elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingbahiscasinopadişahbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fx

Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

betebet

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

dinamobet

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

ultrabet

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

tarafbet

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

టీమిండియా ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాదే తొలి వన్డే

పెర్త్: భారత్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆ స్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 26 ఓవర్లకు కు దించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిం ది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కో ల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మిఛెల్ మార్ష్, వికెట్ కీపక్ జోష్ ఫిలిప్, మాట్ రెన్‌షా కంగారూల విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మార్ష్ 52 బంతుల్లో 3 సి క్స్‌లు, రెండు ఫోర్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (8), వన్‌డౌన్‌లో వచ్చిన మాథ్యూ షార్ట్ (8) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఇక దూకుడుగా ఆ డిన ఫిలిప్ 29 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్ల తో 37 పరుగులు సాధించాడు. రెన్‌షా ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

తేలిపోయిన బ్యాటర్లు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా త్రమం తప్పకుండా వికెట్లను తీశారు. దీంతో భారత్ ఆశించిన స్కోరును సాధించలేక పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (10) జట్టుకు శుభారంభం అందించలేక పోయారు.

వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్ కోహ్లి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా నిరాశ పరిచాడు. అక్షర్ పటేల్ (31), కెఎల్ రాహుల్ (38)లు మాత్రమే కాస్త రాణించారు. మిగతా వారిలో వాషింగ్టన్ సుందర్ (10), నితీశ్ రెడ్డి రెండు సిక్స్‌లతో 19 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్, ఓవెన, కుహ్నెమాన్ రెండేసి వికెట్లను పడగొట్టారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది.

సర్వేయర్లపై గురుతర బాధ్యత

 భూ సమస్యలకు శాశ్వత పరిష్కార బాధ్యత మీదే

ధరణి చట్టమే బిఆర్‌ఎస్ పతనానికి ప్రధాన కారణం 

త్వరలో గ్రూప్3, గ్రూప్4 నియామకాలు పూర్తి

సిఎం లైసెన్స్‌డ్ సర్వేయర్లకు దీపావళి కానుక: మంత్రి పొంగులేటి

మన తెలంగాణ / హైదరాబాద్ : దశాబ్దాల తరబడి తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ రైతాంగానికి లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం శిల్ప కళావేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై శిక్షణ పొందిన సర్వేయర్ లైసెన్స్‌లు పంపిణీ చేసిన కార్యక్రమానికి మంత్రి పొంగులేటి అధ్యక్షత వహించి ప్రసంగించారు.

గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్కేద కార్యక్రమం చేపట్టిందని, దీనిలో భాగంగా 3,456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూలో భాగమైన సర్వే వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆలోచించి దరఖాస్తులను ఆహ్వానించామని చెప్పారు.

దీనికి బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన పదివేల మంది దరఖాస్తు చేసుకోగా ఏడువేల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 3,456 మంది క్షేత్ర స్థాయిలో తర్ఫీదు పొంది ఎంపికయ్యారని, వీరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా లైసెన్స్‌లు అందించామన్నారు. నాడు జిపిఓ వ్యవస్థ, భూ భారతి, సాదా బైనామా తదితరాల విషయంలో అలక్షం జరిగినందున సుమారు 9.80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిని తమ ప్రజా ప్రభుత్వం దశల వారీగా పరిష్కరిస్తోందన్నారు. చిన్న అవకతవకలు జరుగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పని చేయకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి పొంగులేటి సర్వేయర్లను కోరారు. లైసెన్స్‌లు పొంది సంతోషించినట్లే ప్రజలను కూడా మీ పనులతో సంతోషపడేలా చేయాలని, ప్రభుత్వానికి పేరు తేవాలని కోరుతూ లైసెన్స్‌డ్ సర్వేయర్లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు.

తేనె పాటల గాన సరస్వతి

అయ్యో, సావిత్రి అలా అయిపోయింది. హరనాథ్ ఎందుకూ కొరగాకుండా పోయాడు. కాంతారావుకి సొంత ఇల్లు కూడా లేదు తెలుసా? రావు బాల సరస్వతి ఏ ఆస్తి లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది.. ఇలా మాట్లాడుకోవడం మనకి చాలా ఇష్టం. ఇదొక శాపం మనకి. రావు బాల సరస్వతి అనే పాటలు పాడే యువతి బతికినంత కాలం, మామూలు కాలం కాదది. మూల నారాయణస్వామి, హెచ్.ఎం.రెడ్డి, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్‌వి.ప్రసాద్ ప్రయోగాలు చేస్తున్న కాలం. ఎన్‌టి.రామారావు, ఎస్‌వి.రంగారావు, రేలంగి, నాగయ్య, జగ్గయ్య, అక్కినేని లాంటి వాళ్లు పాండీ బజార్‌లో, సిగరెట్లు కాలుస్తూ తిరుగుతున్న కాలం. మహాకవులు అక్కడే టీలు తాగుతున్న మహత్తరమైన కాలం. విజయ, వాహిని స్టూడియో లు దక్షిణ భారత చలనచిత్ర రాజధాని నగరం మద్రాసుకి భుజకీర్తులై వెలుగుందుతున్న రోజులవి.

