admin
దేశాభివృద్ధికి వలసల దెబ్బ!
చిత్తశుద్ధి లేని శివపూజలేల?
కారు చౌక
ప్రస్తుతం పెట్రోలు వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) ధరలు మరో 4 నుంచి నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా మారనున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో జరిగిన 20వ ఫిక్కీ హయ్యర్ ఎడ్యుకేషన్ సమ్మిట్ 2025లో ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం ప్రస్తుతం సంవత్సరానికి రూ. 22 లక్షల కోట్లను ఇంధన దిగుమతుల కోసం ఖర్చు చేస్తోంది. ఇది ఆర్థిక భారమే కాకుండా పర్యావరణానికి కూడా ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. 4నుంచి నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా మారతాయి. ఇది భారతదేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పెద్ద అడుగుగా నిలుస్తుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నం.1గా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వివరించారు. నేను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లు, ఇప్పుడు అది రూ. 22 లక్షల కోట్లకు పెరిగింది అని అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ. 78 లక్షల కోట్లు, చైనా రూ. 47 లక్షల కోట్లు కాగా, భారత్ రూ. 22 లక్షల కోట్ల స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. భారత రైతులు మొక్కజొన్న నుండి ఇథనాల్ తయారీ ద్వారా అదనంగా రూ. 45,000 కోట్లు ఆర్జించారు. ఇది గ్రీన్ ఎనర్జీ దిశగా ఒక పెద్ద అడుగు అని అన్నారు.
మరో కొత్త స్కీమ్ పై ఏపీ సర్కార్ కసరత్తు – పావలా వడ్డీకే విద్యార్థులకు రుణాలు..!
రూ.9000కోట్లు
తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటిసారిగా తమ మా న్యుఫాక్చరింగ్ హబ్‌ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎలి లిల్లీ కం పెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలి లిల్లీ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో సమావేశమైన తరువాత ఎల్ లిల్లీ కంపెనీ తమ విస్తరణ ప్ర ణాళికలు, తెలంగాణలో భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చే సింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స హకారంతో దేశంలో అధునాతన త యారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ
ప్రకటించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే మాన్యుఫాక్షరింగ్, క్వాలిటీ హబ్ తమకు అత్యంత కీలకమైందని కంపెనీ ప్రకటించింది. ఇక్కడి నుంచే దేశంలో ఉన్న ఎల్ లిల్లీ కాంట్రాక్ మాన్యుఫాక్షరింగ్ నెట్‌వర్క్ సాంకేతిక పర్యవేక్షణ, నాణ్యత నియంత్రణ, అధునాతన సాంకేతిక సామర్థ్యాలను అందించనుంది. కొత్త హబ్ ఏర్పాటుతో మన రాష్ట్రంతో పాటు దేశంలో ఫార్మా రంగంలో పని చేస్తున్న వేలాది మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వీలైనంత తొందరలోనే కెమిస్టులు, అనలిటికల్ సైంటిస్టులు, క్వాలిటీ కంట్రోల్, మేనేజ్‌మెంట్ నిపుణులు, ఇంజనీర్ల నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అమెరికాకు చెందిన ఎల్ లిల్లీ కంపెనీకి 150 ఏళ్లుగా ప్రపంచ వ్యాపంగా ఔషధాల తయారీ రంగంలో విశేషమైన వైద్య సేవలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ అధునాతన యూనిట్ తెలంగాణను ఆధునిక ఆరోగ్య పెట్టుబడుల గమ్యస్థానంగా నిలబెట్టనుంది. ప్రధానంగా డయాబెటిస్, ఓబెసిటీ, ఆల్జీమర్, క్యాన్సర్, ఇమ్యూన్ వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, కొత్త ఆవిష్కరణలపై ఈ కంపెనీ పని చేస్తుంది. ఇండియాలో ఇప్పటికే గురుగ్రామ్, బెంగుళూరులో ఎల్ లిల్లీ కంపెనీ కార్యకలాపాలున్నాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది ఆగష్టులోనే గ్లోబల్ కెపాబులిటీ సెంటర్‌ను ప్రారంభించింది.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుంది: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌లో ఎల్ లిల్లీ కంపెనీ విస్తరణ తెలంగాణలో పరిశ్రమల విస్తరణ తీరును ప్రతిబింబిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తుందని అన్నారు. ఎల్ లిల్లీ విస్తరణ ఫార్మా రంగానికి కొత్త ఉత్తేజం అందిస్తుందని, ఇప్పటికే లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ వేగవంతమైన వృద్ధి సాధిస్తోందని ఆయన అన్నారు.
