elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel giriş

బంద్‌తో ప్రధానికి కనువిప్పు కలగాలి: మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్: బిసి రిజర్వేషన్ల విషయంలో ఇదే చిత్తశుద్ధితో కేంద్రం వరకు వెళ్దామని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బిసి ఐకాస నిర్వహించిన ధర్నాలో మహేశ్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసి సంఘాల బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తుందని అన్నారు. ఈ బంద్‌కు ఇతర పార్టీల మద్ధతును స్వాగతిస్తున్నామని తెలిపారు. బిసి రిజర్వేషన్లను తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. బిసి రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ప్రజలకు తెలుసని అన్నారు. కేంద్రం తలుచుకుంటే ఒక్కరోజులో చట్టరూపం దాల్చుతుందని పేర్కొన్నారు. సంపూర్ణ బంద్ వల్ల ప్రధానికి కనువిప్పు కలుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా బిసి రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

బిసి బిల్లు బిజెపి చేతిలో ఉంది: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బిసిల బిల్లుకు మద్దతు తెలపడంతో పాటు పాస్ చేసుకోవడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో తదుపరి చర్యలు తీసుకోపోవడంతో బిసి బిల్లు అమలులో జాప్యం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించామని, శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదని, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తున్నామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు, బిసి సంఘాలు ఐక్య సమితిగా బంద్ కి పిలునిచ్చినందుకు వారికి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. బిసి రిజర్వేషన్ల కోసం తెలంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగిందని పొన్నం వివరించారు. 

ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభావం ప్రభుత్వాలపై పడడంలేదని, ముఖ్యంగా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, బిజెపి ఎంపిలంత తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా బిజెపి నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో బిసి బిల్లు కోసం కాంగ్రెస్ బాధ్యత నిర్వహించిందని, కేంద్రంలో బిజెపిపై ఉందన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ న్యాయ స్థానంలో అయినా తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల బంద్ లో పాల్గొన్న ప్రజలకు పొన్నం అభినందనలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మన పోరాటం కొనసాగాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి జెఎసి పోరాటాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.  గత రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని పొన్నం మండిపడ్డారు. 

హైదర్ గూడలో యువతితో పోకిరి అసభ్య ప్రవర్తన

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పోకిరీ రెచ్చి పోయారు. హైదర్ గూడ బస్ స్టాప్ వద్ద ఓ యువతితో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు.  ఫోన్ నెంబర్ కావాలంటూ యువతిని పోకిరి అడ్డుకున్నాడు. యువతికి పోకిరి మధ్య పెనుగులాట జరగడంతో అరగంట పాటు ఆమెను అడ్డుకున్నారు. స్థానికులు, యువతి బంధువులు గమనించి పోకిరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. స్థానికుల దాడిలో పోకిరి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అమీర్ పేట్ నుండి రాజేంద్రనగర్ వరకు యువతిని పోకిరి వెంబడించారు. యువతి హైదర్ గూడ వద్ద బస్ దిగగానే ఆమె వెంట పోకిరి పడ్డాడు. యువతి భయంతో వణికి పోయింది. గత నెల రోజులుగా తన వెంట పడుతున్నాడు అంటూ రాజేంద్రనగర్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిజాయితీ లేకపోవడంతో రిజర్వేషన్లు అమలు కావడంలేదు: ఈటెల

హైదరాబాద్: బిసి రిజర్వేషన్లు అమలు కావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. అన్నీ తెలిసి కూడా బిసిలను సిఎం రేవంత్ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 42% రిజర్వేషన్ల కోసం జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి శ్రేణులతో కలిసి తెలంగాణ బంద్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. బిసిలు 52 శాతం ఉంటే 42 శాతమని కాకి లెక్కలు చెబుతున్నారని బిజెపి ఎంపి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తాను చెప్పేది అబద్ధమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తాను మాట్లాడిన మాటలపై ఎక్కడైన చర్చకు సిద్ధంగా ఉన్నామని, బిసిలు యాచించే స్థాయిలో కాదు శాసించే స్థాయిలో ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబాలకే అధికారం ఉంటుందని ఈటెల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా ఒక్క బిసి సిఎం కాలేకపోయారని, బిజెపి నిజాయితీ ఎవరూ శంకించలేదని, స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు రాష్ట్రం ఒక్కటే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి కమిషన్ వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిసి పేరుతో కమిషన్లు వేసినా నిజాయితీ లేకపోవడంతో అమలు కావడంలేదన్నారు. 

యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది: రషీద్ ఖాన్

కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లతో  పాటు మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. ఆప్ఘానిస్థాన్ లోని ప్రావిన్స్‌లో పాకిస్తాన్‌ వైమానిక దాడి చేయడంతో ఎనిమిది మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఆప్ఘానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వైమానిక దాడిలో కన్నుమూసిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని, పాకిస్థాన్ చేసిన దాడి అత్యంత హేయమైన, అనాగరిక చర్య అని మండిపడ్డారు. ఈ దాడిలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. యువ క్రికెటర్ల లక్ష్యం నెరవేరకుండా జీవితం ముగిసిందని బాధను వ్యక్తం చేశారు. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పాకిస్థాన్‌తో తలపడబోయే ట్రై సిరీస్‌తో తాము పాల్గొనబోమని వెల్లడించారు. ఆట కంటే దేశ సమగ్రత ముఖ్యమని రషీద్ ఖాన్ చెప్పారు. 

ఆ రెండు పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయి: కవిత

హైదరాబాద్‌: పదేపదే బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. రాజకీయ పార్టీలు చేసిన మోసాలతో బిసిలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా మోసాలకి అడ్డుకట్ట వేయాలని సూచించారు. బిసిల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్మించేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆటోలతో ర్యాలీగా బయల్దేరారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్ టిసి బస్సులు హైదరాబాద్‌లో డిపోలకే పరిమితమయ్యాయి. రాజేంద్రనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బండ్లగూడ, హయత్‌నగర్‌, బర్కత్‌పురా, ఇబ్రహీంపట్నం సహా ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఎంజిబిఎస్‌ ముందు బిసి సంఘాల నేతల ఆందోళన చేపట్టారు. జూబ్లీ బస్‌ స్టేషన్‌లో బిసి సంఘాల బైఠాయించారు. జెబిఎస్‌ దగ్గర బంద్‌లో ఎంపి ఈటెల రాజేందర్, బిజెపి నేతలు పాల్గొన్నారు. బిసి బంద్‌తో కాకతీయ విశ్వవిద్యాలయంలో పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. 

చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టిడిపి శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని టిడిపి వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా తమ వాహనాలపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన మరది వైసిపి ఎంపిపి వెంకట రామిరెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారన్నారు. వైసిపి నాయకులు గ్రామంలోకి అడుగు పెట్టొద్దని టిడిపి కార్యకర్తలు కెఇ చంద్ర, శ్రీధర్ గౌడ్, నక్క రాజు, మ‌రి కొంతమంది రాళ్లతో, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మహిళా నాయకురాలు అని చూడకుండా దాడికి పాల్పడ్డార‌ని మాజీ ఎమ్మెల్యే ఆవేద‌న వ్యక్తం చేశారు. టిడిపి గుండాలు గ్రామంలో రెచ్చిపోతూ భయబ్రాంతులకు గురిచేశారని శ్రీదేవి దుయ్యబట్టారు. తమపై దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు బయటకు రావాలంటే ప్రాణభయంతో వణికిపోతున్నారన్నారు.  

రాంగోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదు

అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదైంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్  రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ దేవుళ్లను, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను దూషించినట్లు ఆరోపణల పేరుతో ఫిర్యాదు చేశారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దూషించినట్లు వీడియోలు ఉన్నాయని మేడా శ్రీనివాస్ తెలిపారు. రాంగోపాల్ వర్మతో పాటు యాంకర్ స్వప్నపై చర్యలు తీసుకోవాలని పోలీసులను శ్రీ‌నివాస్‌ కోరారు. ఇద్దరుపై బిఎన్ఎస్ యాక్టు కింద 487/2025, యు/ఎష్ 196 (1), 197(1) 353, 354,299 ఆర్/డబ్యు (3) పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఒఆర్ఎస్ పేరుతో ప్రాణాలు తీస్తున్నారు… వైద్యురాలి 8 ఏళ్ల పోరాటం