అదిగో మల్లాది రామకృష్ణ శాస్త్రి, అక్కడే మార్కస్ బారట్లే, ఆ చెట్టు కింద పింగళి నాగేంద్ర రావు ఆ పక్కన, వేదాంతం రాఘవయ్య, ఇడ్లీ సాంబార్ కోసం నడిచి వెళుతున్న ఘంటసాల, అదిగో అక్కడే కూని రాగాలు తీస్తున్న సాక్షాత్తూ సుసర్ల దక్షిణామూర్తి, హార్మోనియం మెట్లు సరిచూసుకుంటూ ఎస్.రాజేశ్వరరావును పలకరిస్తూ వస్తున్న సావిత్రి, సిగ్గుపడుతూ నిల్చున్న జమున, ‘టైం అయింది పదండి’ అంటూ భానుమతి, ‘పులిహోర తిని వెళ్దాం రండర్రా’ సూర్యకాంతం.. ఇలా కొన్ని వందల పేర్లు రాయొచ్చు. అది మరపురాని, మరువలేని తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ స్వర్ణ యుగం. ఆ అమాయకమైన చల్లని వెన్నెల రోజుల్లో పి.లీల, ఈశ్వర్‌లక్ష్మి, జిక్కి, జమునా రాణి, సుశీల, భానుమతులతో కలిసి నడిచింది బాల సరస్వ తి. గొంతు కలిపి పాడింది గాన సరస్వతి.

ఆమె ఏనాటిదంటే 1936లో సతీ అనసూయ కోసం బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన ‘ఏది దారి నా కిచ టా, ఈ కలుష భూతముల పాలైతివి’ పాట పాడిన అతి పురాతన గాయని. మల్లాది రామకృష్ణ శాస్త్రి, సీ, జూ.సముద్రాల, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, అనిశెట్టి, ఆరుద్ర, సదాశివ బ్రహ్మం, బసవరాజు అ ప్పారావు లాంటి కవులు రాసిన పా టలు పాడిన అదృష్టవంతురాలు. రజనీకాంతరావు రాసిన ‘ఓ మల య పవనమా, నిలు, నిలుమా, ఓ విరిసిన దిరిసెన పువ్వా?’ పాట విన్నారా.. ఎంత హొయలు పోయిందో ఆ బాల గొంతులో! ఎమ్మెస్ రామారావుతో కలిసి మరి పాడింది.

‘వద్దంటే డబ్బు’లో కృష్ణశాస్త్రి పాట ‘ఎందుకో ఈ హాయి నాకు? ఎందుకమ్మా బిడియమూ? ఎదురుచూసే కనులలోనే నిలిచనే నా ప్రాణము, తాను వచ్చె వేళలోనే నా ధైర్యమంతా జారినే..’ ఆమె గొంతులో వినితీరాలి. మనకి బాగా తెలిసిన దేవదాసు దాకా ఎన్ని మధుర గీతాలో! లెక్కలేనన్ని లలిత గీతాలు పాడింది. వింజమూరు శివరామారావు, ఎస్.వి.భుజంగరాయ శర్మ, దాశరథి, తోలే టి, కొనకళ్ళ వెంకటరత్నం, గిడుగు రాజేశ్వరరావు పాటలు ఆ తేనె గొంతులో ప్రాణం పోసుకున్నాయి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి లలిత గీతం, ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి వ్యష్టి జీవమున చేదు పానీయమోయి, కలువరాణిని విడిచి చలువరేడే లేడు, సోలు పూలను విడడు, గాలి రాజే రోజు’.. ఈ కల్తీలేని కవిత్వం ఆమె గొంతులోనే పలకాలి మరి! ముసిరిందంటే.. అని మొదలయ్యే కొనకళ్ళ వెంకటరత్నం పాటని తలుచుకుందాం. ‘మబ్బు తెరల మసకలలోన, మంచు పొగల మెలికలలోన మనసెటో చిక్కడినట్లే, మనేద కుదిపేస్తది లోన’ అని ఘంటసాలతో బాల కలిసి పాడుతూ ఉంటే.. ఓహ్.. కొనకళ్ళ ధన్యుడు అయ్యాడు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి కలంలో వెన్నెల నింపి రాసిన ఓ గీతం ‘రెల్లు పూల పానుపు పైన, జల్లు జల్లుగా ఎవరో, చల్లినారమ్మా, వెన్నెల చలినారమ్మ’.. అసలే మహాకవి, ఆపైన మధుర గాయని. ఇలాంటి కొన్ని వేల పాటలు మనకి కానుకగా ఇచ్చిన ప్యూ ర్ ఆర్టిస్ట్ రావు బాల సరస్వతీ దేవి. సౌందర్యరాశి, 16, 17ఏళ్ల వయసులోనే రెండు మూడు సినిమా ల్లో హీరోయిన్‌గా నటించింది. ముఖ్యమంత్రులు ఎన్‌టి.రామారావు, జయలలిత నుండి గౌరవం, బహుమతులు పొందింది. ‘వినండి, పాడుకోండి’ అని లెక్కనేనన్ని మధుర గీతాలను మనకి అంకి తం ఇచ్చి వెండి మబ్బుల మీద నుంచి హుందాగా నడిచి వెళ్ళిపోయింది ఆ వెన్నెల పాట.