ఎకరానికి రూ.177 కోట్లు
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొం ది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన వేలంపాటలో ఎకరానికి రూ. 177 కోట్లు చొప్పున ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం 7.67 ఎకరా ల భూమిని ఆ సంస్థ వేలంలో రూ. 1357.59 కోట్లకు దక్కించుకుంది. ప్రారంభ ధరను టిజిఐఐసి ఎకరాకు రూ.101 కోట్లుగా వేలం వేయ గా చివరకు ఒక ఎకరాకు రూ.177 కోట్లు చొ ప్పున రాయదుర్గం నాలెడ్జ్ భూములను ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ దక్కించుకుని రికార్డు నెలకొల్పింది. దక్షిణ భారతదేశంలోనే ఇది అత్యధిక ధరగా చెబుతున్నారు. శేరిలింగంపల్లి మం డలం రాయదుర్గం
పాన్మక్త గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 83/1 లోని మ్తొం 18.67 ఎకరాలను వేలం వేసేందుకు గత నెల 3వ తేదీన టిజిఐఐసి ప్రకటన విడుదల చేసింది. కాగా 2017లో 2.84 ఎకరాల విస్తీర్ణంలో రాయదుర్గంలో ఎకరానికి రూ. 42.59 కోట్లు పలికాయి. 2022లో హెచ్‌ఎండిఎ నిర్వహించిన నియోపోలిస్, కోకాపేట వేలంపాటలు ఎకరానికి రూ. 100.75 కోట్ల వరకు ఆర్జించాయి. 2025లో రాయదుర్గం ఎకరానికి రూ. 177కోట్ల బెంచ్‌మార్క్‌ను సాధించింది. ఇది నాలుగు రెట్లు పెరుగుదలను సూచించింది.రాయదుర్గంలో ఎకరానికి రూ. 177 కోట్లు సాధించడం -నియోపోలిస్‌లో ఎకరానికి రూ. 101 కోట్ల బెంచ్‌మార్క్ కంటే దాదాపు 75 శాతం ఎక్కువ. హైదరాబాద్ అసాధారణ మార్కెట్ బలం, బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్, ప్రపంచ వ్యాపార కేంద్రంగా నగరం పరిణామాన్ని తెలుపుతోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, బలమైన పాలన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, జిసిసి పర్యావరణ వ్యవస్థ ద్వారా హైదరాబాద్ అగ్రశ్రేణి డెవలపర్లను ప్రపంచ సంస్థలను ఆకర్షిస్తూనే ఉంది.
భూమి విలువకు కొత్త బెంచ్‌మార్క్ :
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని రాయదుర్గంలో జరిగిన 7.67 ఎకరాల తాజా వేలంలో భూమి విలువకు కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. ఇది రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం నేతృత్వంలోని వేలంలోనూ ఎకరానికి లభించిన అత్యధిక ధరగా నిలిచింది. ఇది గతంలో హెచ్‌ఎండిఏ నిర్వహించిన వేలంలో 3.60 ఎకరాలకు ఎకరానికి రూ.100.75 కోట్లుగా ఉన్న నియోపోలిస్, కోకాపేట బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. రాయదుర్గం వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ యొక్క స్థిరమైన వృద్ధి, వేలం ప్రక్రియలో పారదర్శకత హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి గుండెకాయగా రాయదుర్గం యొక్క వ్యూహాత్మక విలువపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం నుండి బలమైన విధాన మద్దతును తెలిపింది. ఈ వేలాన్ని జెఎల్‌ఎల్ ఇండియా, ఎంఎస్‌టిసి వేలం భాగస్వామిగా విజయవంతంగా నిర్వహించాయి, ఇది టిజిఐఐసికి ప్రత్యేక లావాదేవీ సలహాదారుగా వ్యవహరించింది, రాష్ట్రానికి గరిష్ట విలువ సాక్షాత్కారాన్ని అందించే పారదర్శక, పోటీ బిడ్డింగ్ ప్రక్రియను నిర్ధారిస్తుంది.
