elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbet

నల్లగొండలో వాటర్ ట్యాంక్ కూలి తల్లీకుమారుడు మృతి

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఇంటి పైనున్న వాటర్ ట్యాంక్ పడి తల్లీ కుమారుడు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పి నాగమణి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ ప్రారంభించింది. రేకుల షెడ్డు పై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. రేకులపై బరువు ఎక్కువగా ఉండడంతో వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ సంఘటనలో తల్లి పి నాగమణి(32), కుమారుడు వంశీకృష్ణ(6) ఘటనా స్థలంలోనే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ల పెంపు

తెలంగాణలో బిసి రిజర్వేషన్ అంశం రాజకీయ, చట్టపరమైన చర్చలకు కేంద్రబిందువుగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ‘కామారెడ్డి బిసి డిక్లరేషన్’ ద్వారా స్థానిక ఎన్నికల్లో బిసిలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి అనుగుణంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్ వద్దకు పంపితే అది అటునుంచి రాష్ట్రపతికి చేరింది. నెలలు గడుస్తున్నా ఆమోదం పొందకపోవడం, హైకోర్టు సెప్టెంబర్ 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించమని ఆదేశించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ జిఒ నెం. 9 జారీ చేసింది. గ్రామ, వార్డుస్థాయి ఎన్నికల్లో 42% రిజర్వేషన్‌ను అమలు చేయాలని ఉద్దేశించింది. ఇది రాజ్యంగ విరుద్ధంగా తీసుకురాబడిందని కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం, పిటిషనర్ తరపున వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఈ జిఒపై మధ్యంతర స్టే ఇచ్చింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ బ్రేక్ పడింది. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపడేసినట్టు అయింది.

రాజకీయ, చట్టపరమైన వర్గాల్లో ఈ స్టే చర్చనీయాంశమైంది. చాలామంది ఈ స్టేను ముందుగానే ఊహించారు. కొందరు నాయకులు స్థానిక అభ్యర్థుల్ని ‘ఎన్నికల ముందు ఖర్చులు పెట్టకండి’ అని హెచ్చరించారు. ఈ అంశం కేవలం స్టేకి మాత్రమే పరిమితం కాదు. ఇది భారత రిజర్వేషన్ విధానం, రాజ్యాంగ సవాళ్లు, రాజకీయ మార్పులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా, రిజర్వేషన్‌కు ‘ట్రిపుల్ టెస్ట్’ సామాజిక, విద్యా వెనుకబాటుతనం, సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, రిజర్వేషన్లు యాభై శాతానికి లోబడి ఉండడం మొదలైన అంశాల్ని 1992 ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయించింది. 2024 తెలంగాణ కులగణన సర్వే డేటా ఈ టెస్ట్‌కు అవసరమైన ఎంపిరికల్ లోపాలను ఎత్తిచూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత ప్రభుత్వం చేసిన 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3.63 కోట్లు. కానీ 2024 కులగణనలో మొత్తం జనాభా 3.70 కోట్లుగా నమోదైంది. 2011 నుండి 2014 మధ్య మూడేళ్లలో 13 లక్షలు (సగటున ఏడాదికి 4.33 లక్షలు) జనాభా పెరిగింది.

బిసిల్లో దాదాపు 120 కులాలు ఉండగా, కేవలం నాలుగైదు కులాలు మాత్రమే రిజర్వేషన్ ద్వారా లబ్ధ్ది పొందుతున్నాయన్న ఆరోపణలు బిసి సమాజం నుండే వ్యక్తం అవుతున్నాయి. మేమెంతో మాకంత నినాదం సరైందే. కానీ, అన్నివర్గాల్లో ఒక శాతం కూడా లేని కులాలు రాష్ట్రంలో వందకు పైగా ఉన్నాయి. మరి వారికెలా రిజర్వేషన్ కేటాయిస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంపు ప్రయత్నాలు జరిగినపుడు కోర్టుల్లో న్యాయ సమీక్షకు గురైన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇక్కడే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఎలా సాధ్యమైందనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 1993లో జయలలిత ప్రభుత్వం తమిళనాడు బిసి, ఎస్‌సి, ఎస్‌టి (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్) బిల్ -1993 తీసుకొచ్చి 9వ షెడ్యూల్‌లో చేర్చడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎఐఎడిఎంకె అలయన్స్ విజయం, పివి నరసింహారావు ప్రభుత్వం మెజారిటీకి ఎఐఎడిఎంకె మద్దతు అవసరం ఉండటంతో, 76వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని 1994లో 9వ షెడ్యూల్‌లో చేర్చారు.