తాడి ప్రకాష్

ట్రంప్‌పై ఆగ్రహజ్వాల

 అమెరికా అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగా ‘నో కింగ్స్’ నిరసనలు

ఉధృతం 50కి పైగా నగరాల్లో వీధుల్లోకి మిలియన్ల కొద్దీ జనం

విదేశాల్లోని రాయబార కార్యాలయాల వద్ద ఆందోళనల వెల్లువ ట్రంప్

ఎదురుదాడి తనను తాను చక్రవర్తిగా చిత్రీకరిస్తూ ఎఐ ఫొటో విడుదల

న్యూయార్క్: అమెరికాలో క్రమేపీ పలు ప్రధాన నగరాలలో ట్రంప్ విధానాలకు నిరసనలు ఉ ధృతం అవుతున్నాయి. నో కింగ్స్ పేరిట జనం ప్లకార్డులతో వీధుల్లోకి తరలివస్తున్నారు. మహా నగరం న్యూయార్క్, వాషింగ్టన్ డిసి, చికాగో, మియామి, లాస్ ఏంజెలిస్‌ల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నో కింగ్స్ ఉద్యమంలో మిలియన్ల కొద్దీ పాల్గొంటున్నారు. న్యూయార్క్‌లో ఎక్కడ చూ సినా నో కింగ్స్ బ్యానర్లు వెలిశాయి. జనం పెద్ద పెట్టున స్థానిక చారిత్రక ప్రతీకాత్మక టైమ్స్ స్కేర్ వద్ద గుమికూడారు. తమకు ప్రజాస్వా మ్యం ప్రాణం, రాచరికం కాదంటూ చెలరేగిన నినాదాలతో వీధులు మార్మోగాయి. కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద కూ డా ట్రంప్‌పై నిరసనల వెల్లువలు సాగాయి.

అమెరికాలోనే ఒక్కరోజే 50కి పైగా నగరాలలో ఈ నిరసనలు చెలరేగాయి. త్వరలోనే అమెరికా అంతటా 2500కు పైగా ర్యాలీలు తీస్తామని నో కింగ్స్ పేరిట ఆరంభమైన ఉద్యమ నిర్వాహకులు ప్రటించారు. ట్రంప్ వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు , దేశీయ విదేశీ విధానాలు , అమెరికా ఫస్ట్ పేరిట వలసల నియంత్రణ క్రమంలో అనాలోచిత , అరాచక చర్యలకు దిగుతున్నారని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ కానీ మరెవ్వరైనా కానీ అమెరికాలో రాజ్యాంగం కాదని వ్యవహరిస్తే కుదరదు, రాజ్యాంగం అనేది ఐచ్ఛిక్కం అనుకుంటున్నారా? ఇది అనివార్యం, అవశ్యం, తప్పనిసరి అని జనసంద్రపు మహానగరం న్యూయార్క్‌లో వెల్లువెత్తిన నో కింగ్స్ జనం హెచ్చరించారు. రాజుల కాలం, తమ మాటలనే చలామణి చేయించుకోవాలనే ధోరణి కుదరదని స్పష్టం చేశారు. పలు విశ్వవిద్యాలయాలకు నిధుల కోత, ప్రత్యేకించి డెమెక్రాట్లు ప్రాబల్యంతో ఉన్న లేదా ఈ పార్టీ గవర్నర్లు ఉన్న రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ట్రంప్ నేరుగా తన అధీనంలోని నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపడం వంటి చర్యలు నో కింగ్స్ ఉద్యమానికి దారీతీశాయి. బారోహ్ పట్టణంలో లక్షకు పైగా జనం గుమికూడారని స్వయంగా న్యూయార్క్ పోలీసు విభాగం తెలిపింది.

ఇండివిజబుల్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్ బర్గ్ ఇక్కడ నిరసనలకు నాయకత్వం వహించారని అధికారులు నిర్థారించారు. డెమోక్రాటిక్ పార్టీ , పలు సంఘాలు, అమెరికాకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి ఈ ఉద్యమానికి ప్రత్యక్ష పరోక్ష మద్దతు దక్కుతోంది. న్యూయార్క్‌లో నిరసనకారులు కొన్ని చోట్ల ట్రంప్‌ను చక్రవర్తి మాదిరిగా చూపే భారీ బొమ్మలను ప్రదర్శించారు. ఈ నిరసనల దశలో పలు నగరాలలో నేషనల్ గార్డ్‌ను ప్రధాన కూడళ్ల వద్ద మొహరించారు. అయితే అన్ని చోట్ల కలిపితే ఏడు లక్షల మందికి పైగా జనం నిరసనలలో పాల్గొన్నారని ఉద్యమ నిర్వాహకులు సామాజిక మాధ్యమాలలో తెలిపారు.

ఇది ఆరంభమే అనుకోవచ్చు, ఇకపై ఇతర చోట్ల, నగరాలలో కూడా మరింత వినూత్నంగా తాము వ్యవహరిస్తామని తెలిపారు. అమెరికా వ్యవస్థలోని ఫెడరల్ గవర్నమెంట్ల అంటే రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ప్రాంతీయ అధికారిక వ్యవస్థ అధికారాలను ట్రంప్ దెబ్బతీస్తున్నారనే అంశం చాలారోజులుగా రగులుకొంటోంది. ట్రంప్ ఎక్కువగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రత్యేకించి నోబెల్‌పై కన్ను వేసి ఉంచడం అంతర్గత పరిణామాలను సరిగ్గా గుర్తించని క్రమంలోనే ఇప్పుడు ఈ ఉద్యమం వెల్లువెత్తే అవకాశం ఏర్పడిందని అమెరికా పత్రిక ఒకటి రాసింది. నిరసనకారులు ఎక్కువగా అన్యాయంపై నిరసన, ఫాసిసంపై ప్రతిఘటననే గొప్ప దేశభక్తి అని నిరసనకారులు నినదించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరసనలతో కూడిన నో కింగ్ ఆందోళనలు చెలరేగడం ఇది మూడోసారి అయింది.