తెలంగాణకు గర్వకారణమైన క్షణం : టిజిఐఐసి విసి,మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక
రాయదుర్గం వేలం తెలంగాణకు గర్వకారణమైన క్షణం అని టిజిఐఐసి విసి, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక అన్నారు. ఎకరానికి రూ. 177 కోట్ల రికార్డు ధర హైదరాబాద్ దీర్ఘకాలిక సామర్థ్యం తెలంగాణ రైజింగ్- 2047 పై పెట్టుబడిదారులు, డెవలపర్లు కలిగి ఉన్న బలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మద్దతుతో పారదర్శక, వ్యాపార అనుకూలమైన, అధిక-వృద్ధి పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతను ఇది పునరుద్ఘాటిస్తుందన్నారు. రాయదుర్గంలో ఈ ఫలితం భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన, పోటీతత్వ పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలపరుస్తుందని చెప్పారు. ఈ ఫలితం తెలంగాణ భూమి విలువ పెరుగుదలలో తాజా మైలురాయిని సూచిస్తుందని చెప్పారు. ఈ వేలాన్ని నిర్వహించే అవకాశాన్ని కార్పొరేషన్‌కు అప్పగించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
అప్పు తీరేదేలా?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంపై రుణాల భారం పెరుగుతోంది. పాత అప్పులు, కొత్త బడ్జెట్‌లో తీసుకోబోయే అప్పులు కలిపి తడిసిమోపెడవుతున్నాయి. చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్ర భుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బడ్జెట్ నిర్వహణ పరిమితులను అప్పుల ద్వారా అధిగమించింది. ఎఫ్‌ఆర్‌బిఎం కింద ఆమోదించిన రుణ అంచనాలకు మించి అదనంగా రూ.5, 500 కోట్లు అప్పు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైం ది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా క్యాలెండర్ ప్రకారం 2025-26 ఆర్థిక సం వత్సరంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రూ. 9,600 కోట్లు రుణం తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రం ఇప్పటికే మొదటి రెండు త్రైమాసికాల్లో (మొదటి ఆరు నెలల్లో) రూ. 49,900 కోట్లు రుణం తీ సుకుంది. ఇది వార్షిక రుణ పరిమితి అయిన రూ. 54,009 కోట్లలో 92 శాతానికి పైగా ఉంది. దీం తో ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి కే వలం రూ. 4,109 కోట్లు మాత్రమే రుణం తీసుకు నే అవకాశం ఉండేది.
కానీ తాజా ప్రతిపాదనతో డిసెంబర్ చివరి నాటికి మొత్తం మార్కెట్ రుణాలు రూ.59,500 కోట్లకు చేరుకుంటాయి. రాష్ట్ర ప్ర భుత్వ ఈ చర్యకు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమో దం లభించింది. 2025- 26 సంవత్సరానికి అం చనాల కన్నా అదనంగా రూ. 15వేల కోట్లు రుణం తీసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అసాధారణంగా అనుమతి ఇచ్చింది. ఈ పరిణామంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం అనుమతించదగిన రుణం రూ. 69,000 కోట్లకు చేరింది. ప్రభుత్వ అనియంత్రిత రుణాలు, తగ్గుతున్న జిఎస్‌టి వసూళ్లు , ఆదాయ స్థిరీకరణ లేకపోవడం వంటివి ఆర్థిక ఇబ్బందులను, బలహీనమైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ రుణాలు పెరిగితే తిరిగి చెల్లింపులు, వడ్డీ భారం ప న్ను చెల్లింపుదారులపై పడుతుందని, ఇది అభివృ ద్ధి పనులపై ఖర్చును తగ్గిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన 22 నెల ల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) రెం డో త్రైమాసికంలో (జూలై- సెప్టెంబర్ మధ్య) కేవలం రెండున్నర నెలల్లోనే ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు అప్పులు తీసుకువచ్చారు. ఈ త్రైమాసికంలో సెక్యూరిటీల ద్వారా రూ.12 వేల కోట్లు సమీకరించాలని ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం సెప్టెంబర్ 30 నాటికి ఏకంగా రూ.32,500 కోట్ల అప్పులు తీసుకుంది. ప్రభుత్వం తాజాగా రిజర్వు బ్యాంక్ నుంచి మరో రూ.4 వేల కోట్ల అప్పు తీసుకుంది. సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఈ రుణాన్ని సమీకరించింది. ఇందులో 27 ఏండ్ల కాలానికి 7.53 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 29 ఏండ్ల కాలానికి 7.52 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 31 ఏండ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో రూ.1,000 కోట్లు, 33 ఏండ్ల కాలానికి 7.44 వార్షిక వడ్డీతో మరో రూ.1,000 కోట్లు తీసుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202526)లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు సమీకరిస్తామని రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం తాజా రుణంతో కలిపి తొలి 6 నెలల్లోనే (ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలోనే) రూ.49,900 కోట్ల అప్పు తీసుకున్నట్లయింది. ఇది వార్షిక రుణ సమీకరణ లక్ష్యంలో దాదాపు 92 శాతానికి సమానం. ఇందులో ఏకంగా రూ.16 వేల కోట్ల రుణాలను ఈ నెలలోనే సమీకరించడం ద్వారా ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మిగిలిన 6 నెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి రూ.4,109 కోట్ల రుణాలు మాత్రమే సమీకరించేందుకు వీలుంది. 202526లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ.5,04,814 కోట్లుగా ఉంటుందని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 28.1 శాతంగా ఉండనుంది. ఈ మొత్తం అప్పులో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.4,07,059 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.23,719 కోట్లు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల రుణాలు రూ.11,202 కోట్లు, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించి రూ.21,787 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్ ఫండ్ రూ.41,048 కోట్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా ఎఫ్‌ఆర్‌బీఎంకు ఆవల కూడా కార్పొరేషన్ల పేరిట అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి కార్పొరేషన్ల అప్పులు మొత్తం రూ.3,01,484 కోట్లుగా ఉన్నాయని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇందులో కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి, ప్రభుత్వమే స్వయంగా చెల్లించే అప్పులు రూ.1,17,109 కోట్లు కాగా, ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్లు తీసుకుని, కార్పొరేషన్లే చెల్లించే రుణాలు రూ.1,24,419 కోట్లు అని వివరించింది. ఇవే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ.59,956 కోట్లు అని పేర్కొంది. ఇలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పు రూ.5,04,814 కోట్లు, కార్పొరేషన్ల కోసం సేకరించిన అప్పు రూ.3,01,484 కోట్లు కలిపి మొత్తం అప్పు రూ.8,06,298 కోట్లుగా తేలుతోంది.
ఇక మిగిలింది రూ.4,109 కోట్లే : ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.64,539 కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రభుత్వం అందులో రూ.54,009 కోట్లు ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా సమీకరించాలని నిర్ణయించింది. తొలి 6 నెలల్లోనే రూ.49,900 కోట్ల అప్పు తీసుకుంది. ఇది వార్షిక రుణ లక్ష్యంలో దాదాపు 92 శాతానికి సమానం. దీంతో మిగిలిన 6 నెలల్లో రూ.4,109 కోట్ల రుణాలు మాత్రమే సమీకరించాల్సి ఉంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరిన్ని రుణాలు అవసరమని తెలంగాణ ప్రభుత్వం కోరినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నెల (అక్టోబరు) నుంచి డిసెంబరు వరకు 3 నెలల్లో దశలవారీగా రూ. 9,600 కోట్ల రుణాలు సేకరించనుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుందని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న రుణాలు బడ్జెట్ అంచనాలను మించనున్నాయి. మొత్తం రూ. 54,009 కోట్ల కొత్త రుణాలు సేకరించనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఈ ఏడాది తొలి అర్ధ భాగం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు) లోనే రూ.48 వేల కోట్లు సేకరించింది. పాత రుణాల చెల్లింపులకు తీసుకునేవాటిని ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యమైన రూ.54 వేల కోట్లలో కలపవద్దని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. అధిక వడ్డీలకు తీసుకున్న రూ.30 వేల కోట్ల పాత బాకీలను పూర్తిగా తీర్చేస్తే వడ్డీల భారం తగ్గి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఇందుకోసమే రుణాల సమీకరణ పెరగనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జీఎస్‌టి ఆదాయంలో లోటును కేంద్రం పూడ్చకపోతే జీఎస్టీ శ్లాబుల సవరణతో బడ్జెట్ అంచనా వేసిన దానికన్నా రూ.7 వేల కోట్ల వరకు పన్నుల ఆదాయం తగ్గవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
పెరుగుతోన్న జీతాలు, పెన్షన్ల వ్యయం
