elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbet

బిజెపి అభ్యర్థి దీపక్‌రెడ్డికి బి ఫాం అందించిన రాంచంద్రరావు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు గురువారం బి ఫామ్ అందజేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో దీపక్‌రెడ్డికి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రాంచంద్రరావు మాట్లాడుతూ దీపక్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధిలో చేపట్టిన పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

అందుకే.. రష్యా నుంచి ఇండియా చమురు కొంటోంది: అలిపోవ్

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో రష్యా ముడిచమురు ధర చాలా చౌకగా ఉందని, తన దేశ ప్రయోజనాల దృష్టానే భారత్, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొంటోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ గురువారం ఇక్కడ అన్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఇండియా ఆపేయనుందని ప్రధాని నరేంద్ర మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్న కొన్ని గంటలకే డెనిస్ అలిపోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ భారత్ మొత్తం హైడ్రోకార్బన్ దిగుమతుల్లో రష్యా ముడిచమురు వాటా దాదాపు మూడింట ఒక వంతు ఉందని అన్నారు. 

అక్రమాస్తుల కేసులో పంజాబ్ డిఐజి అరెస్టు

చండీగఢ్: అవినీతికి సంబంధించిన కేసులో పంజాబ్ పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డిఐజి) హర్చరన్ సింగ్ భుల్లార్‌ను గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్(సిబిఐ) అరెస్టు చేసింది. భుల్లార్‌ను మోహాలీలోని ఆయన కార్యాలయంలో అరెస్టు చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. 2007 ఐపిఎస్ బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన భుల్లార్ డిఐజి(రోపర్ రేంజ్)గా పనిచేస్తున్నారు.రోపర్ రేంజ్‌లో మొహాలీ, రూప్‌నగర్, ఫతేఘడ్ సాహిబ్ జిల్లాలు ఉన్నాయి. భుల్లార్ గతంలో డిఐజి(పాటియాలా రేంజ్)గా పనిచేశారు. ఆయన జాగ్రాన్, మొహాలీ, సంగ్రూర్‌లలో జాయింట్ డైరెక్టర్,విజిలెన్స్ బ్యూరో, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు.

గుజరాత్ లో మొత్తం మంత్రుల రాజీనామా..

నేడు కొత్త మంత్రి మండలి

పాతవారికి చాలా మందికి షాక్‌లు

అహ్మదాబాద్ ః ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాల రాజకీయ కేంద్ర బిందువు గుజరాత్‌లో శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి భారీ ప్రక్షాళన జరుగనుంది. ఈ క్రమంలో మంత్రుల తీసివేతలు, కొత్తవారిని తీసుకోవడం కోసం ఒక్కరోజు క్రితం గురువారం మంత్రులంతా తమ రాజీనామాలు సమర్పించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రి మండలిలో 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ సంఖ్యను ఇప్పుడు 26కు విస్తరిస్తారు. ఇప్పుడున్న వారిలో ఐదుగురు లేదా ఆరుగురు పదవులు పదిలంగా ఉండవచ్చు. మిగిలిన వారిపై వేటేసి, వారికి బదులుగా కొత్త ముఖాలను తీసుకుంటారని వెల్లడైంది.

శుక్రవారం నాటి మంత్రివర్గ పునర్వస్థీకరణకు రంగం సిద్ధం అయిందని బిజెపి సీనియర్ నేత ఒకరు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహాయిస్తే మిగిలిన మంత్రులు రాజీనామాలకు దిగారు. కొత్త మంత్రులతో కూడిన జాబితాతో ముఖ్యమంత్రి రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలుసుకోనుండటం కీలక పరిణామం అయింది. శుక్రవారం ఉదయం 11.30కి గుజరాత్ నూతన కేబినెట్ ప్రమాణస్వీకారం స్థానిక మహాత్మా మందిర్ వద్ద జరుగుతుంది. హోం మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా ఈ కార్యక్రమానికి వస్తారు. ఆకస్మికంగా గుజరాత్‌లోని బిజెపి మంత్రిమండలి ప్రక్షాళనకు దారితీసిన కారణాలు వెలుగులోకి రాలేదు. అయితే పనితీరు, నిర్ణీత లక్షాల సాధనలో ఛేదనలో విఫలం అయినందునే వేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయమే ముఖ్యమంత్రి నివాసంలో మంత్రుల సమావేశం జరిగింది. పార్టీ కేంద్ర నాయకత్వం చెప్పినందున తాము కేబినెట్‌ను మార్చివేస్తున్నామని, మంత్రులంతా ముందు రాజీనామాలు చేయాల్సి ఉంటుందని వారికి ఆయన తెలిపారు. వెంటనే వారు అంగీకరించారు. రాజీనామాలు అందించారు.

ఈ క్రమంలో పదవులు ఇక పోతున్నాయనే నిర్థారణ అయిన వారు చాలా మంది తెల్లముఖాలు వేశారు. మంత్రిపదవుల ఆశలపై ఉన్న వారిలో ఉత్సాహం నెలకొంది. సిఎం నివాసంలో జరిగిన సమావేశానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ కూడా హాజరయ్యారు. బిజెపికి గుజరాత్ అత్యంత కీలకమైన రాష్ట్రం అయినందున కేబినెట్‌లో కులాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం సరిగ్గా ఉండేలా చేసుకునేందుకు ఈ విన్యాసానికి దిగినట్లు గుజరాత్ బిజెపి అధ్యక్షులు జగదీష్ విశ్వకర్మ తమ సందేశం వెలువరించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

2027 చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి మరింత పట్టు సాథించుకునేందుకు మంత్రి మండలి కొత్త రూపానికి దిగినట్లు భావిస్తున్నారు. అయితే మరి ఇంత ముందుగానే ఇంతటి షాక్ అవసరం లేదని, ఇప్పటి చర్యకు వేరే కారణాలు ఉండి ఉంటాయని స్థానిక ఆప్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. 

మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి మరో రూ.90 కోట్లు మంజూరు

రాష్ట్రంలోని వరంగల్ శివార్లలో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ద్వారా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మామునూరు విమానాశ్రయం అభివృద్ధి కోసం మొత్తం 280.30 గుంటల భూమిని సేకరించడానికి గతంలోనే అనుమతులు మంజూరు చేశారు. 2024 నవంబర్ 17న జారీ చేసిన జీఓ 43 ద్వారా భూసేకరణ కోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ వరంగల్ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు.

అయితే, విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి అవార్డును ఖరారు చేయడానికి, భూమి కోల్పోయిన వారికి పరిహారం చెల్లించడానికి ఇప్పటికే మంజూరు చేసిన రూ.205 కోట్లతో పాటు అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం అదనంగా రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు భూసేకరణ ప్రక్రియను త్వరగా ముగించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో మొత్తం భూసేకరణ కోసం మొత్తంగా రూ.295 కోట్లు మంజూరయ్యాయి. ఈ విమానాశ్రయం అభివృద్ధి కోసం కన్సల్టెన్సీ సేవలను అందించడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కన్సల్టెంట్‌గా నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఎసిబి వలలో నల్గొండ స్టేషన్ ఫైర్ ఆఫీసర్

మన తెలంగాణ/నల్గొండ రూరల్: నల్లగొండ అగ్నిమాపక అధికారి ఏ.సత్యనారాయణరెడ్డిని గురువారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. క్రాకర్స్ దుకాణం అనుమతి కోసం రూ.8 వేలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి డిఎస్‌పి జగదీశ్‌రెడ్డి తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా నిర్మానుష్య ప్రదేశంలో బాణసంచా దుకాణాన్ని నడపడానికి ఫిర్యాదుదారుడి తాత్కాలిక లైసెన్స్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి అగ్నిమాపక అధికారిని సంప్రదించాడు. రెవెన్యూ, పోలీస్ అధికారుల అనుమతులు తీసుకుని తదుపరి అనుమతి కోసం ఫిర్యాదుదారుడు అన్ని రకాల అనుమతులతో ఫైర్ అధికారిని సంప్రదించాడు.

అయితే, దీనికి రూ.10 వేలు లంచం కావాలని ఫైర్ అధికారి డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు గురువారం సాయంత్రం సదరు అగ్నిమాపక అధికారికి రూ.8 వేలు ఇచ్చేందుకు సంప్రదించగా కార్యాలయం పక్కనే ఉన్న ఎన్‌జి కళాశాల గ్రౌండ్‌లో కలవాలని సూచించాడు. బాధితుడి నుండి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా నల్గొండ రేంజ్ యూనిట్ ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలో పనిచేసే అధికారి బైక్ ట్యాంక్ కవర్ నుండి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సత్యనారాయణరెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయని వాటిన్నింటిపై కూడా పూర్తి విచారణ చేసి నాంపల్లి ఎసిబి కోర్టుకు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న పిఎం మోడీ

కర్నూలు నుండి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరిన ప్రధాని మోదీమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. మల్లికార్జునస్వామి ఆలయంలో మోడీ రుద్రాభిషేకం చేయగా, భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజ చేశారు. ప్రధానితో పాటు కర్నూలు నుండి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడగా అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు.

శ్రీశైలంలో ప్రధాని మోదీభ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించిన అనంతరం ఆయన ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలసి శివాజీ దర్బార్ హాల్, రాజ దర్బార్లో ఉన్న శిల్పాలు, చిత్రాలను చూశారు. ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు. చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు మృతి

మన తెలంగాణ/రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిట్టల నర్సయ్య (62) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నర్సయ్య అప్పుల బాధతో మనస్థాపానికి గురై బుధవారం మధ్యాహ్నం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంగనర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.

ఎస్‌పిసిఈ వెబ్‌సైట్, లోగోను ఆవిష్కరించిన సిఎం రేవంత్‌రెడ్డి

సచివాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (ఎస్‌పిసిఈ) వెబ్‌సైట్, లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డి, హోం శాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్, సిజిజి డిజిపి రవిగుప్త, ఇంటలిజెన్స్ ఏడిజి విజయ్ కుమార్, ఎస్‌పిసిఈ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ శివశంకర్ రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రైతులను బెదిరించి భూములు లాక్కున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం : కోదండరాం

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూ సేకరణ జరిపిందని, అసైన్డ్ భూములకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా రైతులను బెదిరించి భూమిని సేకరించిందని టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అన్నారు. నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం అక్రమంగా అసైన్డ్ భూములను సేకరించిందని, ఆ సేకరణకు వ్యతిరేకంగా రైతుల పక్షాన తెలంగాణ జనసమితి న్యాయ పోరాటం చేసి గెలించిందన్నారు. ప్రభుత్వం ఈ తీర్పును అమలుపరిచి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోదండరాం కోరారు. తెలంగాణలో రైతుల పక్షాన తెలంగాణ జన సమితి ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఉయ్యాలవాడకు చెందిన దళిత రైతుల భూమిని ప్రభుత్వం అక్రమ పద్ధతులలో బెదిరించి ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా తీసుకుందని, ఈ విషయంపై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆ భూమిపై సర్వహక్కులు రైతులకు ఉన్నాయని, వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించిందన్నారు. ఈ సందర్భంగా భూనిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధారసత్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశపాక శ్రీనివాస్, ఈ కేసులను వాదించిన న్యాయవాది మాధవరం రామేశ్వరరావు గురువారం టిజెఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాంను కలిసి తమ పక్షాన నిలబడి, న్యాయ పోరాటానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.