ట్రంప్ వర్గీయుల ఎదురుదాడి

అమెరికా వీధుల్లోకి నిరసనల పేరిట చేరుకుంటున్నది కేవలం హేట్ అమెరికావాదులు అని ట్రంప్ మద్దతుదార్లు కౌంటర్‌కు దిగారు. ఇది ఫాసిస్టు, అతి వామపక్ష వాద జెండాల కసరత్తు అని వ్యాఖ్యానించారు. అమెరికా ఫస్ట్ అని మేమంటాం, హేట్ అమెరికా అని వారంటున్నారు ఇదే తేడా అంటూ ట్రంప్ మనుష్యుల ద్వారా ఎఐ ఫోటో ఒకటి వెలువరించారు. ఇందులో ట్రంప్‌ను చక్రవర్తిగా చిత్రీకరించారు. నో కింగ్స్ నిర్వాహకులను కవ్వించేందుకే ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇక ఇప్పటి ఉద్యమం నేపథ్యంలో అమెరికా అధ్యక్షులు ట్రంప్ వీటిపై ఒకే ఒక్క మాటతో స్పందించారు. తన ఫోటో పెట్టి, తాను కింగ్‌ను కానని ( నాట్ ఏ కింగ్) అని వ్యాఖ్యానించారు. తరువాత ఫ్యాక్స్ బిజినెస్‌తో మాట్లాడుతూ తనను వారు కింగ్ అంటున్నారని, ఎంతైనా ఈ డెమోక్రాట్లు ఎప్పటికీ ప్రభుత్వ చలామణిలోకి రాబోరు. కాబట్టి డెమోక్రాట్ల ప్రాధాన్యతలను కాదంటూ అమెరికన్ల కోసం తానే కింగ్ అవుతానేమో అనే వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ తరువాత ఎఐ ట్రిక్కు ఫోటోగ్రఫీలో భాగంగా ట్రంప్ తమ ట్రూత్ సోషల్ వేదికపై వెలువరించిన ఫోటోలో తాను కిరీటం ధరించి ఫైటర్ జెట్‌లో దూసుకువెళ్తున్నట్టుగా ఉంది.

మనం జీవించాం, ప్రేమించాం, మనం త్యజించాం

ఒకప్పుడు అనుకున్నాం అన్ని మన ఆధీనంలో ఉంటాయని

మన రోజులు, మన పిల్లలు, మన వ్యాపకాలు

చివరకి మన జీవితం నడిచే తీరు కూడా

అందుకే, జీవితాన్ని ప్లాన్ చేసుకుని మన కలల్ని

ఆశయాల్ని, జీవన గమ్యాన్ని, చివరకి

మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా

గట్టిగా వాటేసుకున్నాం

బహుశా అప్పుడు అట్లా ఉండడం అవసరమేమో..

ఆ దశలో, జీవితం మనని అడిగి ఉంటుంది

పునాదులు వెయ్యమని, సంరక్షణ చెయ్యమని

ఆత్మీయత పంచమని

మార్గదర్శకులుగా నిలవమని

కానీ, నెమ్మదిగా జీవితం మారిపోతుంది

ఎంతో అపురూపంగా, జాగ్రతగా మలుచుకుని

మనసుకు దగ్గరగా పెట్టీ ఉంచుకున్నవన్నీ

ఒక్కొక్కటిగా జారిపోతాయి.

అట్లా జారిపోవడం బాధ కలిగించదు కానీ..

హుందాగానే, అప్రయత్నంగా అన్నీ జారవిడుస్తాం

పిల్లలు ఎదిగి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు

మన మీద ప్రేమ లేక కాదు

వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మలుచుకోడానికి

ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు

అమ్ముడుపోతుంది

ఆ ఇంటి మీద ఇష్టం లేక కాదు

ఆ మెట్లు ఎక్కే శక్తి లేక

ఇంటి పెద్దగా తల్లిగా, తండ్రిగా

దారి చూపే మార్గదర్శకులుగా

జీవితాల్ని మలచిన మన బాధ్యత కూడా

మరుగున పడిపోతుంది

తడి ఇసకలో రాసిన పేరులా

అప్పుడు, అలాంటప్పుడు

బహుశా నిశ్శబ్దం నిండిన ఓ మధ్యాహ్నం

హఠాత్తుగా తడుతుంది మనసుకి

జీవితం మారిపోయిందని

మనం రోజా పలకరించుకున్న మనుషులు

ఇప్పుడు ఫోన్‌లో సందేశాలకే

పరిమితం అయిపోయారని

మన చుట్టూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని

చివరకి, మన ముఖాల్లో మునుపు లేని ముడతలు

రూపుదిద్దుకుంటున్నాయని

అదిగో అప్పుడే దుఃఖం, బాధ కన్నా మనలో

మరేదో నెలకొంటుంది

అదే, ఒకలాంటి ప్రశాంతత

నెమ్మదిగా అర్ధం అవుతుంది

గతాన్ని వదిలేయడం అంటే

ఏదో పోగొట్టుకోవడం కాదని

నిశ్చలతకి, ప్రశాంతతకి, విశ్లేషణకి

సమయం వచ్చిందని

గతాన్ని వదిలేయడం అంటే

మనసుల్లోని జ్ఞాపకాల్ని

బంధాలు లేకుండా పదిలం చేసుకోడం అని

గతాన్ని వదిలేయడం అంటే ప్రపంచం

మన చుట్టూ పరిభ్రమించదు కానీ

మనం కూడా అందులో ఒక అందమైన భాగం అని

గతాన్ని వదిలేయడం అంటే బలహీనత కాదని

ఎదురైన రాళ్ళు రప్పలతో పోరాడకుండా

వాటి చుట్టూ నాట్యం చేస్తూ

ఆనందంగా, అందంగా సాగిపోయే

నది లాంటి హుందాతనం అని

అదిగో అప్పుడే

మన ప్రపంచం స్తబ్దుగా మారినప్పుడు

మారిన ప్రపంచాన్ని అంగీకరించే

మనస్థైర్యం అలవడుతుంది

బంధాలు తగ్గిపోతాయి కానీ

మనసు నిండుగా ఉంటుంది

తాపత్రయాలు తగ్గిపోతాయి కానీ

ఉన్నదాంట్లోనే తృప్తి ఉంటుంది

మాటలు తగ్గుతాయి కానీ

మాటల్లో లోతు, అర్ధం ఉంటుంది

అదిగో అప్పుడే, కిటికీ పక్కన కూచుని

టీ తాగుతున్నప్పుడు మన పెదాల మీద

చిరునవ్వు వెలుగుతుంది

జీవితం మనం అనుకున్నట్టే

సాగిందని కాదు కానీ..