తెలంగాణ ప్రభుత్వం వివిధ కేటగిరీల ఉద్యోగులకు చెల్లించే జీతాలు, పెన్షన్ల వ్యయం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఎన్. శివ శంకర్ నేతృత్వంలోని రెండవ వేతన సవరణ కమిషన్‌పై ప్రభుత్వం ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. 2014-15లో రూ 14,849 కోట్ల నుంచి 2022 23లో రూ 41,495 కోట్లకు జీతాలు, పెన్షన్ల వ్యయం పెరిగింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకారం, 2022-23లో పే రోల్స్‌లో ఉన్న ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 25,769 కోట్లుగా ఉంది. అదే సంవత్సరంలో పెన్షన్ల కోసం మరో రూ. 15,816 కోట్లు ఖర్చయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదైన 2014-15లో రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు రూ. 10,639 కోట్లు ఉండగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిన భారీ ఫిట్‌మెంట్ కారణంగా 2015-16 నాటికి ఇది దాదాపు రెట్టింపై రూ. 18,065 కోట్లకు చేరింది. అదే కాలంలో పెన్షన్లు కూడా రూ. 4,210 కోట్ల నుంచి రూ. 8,217 కోట్లకు పెరిగాయి. రిటైర్డ్ అధికారి సి.ఆర్. బిస్వాల్ చేసిన పిఆర్‌సి సిఫారసులను ప్రభుత్వం అమలు చేయడంతో 2021-22 , 2022- 23 మధ్య జీతాలు,
పెన్షన్ల చెల్లింపుల్లో మరో భారీ పెరుగుదల కనిపించింది. ఈ కాలంలో జీతాలు రూ. 22,150 కోట్ల నుంచి రూ. 25,679 కోట్లకు, పెన్షన్లు రూ. 14,025 కోట్ల నుంచి రూ. 15,816 కోట్లకు పెరిగాయి. ఈ పెరిగిన జీతాలు, పెన్షన్ల వ్యయం వర్క్-ఛార్జ్ సిబ్బంది, గ్రాంట్- ఇన్ -ఎయిడ్ ఉద్యోగులు, హోంగార్డులు, దినసరి కూలీలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వంటి వారికి చేసే చెల్లింపులకు అదనం. ప్రణాళికా శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 9.16 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 5.7 లక్షల మంది పే రోల్ ఉద్యోగులు, పెన్షనర్లు కాగా, 3.6 లక్షల మంది ఇతరులు ఉన్నారు. గత ఏడాది నుంచి వివిధ పోస్టులకు నియామకాలు జరుగుతున్నందున రానున్న రోజుల్లో జీతాల చెల్లింపుల భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే ఉన్న ఖాళీలను భర్తీ చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ వాస్తవ నియామకాల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్. శివ శంకర్ నేతృత్వంలోని పిఆర్‌సి నివేదిక జూలై 1, 2023 నుంచే అమలు కావాల్సి ఉండగా దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటున్నారు.
మావోయిస్టుల్లో మల్లోజుల ముసలం
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీలో పెను ప్రకంపనలు రేగాయి. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణు గోపాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సాయుధ పోరా టాన్ని విరమించాలని క్యాడర్‌కు పిలుపునిస్తూ ఆయన రాసిన 22 పేజీల లేఖ ఇప్పు డు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని అనివార్య కార ణాల వల్ల, ఈ పదవిలో కొనసాగే అర్హత తనకు లేదని భావించి పార్టీని వీడుతున్నట్లు ఆ యన స్పష్టం చేశారు. ఈమేరకు పార్టీ క్యాడర్‌ను ఉద్దేశిం చి ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘ఆయుధాలు వదిలేస్తాంఅంటూ కొద్దిరోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఓ ప్రకటన విడుదల చేశా రు.
అభయ్ తన వద్ద గల ఆయుధా లను అప్పగించాలని, లేనిపక్షంలో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వా ధీనం చేసుకుంటుందుని పార్టీ ప్రకటన జారీ చేసిం ది. క్యాడర్‌కు లేఖ రాసిన మావో యిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల ఈ అంశంపై వివరణ ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి జగన్‌కు మల్లోజుల కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్న ప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ లేఖలో వెల్లడించారు. పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయా మంటూ క్షమాపణలు చెప్పారు. పార్టీ క్యాడర్‌ను కాపాడుకొని అనవసర త్యాగాలకు పుల్ స్టాప్ పెట్టాలని మల్లోజుల పిలుపునిచ్చారు. మావోయి స్టు పార్టీ ఇప్పటి వరకు కొనసాగించిన పంధా పూర్తిగా తప్పిదమే అని అంగీకరించారు. తప్పుల నుంచి గుణ పాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫాసిస్టు పరిస్థితులలో మావోల లక్ష్యాన్ని నెరవేర్చలేమన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్‌కు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల పిలుపునిచ్చారు.