భూసంస్కరణల కోసం తీసుకురాబడిన ఈ షెడ్యూల్ న్యాయ సమీక్ష నుండి రక్షణ ఇస్తుంది. 2007 ఐఆర్ కోయల్హో కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్తూ 9వ షెడ్యూల్లో చేర్చబడిన చట్టాలు కూడా రాజ్యంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా లేకుంటే న్యాయ సమీక్షకు అతీతం కావని తెలిపింది. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తాము మతపరమైన రిజర్వేషన్‌కు వ్యతిరేకమని, ముస్లింలను బిసిల్లో చేర్చితే బిల్లుకు మద్దతు ఇవ్వమని బిజెపి బాహాటంగానే చెప్తుంది. రిజర్వేషన్ పెంపు జరిగితే మా వల్లనే జరిగిందని ప్రచారం చేసుకునే రాజకీయ పార్టీలు కనబడుతున్నాయి తప్ప రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా బిసి రిజర్వేషన్లు కల్పించాలని స్పృహలేకపోవడం శోచనీయం. కోర్టుకు వెళ్లకూడదనే హక్కు ఎవరికీ లేదు. రాజ్యంగబద్ధ్దంగా రిజర్వేషన్లు అమలు చెస్తే ఎంతమంది కోర్టుకు వెళ్లినా కోర్టులు కూడా న్యాయం పక్షానే నిలుస్తాయి.

తమిళనాడు మోడల్ తెలంగాణలో సాధ్యం కాకపోవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ పాత జిఒలు, రీనోటిఫికేషన్‌తో ముందుకు వెళ్తుందా? లేదా సుప్రీంలో పోరాటం చేస్తుందా లేదా తమవంతు ప్రయత్నం తాము చేశామని ప్రజల్లోకి వెళ్లి, పార్టీపరంగా 42% సీట్లను బిసిలకు కేటాయిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. కేంద్రం 2026లో జనగణనతోపాటు కులగణన ప్రారంభిస్తుంది. దాని డేటా రిజర్వేషన్‌లపై ఏమేరకు ప్రభావం ఉంటుందో చూడాలి. తెలంగాణ కులగణన సర్వేలోపాలు, బిసిల్లో ముస్లిం, మైనార్టీలను కలపడం, బిసి ఉపవర్గీకరణ లేకపోవడం మొదలైనవి ట్రిపుల్ టెస్ట్‌కు సవాళ్లు. కోట్లాది మంది ఓటర్లు ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే, గ్రామీణ అభివృద్ధి, సెంట్రల్ గ్రాంట్లు కూడా ప్రభావితమవుతాయి. బిసిలకు సమతుల్య ప్రాతినిధ్యం లేకపోతే, సామాజిక అసమానతలు పెరుగుతాయి. రాజకీయ పార్టీలు మేమే బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేవారమని చెప్పుకోవడం కంటే బలమైన ఎంపిరికల్ డేటా, ఉపవర్గీకరణతో రాజ్యాంగ, చట్టపరమైన మార్గాలు ఎంచుకోవాలి.

– యం. అర్జున్

సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా

వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్రం నుండి సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నాను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకన్ల నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజ్డ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ “అన్ కండీషనల్ లవ్‌తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి సినిమా రాలేదు. అద్భుతమైన పాటలు, సన్నివేశాలతో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు సాత్విక్ వర్మ, ప్రీతి నేహా, నిర్మాత కనకదుర్గారావు పప్పుల పాల్గొన్నారు. 

గ్రీస్‌లో ఆటా పాట

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ గ్రీస్‌లో జరుగుతోంది. ఈ చిత్రం లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తూ షూటింగ్‌ను పూర్తి చేస్తోందట. గ్రీస్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోందని తెలిసింది. దర్శకుడు మారుతి సారథ్యంలో టెక్నికల్ టీమ్ అత్యంత వేగంగా పనిచేస్తోందట. ప్రభాస్, మాళవిక మోహనన్ సహా మొత్తం బృందం ప్రస్తుతం గ్రీస్‌లో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. 

రొటీన్ ఫార్ములాతో అలరించలేకపోయిన ‘కె ర్యాంప్’

గత ఏడాది దీపావళికి ‘క’ మూవీతో పెద్ద హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి కూడా ఈ పండగకు ‘కె ర్యాంప్’ సిని మాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు జైన్స్ నాని రూపొందించిన ఈ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు. ఈ చిత్రం శనివారం థియేటర్లలో విడుదలైంది. అయితే హీరో కిరణ్‌కు ఈ దీపావళి కూడా విజయాన్నందించిందా? లేదా? తెలుసు కుందాం పదండి.