మనం జీవించాం, మనం ప్రేమించాం

మనం త్యజించాం

అన్నీ హుందాగా అని

సుషమ దండమూడి

ఫిజి వలస కార్మిక స్త్రీల విషాదభరిత కవిత్వం

దక్షిణ పసిఫిక్‌లోని ఉష్ణమండల ప్రాంతం ఫిజీ. మూడువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఐటౌకీలు అక్కడి స్థానికులు. 1874లో అది బ్రిటిష్ కాల నీ అయింది. దక్షిణాఫ్రికాలోని నటాల్‌ని నమూనా గా తీసుకొని, చక్కెర, కొబ్బరి, పత్తి, కాఫీ తోటలలో ఉపాధి కోసం కార్మికులను క్రమక్రమం గా సరఫరా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 1879లో ఒప్పంద కార్మి క విధానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం అనుమతించినా, భారతీయ ఒప్పంద కూలీలను నియమించుకున్న చివరి దేశం ఫిజీ. 498మంది భారతీయ ఒప్పంద కార్మికులతో, మొదటి నౌక లియోనిడాస్ 1879 మార్చి 3న భారతదేశంలోని కలకత్తా నుండి బయలుదేరి అదే సంవత్సరం మే 14న ఫిజీలోని లెవుకా కు చేరుకుంది. ఆ కార్మికులే తరువాతి 37 సంవత్సరాలలో, భారత ఉపఖండం నుండి వచ్చిన దాదాపు 61వేల మందిలో మొదటివారు. వారి వారసులు ఇప్పుడు ఫిజీ జనాభాలో 40శాతంగా ఉన్నారు. 18791916 మధ్య, మొత్తం 42 నౌకలు 87 ప్రయాణాలు చేసి, భారతీయ కార్మికులను ఫిజీకి తీసుకెళ్లాయి. కలకత్తా నుంచి 45,439 మంది, మద్రాసు నుంచి 15,114 మంది ఒప్పంద కార్మికులు వెళ్లారు. ఫిజీకి ప్రయాణం, సెయిలింగ్ నౌకల్లో సగటున 73 రోజులు పడితే, స్టీమర్లకు 30 రోజులు పట్టేది.

ఆ ఒప్పంద కాలంలో స్వేచ్ఛా భారతీయుల పట్ల ద్వేషపూరిత ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో, ఒప్పందాలు చేసుకున్న కార్మికులు కాలనీలో పని చేయాల్సిన పరిస్థితులూ, అంతే దిగ్భ్రాంతికరంగా మారుతూపోయాయి. లింగ నిష్పత్తిలో భయంకరమైన అసమానతలు, వైవాహిక జీవితపు గౌరవాన్ని కాపాడటానికి ఎటువంటి గోప్యత లేకపోవడం, చా లామంది భారతీయుల్ని నైతికంగా దెబ్బ తీసాయి. కొన్ని కాలనీలు వ్యభిచార గృహాలుగా మారాయి. కోలుకోలేని అనైతికత వ్యాధులతో కూడిన జీవితానికి అలవాటుపడ్డ వారుగా, భారతీయులు పేరుపడ్డారు. ఫిజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లించ్ ఇలా రాసాడు. ‘ఒక ఒప్పంద భారతీయ కార్మిక మ హిళ, ముగ్గురు ఒప్పంద కార్మిక పురుషులతో పా టు, వివిధ బయటి వ్యక్తులకు సేవ చేయవలసి వ చ్చినప్పుడు, గనేరియా, సవాయి రోగాల బారినప డేది. పని పరిస్థితులు కూడా అధ్వాన్నం.’ ద్వేషపూరిత వాతావరణం పెరిగి, హింసాత్మక నేరాలు, ఆత్మహత్యలు ఫిజీలో భారతీయ జీవితంలో నిత్య వైఖరిగా మారాయి. ఫిజీలో కుటుంబ జీవితానికి సరైన పునాది వేయాలంటే కనీసం 40శాతం మంది కార్మిక మహిళలు ఉండాలని భారత వలస ప్రభుత్వం భావించింది. అయితే దళారీల ప్రయత్నాలు చేసినా ఈ నిష్పత్తిని కొనసాగించలేక, చా లా సందర్భాల్లో మహిళలను అపహరించుకు పో యేవారు. మహాత్మా గాంధీ, ఇతర జాతీయ నాయకులు ఒప్పంద వ్యవస్థను ఒక ముఖ్యమైన జాతీయ సమస్యగా తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న అనే క దుర్మార్గాలు బయటకు వెల్లడి కావ డం, ఇంకా అనేక కారణాలతో భారతీయ ప్రజాభిప్రాయం ఒ ప్పందాన్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. భారతదేశానికి చేసిన ఈ ద్రోహం మీద దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ప్రతిధ్వనించింది. చివరకు 1920లో ఇండెంచర్ వ్యవస్థ ఒప్పంద విధానం రద్దు చేయబడింది. అలా ఒప్పంద కార్మిక వ్యవస్థ రద్దుకు ఫిజీనే కారణమయింది.

