elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

kingroyal

marsbahis

kavbet

pusulabet

grandpashabet

wbahis

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Pusulabet

Pusulabet Giriş

త్వరలో వాణిజ్య ఒప్పందం?

వాషింగ్టన్ : భారతదేశం అమెరికా చాలా కాలంగా చర్చలలో ఉన్న వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు 15 లేదా 16 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన ముగ్గురు వ్యక్తుల నుంచి అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ బుధవారం మింట్ ఈ వార్త రిపోర్ట్ చేసింది. ఇంధనం, వ్యవసాయానికి సంబంధించిన భిన్నాభిప్రాయాల కారణంగా ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఒప్పందం కుదిరితే భారతదేశం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకునే అవకాశం ఉందని మింట్ పేర్కొంది. అమెరికా నుంచి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న, సోయామీల్ దిగుమతులను చేసుకునేందుకు భారత్ అంగీకరించవచ్చని , ఈ నెలలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని మింట్ పేర్కొంది. 

బంధుప్రీతికే బీహార్ పార్టీల జై

వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాలను తుప్పు పట్టిస్తాయని రాజకీయ పార్టీల అగ్రనాయకులు పదేపదే చెబుతుంటారు. కానీ బీహార్‌లో చాలా ప్రధాన పార్టీలు తమ సీనియర్ నాయకులకు చెందిన రక్తసంబంధీకులకే ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి టికెట్ ఇస్తుండడం విశేషం. అధికార నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డిఎ)లేదా గ్రాండ్ అలయన్స్ (ఇండియా కూటమి) ఏదైనా ఈ ట్రెండ్‌కు మినహాయింపు కాదు. వంశపారంపర్య రాజకీయాలపై పదేపదే విమర్శలు సంధించే బిజెపి కూడా బీహార్‌లో బంధుప్రీతికి తలొగ్గక తప్పడం లేదు. కొడుకులు, కూతుళ్లు, భార్యలు, కోడళ్లు, అల్లుళ్లు, దగ్గరి బంధువులు ఇలా ఎందరో బరిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా నైతిక ప్రాధాన్యత, సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టమవుతోంది. బీహార్‌లో గ్రామీణ జనాభా విద్యాస్థాయి చాలా తక్కువగా ఉండడంతో వారసత్వ రాజకీయాల గురించి ఓటర్లు అంతగా పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితి కొనసాగడానికి దోహదమవుతోంది. ఎన్‌డిఎ లోని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి హిందుస్థానీ అవామీ మోర్చా (సెక్యులర్) సంస్థాపకులుగా రాజకీయ ప్రాచుర్యం మంచి పేరుంది.

ఆయన తన కోడలు దీపాకుమారిని ఇమామ్‌గంజ్ స్థానం నుంచి పోటీకి నిలబెట్టారు. ఆమె తల్లి జ్యోతిదేవీ బరాచట్టి స్థానం నుంచి పోటీ చేస్తుండగా, సికంద్రా స్థానంనుంచి జితన్ రామ్‌మాంఝీ అల్లుడు ప్రఫుల్ మాంఝీ బరిలోకి దిగారు. మాజీ ఎంపీ, భూమిహార్ నాయకుడు అరుణ్‌కుమార్ కొడుకు, సోదరుడు, సమీప బంధువులు ఎన్నికల్లో పోటీకి టికెట్లు పొందగలిగారు. అరుణ్‌కుమార్ కొడుకు రితురాజ్ కుమార్ ఘోసి నియోజకవర్గం నుంచి జనతాదళ్ (యునైటెడ్) అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన సోదరుడు అనిల్ కుమార్ , దగ్గరి బంధువు రోమిత్ కుమార్ క్రమంగా తికారీ, అటారీ స్థానాల నుంచి హిందుస్థానీ అవామీ మోర్చా పార్టీ టికెట్ పొందారు. బిజెపి తన విధానాలను విడిచిపెట్టి సంస్థాగత రాజకీయ ప్రముఖులకు చెందిన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇస్తోంది. ఉదాహరణకు టికెట్లు పొందిన వారిలో రాజకీయ అనుభవజ్ఞుడైన, మాజీ ఎంపి శకుని చౌదరి కుమారుడైన బీహార్ డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరి ఉన్నారు. శకుని చౌదరి పూర్వపు సమతా పార్టీ సంస్థాగత సభ్యుల్లో ఒకరు.