కథ: కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) తండ్రి బాగా డబ్బున్న వాడు. చిన్నప్పటి నుంచి అతడికి చదువు మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ తాగుతూ అల్లరి చిల్లరిగా తిరుగుతుంటాడు. తన దగ్గర ఉంటే కొడుకు బాగుపడట్లేదని.. కుమార్‌ను కేరళలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పిస్తాడు అతడి తండ్రి. అక్కడికి వెళ్లాక కూడా కుమార్‌లో ఏ మార్పూ ఉండదు. అక్కడే అతడికి మెర్సీ (యుక్తి తరేజా) పరిచయం అవుతుంది. ఆమె చేసిన సాయానికి ఆనందపడి తనతో ప్రేమలో పడిపోతాడు కుమార్. నెమ్మదిగా మెర్సీ కూడా అతడిని ప్రేమిస్తుంది. తాను కోరుకున్న అమ్మాయి ప్రేమించిందని కుమార్ సంబరపడుతుంటే.. మెర్సీకి ఉన్న ఓ సమస్య గురించి అతడికి తెలుస్తుంది. అక్కడి నుంచి కుమార్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మెర్సీ సమస్యేంటి? దాని వల్ల కుమార్ పడ్డ ఇబ్బందులేంటి? ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: ‘కెర్యాంప్’ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం పలు సన్నివేశాల్లో మందు తాగుతూ కనిపిస్తుంటాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో హీరో తాగుతుంటాడు. హీరోయిన్ పరిచయ సన్నివేశంలో కూడా హీరో తాగుతూనే కనిపిస్తాడు. సినిమాలో తొలి పాటకు ముందు కూడా అదే పని చేస్తుంటాడు. ఫైట్ సీన్‌లో కూడా హీరోకు తాగితే కానీ కొట్టేంత బలం రాదు. సినిమాలో కథ కీలక మలుపు తిరిగే సీన్లో కూడా హీరో మందుకొట్టి కింద పడిపోయి ఉంటాడు. ఇలా సినిమాలో యువతకు హీరోను కనెక్ట్ చేయడానికి ‘మందు’ను మించిన మార్గం లేదని అనుకున్నారేమో తెలియదు మరి. హీరో పాత్రను ఇలా పరిచయం చేసి.. సిల్లీగా సీన్లు నడిపిస్తుంటే ఇక సినిమా మీద ఏం ఆశలు ఉంటాయి? కిరణ్ అబ్బవరం ‘క’కు ముందున్న ఫాంలోకే వెళ్లిపోతున్నాడనే అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కాలేజీ, ప్రేమాయణం, హీరోయిన్ సమస్యను తెలియ చేయడంతో సాదాసీదాగా సాగింది.

ప్రధాన పాత్రలకు ఏదో ఒక డిజార్డర్ పెట్టి కామెడీ పండించడంలో దర్శకుడు మారుతి దిట్ట. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు చిత్రాల్లో అతను ఇలాగే ప్రేక్షకుల మనసులు గెలిచాడు. వేరే దర్శకులు కూడా అతడిని అనుసరించారు. కానీ ఒక దశలో ఆ కథలన్నీ ఒకేలా అనిపించడంతో వాటిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. కానీ కొంచెం గ్యాప్ తర్వాత కొత్త దర్శకుడు జైన్స్ నాని.. తన డెబ్యూ మూవీకి ఈ ఫార్ములానే ఎంచుకున్నాడు. చెప్పిన మాట మీద నిలబడకపోయినా.. టైం తప్పినా.. వెర్రెత్తి ప్రవర్తించే హీరోయిన్ పాత్ర చుట్టూ సీన్లు రాసుకున్నాడు. ఈ పాత్ర కొత్తగా అనిపించకపోగా కొన్ని చోట్ల బోర్ కొట్టించింది. చివరలో కథకు ఇచ్చిన ఎమోషనల్ టచ్ అంతగా కుదరక సినిమా నిరాశ కలిగిస్తుంది.