భారతదేశ విశాల చరిత్ర ముందు గిర్మిట్ల చరిత్ర నిర్లక్ష్యం కావడం ఒక విషాదం. ఒప్పంద కార్మికులు తమ జీవిత అనుభవాలను కవిత్వ రూపంలో వ్యక్తీకరించారు. 1879-1920 మధ్య కాలంలో, పురుషులూ, స్త్రీలు చెరకు పొలాల్లో నిర్ణీత సమయం కంటే ఎక్కు వ గంటలు పనిచేయాల్సి వచ్చేది. శ్వేతజాతి యజమాని, అతను నియమించిన సర్దార్ (నాయకుడు) రోజంతా కొరడాలతో తిరుగుతూ భారతీయ కార్మికులు తమకు కేటాయించిన పనులను ఆ రోజు ముగిసేలోగా పూర్తి చేసేలా చూసేవారు. వివిధ కారణాలతో కార్మికుల్లో కొందరు పరస్పర శత్రువుల్లా ఉండేవారు. జింకీ అనే మహిళ సిగటోకా ప్రాంతంలో తన అనుభవాన్ని ఒక సాయంత్రం, ఫి ర్యాదు స్వరంలో ఇతర మహిళలకు ఇలా చెప్పుకుంది.

“ఎవరూ లేరు జింకీ బాధలు వినడానికి

యజమాని బాగా కొడుతుంటాడు

నా మీద సర్దార్ చాడీలు చెబుతుంటాడు

రామదియా నా శత్రువు”

చెరకు పొలాల్లో పని చేస్తున్నప్పుడు, రకిరాకిలోని ఒక మహిళ తనను ఫిజీకి పంపిన ఆర్కటీ అని పిలవబడే దళారీని ఇలా తిట్టుకుంది.

“ప్రేమికుడ్ని వదిలేసి

దేశం నుంచి పారిపోయి

వచ్చాను నాకు పెళ్లి

కాకుండా చేసి

తరలించినవాడు

తప్పకుండా చావాలి”

బాధలను భరించే సామర్థ్యం ఎంతున్నా, ఓపిక నశించిన సందర్భంలో, మహిళా కార్మికుల ముఠాను, శ్వేతజాతీయ పర్యవేక్షకుడు కొలంబెర్ తరచూ వేధిస్తూ కొరడాతో కొట్టేవాడు. ఒకరో జు ఒక స్త్రీని అతను అవమానించినప్పుడు, అంద రూ కలిసి అతన్ని కొట్టడానికి అతనిపైకి వెళ్లారు. అది చూసిన వారు మరింత దూకుడు పెంచారు.

“ఓ రామా! పనిలో పడి చస్తుంటాం మేము

అయినా పరదేశీ అవమానిస్తాడు గద్దిస్తాడు

చెమటతో, రక్తంతో పొలాల్ని తడుపుతాం

కూర్చుని కూర్చునే అధికారం

చలాయిస్తాడు వాడు”

కొన్నిసార్లు వారి బాధల కథలు వినడానికి ఎవరూ ఉండరు. చెరకు మొక్కలే సాక్షులు. పని చేస్తున్నప్పు డు, వారి చేతుల్లో పనిముట్లతోనే, ఇలా పాడుకున్నారు.

“ఈ కత్తులూ కొడవళ్లతోనే

పగలూ రాత్రులూ గడుస్తున్నాయి ఇపుడు

ఆకుపచ్చని చెరకు ఆకులకు తెలుసు

మా అన్ని కష్టాలూ”

ఫిజీకి మహిళల్ని పంపడానికి చాలా సందర్భాలలో అపహరణలకు సైతం ఆర్కటీలు అని పిలవబడే దళారీలు వెనకాడలేదు. అణచివేత, అనిశ్చితి మ ధ్య, మహిళలు తమ గత అనుభవాలను గుర్తుచేసుకునే వారు.

“కాగితం చేతిలో పెట్టారు గోదాంలో

పర్యవసానాలు తెలియక

దానిమీద వేలుముద్ర వేశాను

చీకటి సంద్రాన్ని ఎలా దాటగలమని

గొణుక్కుంటూ ఏడ్చుకుంటూ

తెరచాపల పడవ మీద

ఆశ్చర్యంలో కూరుకుపోయాను”

అభాగ్యులైన మహిళలు ‘నలిగిన విరిగిన’ హృదయాల నుంచి బాధను ఇలా వెళ్లబోసుకున్నారు.

“చీకటి గదిలో కఠినంగా గడుస్తోంది రాత్రి

ఎవరితో చెప్పుకోవాలి నా యాతన?

రాత్రీ, పగలూ కష్టాలమయం

నా కన్నీళ్లు సైతం ఇంకిపోయాయి”

వారికి ఇళ్లల్లో సైతం దుర్భర జీవన పరిస్థితులు ఉం డేవి. వ్యంగ్య పద్ధతిలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చే యడం తప్ప దాని గురించి వారు ఏమీ చేయలేకపోయారు.