మల్లోజుల లొంగిపోయే ఛాన్స్…!?
మల్లోజుల వేణుగోపాల్ దివంగత మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీకి తమ్ముడు. వేణుగోపాల్ స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మృతిచెందాడు. ఆ తర్వాత వేణుగోపాల్ భా ర్య తారా లొంగిపోయా రు. కిషన్ జీ భార్య మావోయిస్టు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన ఎలియాస్ సుజాత కూడా ఈ సెప్టెంబర్ నెలలోనే పోలీసులకు లొంగిపోయారు. అటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవ రావు (ఆశన్న) కూడా లొంగుబాటు వైపు అడుగులు వేస్తున్నారని ఊహా గానాలు జోరు గా వినిపిస్తున్నాయి. మావోయిస్టు పార్టీని వచ్చే ఏడాది మార్చి 31లోపు తుదముట్టిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటిం చారు. ఈ మేర కు బలగాలు మావోయిస్టులను వెంటాడుతున్నా యి. ఈ క్రమంలో చాలా మంది పెద్ద స్థాయి నక్సలైట్లు ఎన్ కౌంటర్‌లో చనిపో తున్నారు. కొంత మంది లొంగిపోతున్నారు. ఈ క్రమంలో మల్లోజుల కూ డా లొంగిపోయే అవకాశా లు కనిపిస్తున్నాయి.
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
న్యూఢిల్లీ/హైదరాబాద్ సిటీబ్యూరో : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తో పాటు పలు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల కు ఉపఎన్నికలను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ లోని జూబ్లీ హి ల్స్ అసెంబ్లీ స్థానంతో పాటు, జమ్మూకశ్మీర్ , ఒడిశా, జార్ఖండ్, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్‌లో ఉపఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 14న జరుగుతుంది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. కాగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ హైదరాబాద్‌లో జారీ చేశారు. జీహెచ్‌ఎంసి
ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు షెడ్యూల్ జారీ కావటంతో హైదరాబాద్ జిల్లా మొత్తంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని కర్ణన్ ప్రకటించారు.ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈ నెల 13న జారీ చేయనున్నట్టు తెలిపారు. నవంబర్ 11న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు కర్ణన్ తెలిపారు. నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 21గా ప్రకటించారు.
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 వరకు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా అక్టోబర్ 24 వెల్లడించారు. పోలింగ్ నవంబర్ 11న, ఓట్ల లెక్కించడం నవంబర్ 14న అనంతరం నవంబర్ 16తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ వెల్లడించారు. కాగా జమ్మూకశ్మీర్‌లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు బుడ్గామ్, నగ్రోటా స్థానాలు 2024 అక్టోబర్ నుంచి ఖాళీగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాలలో పోటీ చేసి, రెండింటిలో గెలిచినా గండేర్ బల్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని ఎంచుకుని బుడ్గామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉంది. 2024 అక్టోబర్ 31న ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో నగ్రోటా స్థానం ఖాళీ అయింది. రాజస్థాన్‌లోని అంటాలో అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ ను తుపాకీ బెదిరింపు కేసులో దోషిగా తేలడంతో అనర్హుడిగా ప్రకటించడంతో అంటాలో స్థానం ఉపఎన్నిక అనివార్యమైంది. మిజోరాం లో 2025 జూలై 21న ఎంఎన్ ఎఫ్ ఎమ్మెల్యే లాల్ట్రింట్టుంగా సై లో మరణించడంతో తంపా అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఒడిశాలో సెప్టెంబర్ 8న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ధోలాకియా మరణించడంతో నువాపా అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జార్ఖండ్ లోని ఘట్నిలా నియోజకవర్గంలో రామదాస్ సోరెన్ మరణంతో ఆ స్థానం ఖాళీ కావడంతో ఉపఎన్నిక జరపాల్సివచ్చింది.పంజాబ్ లో కాశ్మీర్ సింగ్ సోహల్ మరణంతో తర్న్ తరుణ్ అసెంబ్లీ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ స్థానాలకు నవంబర్ 11న ఉపఎన్నికలు జరుగుతాయి.