ఇక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య అన్ని ముద్దు సీన్స్ యూత్ కోసమే తీశారనిపిస్తుంది. ఇక జీవితంలో ఓ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి పాత్రలో కిరణ్ అబ్బవరం పర్వాలేదనిపించాడు. మెర్సీ జాన్ పాత్రలో యుక్తి తరేజా గ్లామర్ కోసమే నటించినట్లుంది. హీరోకి తండ్రిగా, వ్యాపారవేత్తగా సాయి కుమార్, వెన్నెల కిశోర్, అలీ, శ్రీనివాసరెడ్డి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’తో కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరపురాని ఆడియో ఇచ్చిన చేతన్ భరద్వాజ్.. ఈసారి యావరేజ్ పాటలే ఇచ్చాడు. రవీంద్ర రాజా మాటలు కొన్నిచోట్ల ఓకే అనిపించినా చాలా చోట్ల డైలాగ్స్ హద్దులు దాటిపోయాయి. దర్శకుడు జైన్స్ నాని ‘కె ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. 

దీపావళి కానుకగా..

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కరుప్పు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను డైరెక్టర్ ఆర్.జె.బాలాజీ సమ్‌థింగ్ స్పెషల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే దీపావళి కానుకగా ఈ చిత్రం నుండి ఓ మంచి ట్రీట్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను దీపావళి కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

భారత్‌కు కీలకం

నేడు ఇంగ్లండ్‌తో తలపడనున్న హర్మన్‌సేన

గెలిస్తే సెమీస్ ఆశలు సజీవం

మహిళల వన్డే వరల్డ్ కప్

ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత మహిళ జట్టు పరిస్థితి చావోరేవో అన్నట్టుగా ఉంది. టోర్నమెంట్‌లో సగం మ్యాచ్‌లు ముగిసే సరికి భారత్ ఆడిన 4 మ్యాచ్‌లలో రెండు గెలిచి మరో రెండింటిలో ఓటమిపాలైంది. ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల చేతిలో వరుసగా ఓటమిపాలైన హర్మన్‌సేన సెమీస్ రేసు కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉన్నప్పటికీ కేవలం 4 పాయింట్లు మాత్రమే కలిగిఉంది. దీంతో సేమీస్ చేరాలంటే సవాల్‌గా మారింది. రాబోయే మ్యాచ్‌లు బలమైన జట్లతో ఉండటంతో మరింత కష్టతరంగా మారింది. హర్మన్ సేన సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండింటిని తప్పకుండా గెలవాలి. అయితే ఆదివారం జరిగే మ్యాచ్‌లో బలమైన ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ తర్వాత 23న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు భారత జట్టుకు చాలా కీలకం. ఈ రెండింటిలోనూ ఓడిపోతే భారత్ ప్రపంచ కప్ కలలు ఆవిరైనట్టే. ఇది సాధ్యపడకుంటే కనీసం ఒక మ్యాచ్‌లోనైనా విజయం సాధించాల్సిందే.

చివరి పోరు బంగ్లాతో..

న్యూజిలాండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి న్యూజిలాండ్‌ను ఓడించడం వల్ల భారత్‌కు రెండు ముఖ్యమైన ప్రయోజనాలు చేకూరుతాయి. సెమీస్ రేసులో న్యూజిలాండ్‌కు అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. నెట్ రన్ రేట్ మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఇక భారత్ చివరి లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఉంది. బంగ్లాదేశ్ ఇప్పటివరకు కేవలం ఒకే ఒక విజయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ భారత జట్టు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, బంగ్లాదేశ్‌నూ తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో విజయం కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. అలా కాకుంటే.. ఈ మూడు మ్యాచ్‌లలో భారత్ కేవలం ఒక్కటి మాత్రమే గెలిస్తే, సెమీఫైనల్ రేసు నుంచి పూర్తిగా వైదొలగకపోయినా, పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది. అప్పుడు టీమిండియా ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలు, వారి నెట్ రన్ రేట్ వంటి సంక్లిష్టమైన సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి, సెమీఫైనల్ బెర్త్‌ను సులభంగా ఖాయం చేసుకోవాలంటే, భారత్ తప్పనిసరిగా మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలవడమే సురక్షితం.

ఆత్మవిశ్వాసంతో టీమిండియా

గెలుపే లక్షంగా ఆస్ట్రేలియా

నేడు తొలి వన్డే

పెర్త్: ఆసియా కప్ గెలుచుకుని జోరుమీదున్న టీమిండియా మరో సమరానికి సిద్ధం అయ్యింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. అందులో భాగంగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. వన్డే సారథిగా శుభ్‌మన్ గిల్‌కు తొలి సిరీస్ కూడా ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఏడు నెలల అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టనున్నారు. దీంతో అందరి చూపూ మాజీ కెప్టెన్ రోహిత్, కోహ్లీ మీదే ఉంది. 2027 ఐసిసి వరల్డ్ కప్ వరకూ జట్టులో కొనసాగాలంటే వీరిద్దరూ ఈ సిరీస్‌లో అంచనాలకు మించి రాణించాల్సి ఉంటుంది. పైగా- కెప్టెన్సీ పోయిన తర్వాత రోహిత్ శర్మ ఆడుతున్న తొలి మ్యాచ్ కూడా ఇదే కావడం అతనిపై మరింత ఉండే అవకాశం లేకపోలేదు.