“ఆరడుగుల వెడల్పు

ఎనిమిదడుగుల పొడవు గదిలోనే

అన్ని సౌఖ్యాలూ

అందులోనే కొడవళ్లు పనిముట్లు

అదే సొంత ఇల్లు

అందులోనే వంటచెరకు

రుబ్బురోలు, పొయ్యి కూడా

అందులోనే మా పడక”

భారతీయ సంతతికి చెందిన ఫిజీయన్లు యకోనా (అక్కడి ఒక విధమైన మదిర) పట్ల అభిరుచిని నవువాలో పెంచుకున్నారు. అనామక పాటల రచయిత తన భార్యను ఉద్దేశించి దానిని ఇలా స్వరపరిచా డు. ఈ పాట ఎంత జనరంజకం అయిందంటే, ప్రజలు తమ సంగీత సమావేశాలలో కలిసినప్పుడ ల్లా ఈ పాట పాడకుండా ఉండే వారు కాదు.

“ఓ, నా ప్రియమైనదానా

యకోనాని వదలలేను నేను

నా దేశాన్నీ, కులాన్నీ వదిలేసాను

అమ్మనీ, నాన్ననీ వదిలేసాను

కానీ ఇప్పుడు యకోనాని వదలలేను

మత్తెక్కించే ఈ ద్వీప పానీయాన్ని

తాగుతూ, తాగుతూ రాత్రంతా గడుపుతాను”

ఒప్పందపు వలస జ్ఞాపకాలు మరికొన్ని

“మాకులానే

దుంగ మిల్లుకు వచ్చింది

ఓడిపోయిన చెట్టు దుంగగా చేయబడ్డాక

దానికిప్పుడు నిజంగా ఏ పట్టింపూ లేదు”

ససెనరైన్ పెర్సౌద్

“ఇక్కడ నా యవ్వనం పోగొట్టుకున్నాను

ఈ దీవికి నా జీవితాన్ని ఇచ్చాను

చరిత్ర దౌర్జన్యానికి

మనిషి జీవితం కంటే ఏమి ఇవ్వగలడు?”

సత్యేంద్ర నందన్

ఒప్పంద కార్మికులు నిద్రలేచి ఆహారం సిద్ధం చేసుకుని పొలాలకు వెళ్లాల్సి వచ్చేది. స్త్రీ, పురుష కార్మికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ క్రింది పాట అదే

‘సమయం కాని సమయంలోనైనా

నిద్ర లేపుతాడు

కట్టెలు లేకుండా నిద్రపోనివ్వడు

ఫిజీలో ఇలాంటి బాధలు ఉంటాయని తెలిసుంటే

నగరంలో దండోరా చాటిద్దును

ఫిజీకి ఎవరూ పోవద్దని”

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భర్త కోసం భార్య పాడింది.

“తూర్పు నుంచి రైలొచ్చింది

పడమర నుంచి ఓడొచ్చింది

నా ప్రియమైన వ్యక్తిని

దూరంగా తీసుకుపోయింది

నా సవతిలా రైలు

నా ప్రియమైన వ్యక్తిని దూరం చేసింది

రైలు నా శత్రువు కాదు, ఓడా కాదు

నా నిజమైన శత్రువు డబ్బు

నా ప్రియమైన వ్యక్తిని

ఒక స్థలం నుంచి మరొక స్థలానికి

తీసుకుపోతోంది

నా నిజమైన శత్రువు డబ్బే”

కొందరు కొంతకాలం తరువాత, స్త్రీలను ఇంటి నుంచి బయటకు నెట్టేసేవారు. అలాంటి కష్ట సమయాల్లో, స్త్రీలు తమను తాము రక్షించుకోవలసి వచ్చేది. ఈ క్రింది జానపద గీతం భార్య వేదనలు కొన్నింటిని నమోదు చేసింది.

“సూర్యుడు క్రూరుడు ప్రకాశవంతుడు

చాలా పనులు ఇంకా చేయాల్సి ఉంది

జనం తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు

అయినా భోజనానికి పిలుపు లేదు నాకు

ఇక్కడ, ఈ పొలాలలో

దురదృష్టం కొద్దీ, ఒంటరిగా పని చేస్తున్నాను

నా ప్రభువు దూరదేశంలో ఉన్నాడు

మీ ప్రభువు వచ్చాడని ఎవరు చెబుతారు

ఆ ఆనందపు రోజు ఉదయిస్తుందా”

స్థిరమైన గృహ వివాదాలు, ఇళ్ళ నుంచి బయటకుపోవడానికి మరొక కారణం

“అయ్యో, నేను వేరొకనితో పారిపోవాలా

నా నుంచి తన మనసు

దూరం చేసుకున్నాడు నా ప్రియుడు

నేను ఎంత ఉత్కంఠతో

అన్నం, పప్పు వండి నెయ్యి వడ్డిస్తానో

మేము భోజనానికి కూర్చున్న వెంటనే

గొడవలు మొదలెడతాడు

అతనితో నా హృదయం అలసిపోయింది

కుండలో వేడి నిప్పు పెట్టి

నేను జాగ్రత్తగా పడకపరుస్తాను

మేము విశ్రాంతి తీసుకుందుకు పడుకోగానే,

గొడవలు మొదలెడతాడు

నా హృదయం అతనితో అలసిపోయింది.”

ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో లాగా నే ఫిజీ భారతీయ వలస కార్మికుల చరిత్ర కూడా విషాదభరితమే.