సామ్రాట్ చౌదరి 15 ఏళ్ల విరామం తరువాత తారాపూర్ నుంచి పోటీకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కుమారుడు, మాజీ రైల్వే మంత్రి ఎల్‌ఎన్ మిశ్రా మేనల్లుడు అయిన నితీశ్ మిశ్రాను తిరిగి ఝాంఝర్‌పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి పోటీ చేయిస్తోంది. నితీశ్ కుమార్ కేబినెట్‌లో నితీశ్ మిశ్రా మంత్రిగా ఉన్నారు. అదే విధంగా శ్రేయాసి సింగ్ జమూల్ స్థానంనుంచి తిరిగి పోటీ చేస్తున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తల్లి పుతుల్ కుమారి బాంకాకు ఎంపిగా ఉన్నారు. గౌరబౌరమ్ స్థానంనుంచి బిజెపి సుజిత్ కుమార్ సింగ్‌కు తిరిగి టికెట్ ఇచ్చింది. ఎమ్‌ఎల్‌ఎ స్వర్ణసింగ్ భర్త సంజీవ్ చౌరాసియా డిఘా నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ గవర్నర్ గంగాప్రసాద్ కుమారుడు సంజీవ్ చౌరాసియా. మాజీ ఎమ్‌ఎల్‌ఎ నవీన్ కిషోర్ ప్రసాద్ కుమారుడు నితిన్ నబీన్ బంకిపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విధంగా మరికొందరు బిజెపిలో పోటీకి దిగుతున్నారు.

మాజీ ఎంఎల్‌ఎ, మాజీ ఎంపి సీతారామ్ సింగ్ కుమారుడు రాణా రణ్‌ధీర్ మధుబన్ నుంచి రంగంలో ఉండగా, మాజీ ఎంఎల్‌ఎ భూపేంద్ర సింగ్ కుమారుడు దేవేష్ కాంత్ సింగ్ గొరియాకోథి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంఎల్‌ఎ సునీల్ పాండే కుమారుడు విశాల్ ప్రశాంత్ తరారీ నుంచి, మాజీ ఎంఎల్‌ఎ రామ్ నరేష్ యాదవ్ కోడలు గాయత్రీ దేవి పరిహార్ నియోజకవర్గంనుంచి పోటీలో ఉన్నారు. అరుణ్‌కుమార్ సింగ్ తండ్రి బ్రిజ్ కిషోర్ సింగ్, తాత యమునా సింగ్ బరూరాజ్ ఎంఎల్‌ఎలుగా పనిచేశారు. జెడి(యు) పార్టీ అభ్యర్థుల జాబితా కూడా దీనికి తీసిపోలేదు. ఎమ్‌ఎల్‌ఎ నీలం దేవీ భర్త అనంత్ సింగ్ మొకమా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపి ఆనంద్‌మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ నబీనగర్ నుంచి, మాజీ మంత్రి మంజువర్మ కుమారుడు అభిషేక్ కుమార్ చెరియా బరియార్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడైన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం లోని ఎల్‌జెపి (ఆర్‌వి) లో కూడా బంధుత్వాలు వదల్లేదు.

చిరాగ్ పాశ్వాన్ తన మేనల్లుడు సిమంత్ మృణాల్‌కు టికెట్ ఇచ్చారు. ఆయన బావ జముయి ఎంపిగా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్‌ఎల్‌ఎం)అధినేత, రాజ్యసభ సభ్యులు ఉపేంద్ర కుష్వాహా భార్య స్నేహలత ససారం నుంచి పోటీ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా వంశపారంపర్య రాజకీయాల కేంద్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్‌జెడిలో అనేక మంది రాజకీయ వారసులు కనిపిస్తారు. మాజీ సిఎం లల్లూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వియాదవ్, రఘొపోర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ముఠా నాయకుడు నుంచి రాజకీయ నాయకుడుగా మారిన దివంగత మొహమ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు ఆర్‌జెడి రఘునాథ్ పూర్ నుంచి టికెట్ ఇచ్చింది. అలాగే ముఠా నాయకుడు, మాజీ ఎమ్‌ఎల్‌ఎ మున్నా శుక్లా కుమార్తె శివానీ శుక్లా లాల్‌గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బ్రిజ్ బిహార్ హత్య కేసులో మున్నాశుక్లా ప్రస్తుతం జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. శివానీ శుక్లా తల్లి మాజీ ఎంఎల్‌ఎ. ఈ విధంగా ఆర్‌జెడి మరికొందరికి టికెట్లు ఇచ్చింది. 

అరకొర ప్రజాస్వామ్యం మాకు అక్కర్లేదు

లడఖ్ ప్రజలు సెప్టెంబర్ 24ను మరచిపోలేరు. ఆగ్రహోదగ్రులైన జనరేషన్ జెడ్ యువకులు స్థానిక బిజెపి కార్యాలయాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు పోలీసులు జరిపిన కాల్పులలో మాజీ సైనికుడితో పాటు నలుగురు యువకులు ఆనాడు మరణించారు. నమ్మశక్యం కాని విధంగా నిరసనలకు సంబంధించి ఓ గాంధేయవాది, హింసను వ్యతిరేకించే స్థానిక హీరో సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. 1600 కిలోమీటర్ల దూరంలోని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు పంపారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర వంటి ఆరోపణలతో ఆ అరెస్టు జరిగింది.