ఈ మూడు మ్యాచ్‌లలో ఏ మాత్రం రాణించకపోయినా వారి కేరీర్‌కు ఎండ్ కార్డు పడనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 50 ఓవర్ల ఫార్మట్ లో సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్‌లో దిగడం ఇదే తొలిసారి కూడా. స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ తుదిజట్టులో చోటు దక్కించుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా భావించే నంబర్ 4 స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బరిలో దిగొచ్చు. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడం వల్ల బౌలింగ్ దళాన్ని మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడపాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్ స్పిన్నర్లుగా ఆడటం దాదాపుగా ఖాయమైనట్టే. ఆల్ రౌండర్లుగా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి మొదటి వన్డే మ్యాచ్‌లో ఆడొవచ్చు.

ఆస్ట్రేలియాకు గాయాల బెడదా..

మరోవైపు- మిచెల్ మార్ష్ నాయకత్వాన్ని వహిస్తోన్న ఆస్ట్రేలియా.. టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. గాయాలు ఆ జట్టును కలవరపెడుతున్నాయి. మాట్ రెన్‌షా, మిచ్ ఓవెన్ మిడిల్ ఆర్డర్‌లో వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. జోష్ ఫిలిప్ 2021 తర్వాత తన తొలి వన్డే ఆడనున్నాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమాన్ కూడా తొలి మ్యాచ్ ఆడనున్నాడు. స్వదేశంలో ఇదే అతనికి తొలి మ్యాచ్. అయినా వారు దేశవాళీలో రాణించిన అనుభవం లేకపోలేదు. ట్రావీస్ హెడ్, ట్రావిస్ హెడ్, మాట్ షార్ట్, మాట్ రెన్షా, జోష్ ఫిలిప్, మిఛెల్ ఓవెన్ వంటి బ్యాటర్లతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. మిఛెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాట్ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ వంటి బౌలర్లతో బౌలింగ్ విభాగం సయితం ప్రమాదకరంగా ఉంది. దీంతో ఆసీస్ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఇక, వారికి సొంత గడ్డ, సొంతం మైదానం కాబట్టి వానికి కలిసొచ్చే అవకాశాలూ ఉన్నాయి.

అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది…. తాగుబోతుల వీరంగం

అమరావతి: ఆధ్యాత్మిక న‌గ‌రం తిరుప‌తిలో మందుబాబుల వీరంగం సృష్టిస్తున్నారు. బైక్ వెళ్తుండగా మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌తో ముగ్గురు యువ‌కులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ బంధువులు, స్థానికులు మందుబాబుల‌కు దేహ‌శుద్ధి చేశారు. వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తిరుపతి సమీపంలోని గూడూరులో విద్యార్థులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల హల్‌చల్ చేశారు. జర్నలిస్టు, షాపు యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. సాధుపేట సెంటర్ లో దాడులకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జర్నలిస్టుకు కూడా భద్రత క‌రువైందని, లా అండ్ ఆర్డ‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌పై విమ‌ర్శ‌లు వస్తున్నాయన్నారు.

గూడూరులో తరచూ విద్యార్థుల దాడులపై పోలీస్ అధికారులు దృష్టిసారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క జర్నలిస్టుకు భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో గంజాయి రాయుళ్లు వీరవిహారం చేస్తున్నారు. తిరుమలకు వచ్చిన భక్తులపై దాడులు జరిగిన దాఖలలు చాలానే ఉన్నాయన్నారు. మందుబాబులు, గంజాయి రాయుళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడంలేదన్నారు. పోలీసులు ఉన్నారా? లేరా? సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో భక్తులు వస్తూ పోతూ ఉంటారు, వాళ్లకు రక్షణ లేకుండాపోయిందని నెటిజన్లు వాపోతున్నారు. మద్యం మత్తులో బైక్ లపై విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాళ్లు వాపోతున్నారు. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎన్నో సంఘటన జరిగిన కూడా శాంతి భద్రతల విషయంలో మార్పు రావడం లేవని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ

తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శ‌నివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. శనివారం ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు.

ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.

సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డీప్యూటీ ఇఒ వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ ర‌మేష్‌, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధ‌న‌శేఖర్, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.