ముకుంద రామారావు

ప్రపంచకప్: భారత్ ఓటమి.. సెమీస్ కు ఇంగ్లండ్

ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్‌లోభారత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. హీథర్ నైట్ అద్భుత సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకుంది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న నైట్ 91 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 109 పరుగులు సాధించింది. ఓపెనర్లు టామీ బ్యూమౌంట్ (22), అమీ జోన్స్ (56) జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ నాట్ సివర్ బ్రంట్ (38) తనవంతు పాత్ర పోషించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌లు అద్భుత పోరాట పటిమను కనబరిచినా భారత్‌కు ఓటమి తప్పలేదు. మంధాన 8 ఫోర్లతో 88 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ 10 ఫోర్లతో 70 పరుగులు సాధించింది. దీప్తి శర్మ (57), హర్లిన్ డియోల్ (24)లు బాగానే బ్యాటింగ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

సోమవారం రాశి ఫలాలు (20-10-2025)

మేషం – మీకు అండగా నిలబడతారని ఆశించిన ఓ వర్గం వారు సకాలంలో అందుబాటులో లేకపోవడం లోటుగా పరిణమిస్తుంది. మీలో మొండితనం పట్టుదల అధికమవుతున్నట్లుగా భావిస్తారు.

వృషభం – కార్యాలయంలో ఉన్నతాధికారుల మెప్పు లభిస్తుంది. నూతనమైన బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు. వాయిదా పడుతూ వస్తున్న విషయాలలో తెగించి నిర్ణయాలను తీసుకుంటారు.

మిథునం – సాంప్రదాయాలకు విలువని ఇచ్చి ఆధునిక పోకడలకు దూరంగా ఉంటారు మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పొందడానికి కావలసిన విధంగా నడుచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది.

కర్కాటకం – ఓర్పు సహనాల విలువ తెలిసి వస్తుంది. సంతాన అవసరాలపైన దృష్టిని సారిస్తారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని తగు వసతులు కల్పించడానికి కృషి చేస్తారు.

సింహం – పరపతి కలిగిన సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో సంప్రదింపులు జరిపి లాభపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.మీకు నచ్చిన వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు

కన్య – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు.

తుల – సోదరుల నుండి వస్తు లాభాలు పొందుతారు. వివాహ ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం – బంధువులు మిత్రులు నుండి శుభవార్తలు వింటారు. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతతి విషయమై చింతించవలసిన అవసరం లేదని గ్రహించి ఊపిరి పీల్చుకుంటారు.

ధనుస్సు – అనుకొని అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. ఎలర్జీ, అజీర్తి వంటి స్వల్ప ఇబ్బందుల పట్ల అప్రమత్తంగా ఉండటం చెప్పదగినది. మొండి పట్టుదల ఉపకరించేది కాదని గ్రహించండి.

మకరం – ఆర్థిక లావదేవిలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. గతంలో అమ్మే ఉద్దేశంతో కొన్న స్థలాన్ని ఇప్పుడు అమ్మకానికి పెడతారు.ఈ విషయము గురించి కుటుంబ సభ్యులతో సమాలోచనలు సాగిస్తారు.

కుంభం – సభలు సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. ఎంతసేపు ఎదుటివారు మీకు హితం చెప్పడమే కానీ మీరు చెప్పేది కనీసం వినని వ్యక్తుల వలన చికాకు కలుగుతుంది.

మీనం – రొటీన్స్ సంతకాలు, అగ్రిమెంట్లు, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆలోచించి నిదానంగా నింపాదిగా వ్యవహరించండి. మిత్ర బృందంలోని ఒకరు మీతో శత్రుత్వం పెంచుకునే సూచనలు ఉన్నాయి.

 

కనుమరుగవుతున్న బిఆర్‌ఎస్.. ఎమ్మెల్సీ అద్దంకి కీలక వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ కనుమరుగుతున్నదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. అయితే ఇతర పార్టీల నుంచి ఛోటా నాయకులను బిఆర్‌ఎస్‌లో చేర్పించుకుంటూ ఉనికిని కాపాడుకునేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు తాపత్రయపడుతున్నారని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బిఆర్‌ఎస్ నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో వారు చేరుతున్నారని ఆయన చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ ఓట్లన్నీ బిజెపికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పడ్డట్లు ఇప్పుడు కూడా పడేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు.

పారా అథ్లెట్ అర్చనకు కెటిఆర్ అండ

శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ఆర్థిక సాయం

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న తెలంగాణ బిడ్డ మిట్టపల్లి అర్చన 

మనతెలంగాణ/హైదరాబాద్ : స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పారా-అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన శుక్రవారం నంది నగర్‌లోని నివాసంలో కెటిఆర్‌ను కలిశారు. కుట్టుపని ద్వారా తన జీవనోపాధిని గడుపుతున్న అర్చన, డిసెంబర్ 8 నుండి 10 వరకు శ్రీలంకలో జరగనున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాచే ఎంపికయ్యారు.

అయితే, ప్రయాణ ఖర్చులు, ఇతర భాగస్వామ్య వ్యయాలను భరించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న అర్చనకు ఈ విజయం అపశ్రుతిగా మారే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కెటిఆర్ తక్షణమే స్పందించి, అర్చనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు. ఆమె ప్రయాణ, క్రీడా ఖర్చులన్నింటికీ పూర్తి ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యేందుకు అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణా సామగ్రిని కూడా ఆమెకు అందజేశారు. కెటిఆర్ నుంచి సకాలంలో లభించిన ప్రోత్సాహంతో, అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనే అర్చన కల సాకారం కానున్నది.

అర్చన పోరాటం స్ఫూర్తిదాయకం

అర్చన కథ ఆమె ధైర్యం, పట్టుదలకు నిదర్శనం అని కెటిఆర్ వ్యాఖ్యానించారు. చంద్రంపేటలోని ఒక కుట్టు మిషన్ నుండి అంతర్జాతీయ వేదికపైకి చేరుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. తెలంగాణ ఆమెను చూసి గర్విస్తోందని, రాష్ట్రానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలిచేందుకు ఆమెకు అవసరమైన పూర్తి సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.