో సోనమ్ అనే వివాహిత ఓ రాంగ్ నంబర్‌కు కాల్ చేసింది. మస్‌దూల్ అనే వ్యక్తి ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి అడిగాడు. ఫోన్ కాల్ ఇద్దరు మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పటికే సోనమ్‌కు భర్త ఉన్నాడు. ఆమె భర్త జీవనోపాధి నిమిత్తం యుపి బయట నివసిస్తున్నాడు. 2023 అగస్టు 6న ఆమె కనిపించకపోవడంతో మామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు, కానీ ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు. ఆరుగురు పోలీస్ అధికారులు మారిన కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో కేసును మూలకు పడేశారు.
నాలుగు నెలల క్రితం ఎఎస్‌పి నృపేంద్ర సోనమ్ అదృశ్యం కేసు దర్యాప్తు పున:ప్రారంభించారు. ఆమె సెల్‌ఫోన్‌కు వచ్చిన 3000 ఫోన్ కాల్స్ రికార్డును పరిశీలించాడు. సోనమ్ రాంగ్ నంబర్ కాల్ గురించి వివరాలు ఆరా తీశాడు. గుజరాత్‌కు చెందిన మస్‌దూల్‌గా గుర్తించారు. మస్‌దూల్ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సోనమ్‌తో ఢిల్లీలో సహజీవనం చేశానని అనంతరం హర్దోయ్‌లో కొంత కాలం ఒకే ఇంట్లో ఉన్నామని వివరించాడు. 2023 అగస్టు 23న సోనమ్‌తో మస్‌దూల్ గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో మస్‌దూల్ తన తమ్ముడు షామ్స్‌దూల్, తండ్రి అయూబ్‌తో కలిసి ఆమెను చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశాడు. పోలీసులు మళ్లీ కేసు నమోదు చేసి పోలీసులు బావిలో నుంచి అస్థిపంజరం బయటకు తీసి పోస్టుమార్టమ్‌కు పంపారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇంజిన్‌లో సమస్యతో మిర్యాలగూడలో నిలిచిన హౌరా ఎక్స్‌ప్రెస్!
ఈనెల 8న తెలంగాణ హైకోర్టు లో విచారణ ఉంది: పొన్నం
హైదరాబాద్: రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో గవర్నర్ కు పంపించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇంటింటి సర్వే నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులోవాదనలు జరిగాయని, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొచ్చని చెప్పారని, ఈనెల 8న తెలంగాణ హైకోర్టు లో విచారణ ఉందని తెలియజేశారు. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఆకట్టుకుంటున్న ‘సింగారి..’
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. మ్యూజిక్ ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘సింగారి’ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ పాటను స్వయంగా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి పాడారు. ఎనర్జిటిక్ బీట్స్, క్యాచి లిరిక్స్, యూత్ ఎనర్జీ ఈ సాంగ్‌ని ఒక ఫన్ ప్యాకేజ్‌లా మార్చేశాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆకట్టుకునే లిరిక్స్ సాంగ్‌కి అదనపు ఉత్సాహం తీసుకొచ్చింది. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి సందర్భంగా, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.