పిల్లలకు కానీ పెద్దలకు కానీ నీళ్ల విరేచనాలు వస్తే ఒఆర్ఎస్ ద్రావకం వాడాలి అనేది గత 30 ఏళ్లుగా ప్రాచుర్యం పొందిన ఒక వైద్య ప్రక్రియ. ఒఆర్ఎస్ ద్రావణంలో కొంత ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ ఉంటుంది. దీని వలన ఎక్కువ వాటర్ అబ్జర్బ్ కావడం వలన డిహైడ్రేషన్ భారి నుంచి తప్పించుకోవడమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ రిప్లేస్మెంట్స్ జరుగుతుంది. ఒకవేళ ఒఆర్ఎస్ ద్రావణం అందుబాటులో లేకుంటే నీళ్లలోకి కొంచెం ఉప్పు సోడాపొడి, నిమ్మకాయ రసం పిండుకొని తాగిన కానీ సరిపోతుంది. దానిలోకి ఒక స్పూను చక్కెర వేసుకోవాలి. కానీ చక్కెర మోతాదు ఎక్కువ అయితే ఆ మోషన్స్ ఇంకా ఎక్కువైపోయి డిహైడ్రేషన్ పెరిగిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

సరిగ్గా ఇదే విషయాన్ని ఓ పిల్లల వైద్య నిపుణురాలు గుర్తించింది. ఏమిటి అంటే కొందరు పిల్లలు ఒఆర్ఎస్ ద్రావకం తాగినా కానీ చనిపోతున్నారు. ఏమిటా ఒఆర్ఎస్ ద్రావకము అని చూస్తే అది అన్ని మెడికల్ షాపుల్లో అమ్ముతున్న ఒక బ్రాండెడ్ ద్రావకం. టెట్రా ప్యాక్ లో దానిని అమ్ముతూ ఉన్నారు. ఈ బ్రాండెడ్ ద్రావకం కూడా ఒఆర్ఎస్ అనే పేరుతో అమ్ముతూ దానిలో ఒక చిన్న లెటర్స్ లో దీనిని నీళ్ల విరేచనాలు వస్తే వాడరాదు అని రాశారు.. ఇందులో గ్లూకోజ్ కంటెంట్ చానా రెట్లు ఎక్కువ ఉండడమే కారణం.

శివరంజని అనే హైదరాబాద్ కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ ఇది కనుక్కొని దానిని పేరు మార్చుకోండి ఒఆర్ఎస్ అనేది డబ్ల్యు హెచ్ఒ రూల్ ప్రకారం దానిని దేనికంటే దానికి బ్రాండెడ్ గా ఉపయోగించరాదు. అని చెబితే ఎవరూ వినలేదు, దానికోసం ఆమె కోర్టులో న్యాయపోరాటం చేసి విజయం సాధించింది.. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎనిమిదేళ్ల న్యాయపోరాటం తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేసింది ఒఆర్ఎస్  అనేది ఎటువంటి రూపంలో కూడా పేరును దేనికి సాఫ్ట్ డ్రింక్స్ కు ఉపయోగించరాదు.అది ఒక మందు అది ఒక కూల్డ్రింక్ కాదు అని వివరించింది. 

పిల్లల ప్రాణాల కోసం బాధపడి సామాజిక బాధ్యతగా ఎనిమిదేళ్లు న్యాయపోరాటం చేసిన ఆ శివరంజని చిన్నపిల్లల డాక్టర్ ను మనం అభినందిద్దాం.

ఇటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉండబట్టే మనకు కొంచెం న్యాయం జరుగుతోంది లేకుంటే అందరూ నాకెందుకులే అని అనుకుంటే ఎంతోమంది సైలెంట్ గా చనిపోతూ ఉంటారు. కార్పొరేట్ కంపెనీల ధన దాహానికి బలి అయిపోతూనే ఉంటారు. నిజం అనేది నిష్టూరంగా ఉన్నా కానీ మొదట మన వాళ్లను ఎవరూ పట్టించుకోకపోయినా నిదానంగా అది బయటికి వస్తుంది అనేదానికి ఇదే ఉదాహరణ మీరేమంటారు?

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్లమృతి

కాబూల్: పాకిస్థాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘాన్ క్రికెటర్ల మృతి చెందారు. పాక్టికా ప్రావిన్స్‌లో పాకిస్తాన్‌ వైమానిక దాడి జరిపింది. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్ల సహా 8 మంది చనిపోయారు. పాక్, శ్రీలంకతో ట్రైసిరీస్ ఆడేందుకువెళ్తుండగా ఈ దాడి జరిగింది. మృతి చెందిన క్రికెటర్లు కబీర్, సిబాతుల్లా, హరూన్‌గా ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు అధికారులు వెల్లడించారు. విమానంలో క్రికెటర్లు ఉర్ఘున్ నుంచి షారానా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.  గత వారం రోజుల నుంచి పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో రెండు దేశాల సైనికులు కాల్పులు జరుపుకోవడంతో వందల మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో సైనికులు కూడా ఉన్నారు.