లడఖ్ విభిన్నమైన నేపథ్యంగల రెండు మతాలకు ఆలవాలం. బౌద్ధులతో కూడిన లేహ్, మెజారిటీ షియా ముస్లింలు ఉండే కార్గిల్. ఆ రెండు ప్రాంతాలు రాజకీయంగా, సామాజికంగా భిన్నమైన నేపథ్యం కలవే. కానీ, ప్రజాస్వామ్య ఆకాంక్ష వారిని ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ, కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ తమ విభేదాలను పక్కన పెట్టి ఏకంకావడంతో లడఖ్ రాజకీయాలలో కొత్త చైతన్యం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో కార్గిల్ డెమోక్రాటిక్ అలయన్స్ (కెడిఎ) నేత సజ్జాద్ హుస్సేన్ కార్గిలి తో హరీందర్ జరిపిన ఇంటర్వ్యూ. 

ప్రశ్న: గతంలో లడఖ్ స్వతంత్ర ప్రతిపత్తి గల హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు 2023లో ఎన్నికలు జరిగాయి. లేహ్ అపెక్స్ సంస్థ వాటిని బాయ్‌కాట్ చేసింది, కెడిఎ పాల్గొన్నది. త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండుసంస్థలు కలిసి పనిచేస్తాయా?

జవాబు: ఈ ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే జరగవలసి ఉంది. వాయిదా పడ్డాయి. ఇప్పటివరకూ ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. ఎన్నికల తేదీని ప్రకటించలేదు. ఈ మధ్య జరిగిన హింసాకాండతో ఎన్నికలు మరింత జాప్యం కావచ్చు. బిజెపి మౌనంగా ఉంది. బిజెపి కేవలం ఎన్నికల్లో పోటీచేసే రాజకీయ పార్టీయే కాదు. కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం యంత్రాంగం దానికి అనుకూలంగా ఉందని ప్రజలకు తెలుసు. కెడిఎకు సంబంధించినంతవరకూ ఎన్నికలు కేవలం రాజకీయ వ్యవహారం కాదు. అది జనవాక్య సేకరణ (రిఫరేండమ్). ఈ ప్రాంతంలో ప్రజలు తన ఆకాంక్షలను ఎలా తోసిపుచ్చారో తమ ఓట్ల ద్వారా చెబుతారు. ఈ సందేశం కౌన్సిల్ ఎన్నికలకే పరిమితంకాదు. పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ప్రతిబింబించవచ్చు.

ప్రశ్న: గతంలో కార్గిల్, లేహ్ ఆలోచనలు భిన్నంగా ఉండేవి కదా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత, లేహ్ ఆ చర్యను స్వాగతించగా, కార్గిల్ వ్యతిరేకించింది. ఏ మార్పు మీ ఇద్దరినీ ఎలా ఏకం చేసింది?

జవాబు: తమ అభిప్రాయాలను ఎవరూ పట్టించుకోరని ప్రజలు గుర్తించినప్పుడు వారు షాక్ తిన్నారు.ఆర్టికల్ 370 రద్దుతో దాని వల్ల గ్యారంటీగా కలిగే రక్షణలు దూరమయ్యాయి. అభద్రతా భావం రెండు వర్గాలను ఏకం చేసింది. లేహ్ అపెక్స్ సంస్థ ప్రజాస్వామ్య పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత వహిస్తోంది. కార్గిల్‌లో డెమోక్రాటిక్ అలయన్స్ చురుగ్గా పని చేస్తోంది. సరైన ప్రాతినిధ్యం లేకపోవడమే సమస్యకు కారణమని ప్రజలు గుర్తించారు. నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం కొరవడడం వల్ల సమన్వయ కృషి వల్లనే తమ వాదన వినిపించగలమని తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యపరమైన మార్పుకోసం అందరూ ఏకం కావడం అవసరం.

ప్రశ్న: లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించడంపై గతంలో లేహ్, కార్గిల్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ విషయంలో విభేదాలు తొలగాయా?

జవాబు: గతంలో మతపరమైన విభేదాలు ఉద్దేశపూర్వకమైన సామాజిక పరిస్థితులవల్ల ఏర్పడినవి. గతంలో ప్రభుత్వాలు ఈ విభేదాలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకున్నాయి. హింస ఎప్పుడూ ఆమోదయోగ్యం కాదు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో లేహ్ లోని బౌద్ధ మతస్థులు పార్లమెంటులో కనీసం ఒక బౌద్ధుడు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. సమంజసమైన కోర్కే. అలాగే కార్గిల్ నుంచి షియా ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం లభించాలని కోరుకున్నారు. దేశంలో నిజమైన షియా ప్రతినిధి లేరు కూడా. అందువల్ల షియా ప్రతినిధి లడఖ్ నుంచి పార్లమెంటుకు వెళ్లాలని కోరుకుంటున్నది. లడఖ్‌కు రెండు పార్లమెంటు సీట్లు, ఒక రాజ్యసభ సీటు కేటాయిస్తే, రెండు కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం లభిస్తుంది.

ప్రశ్న: బిజెపి లేదా ప్రభుత్వం విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? లడఖ్‌కు సంబంధించి వారి ఉద్దేశం ఏమై ఉంటుంది?

జవాబు: వారి చివరి ఎత్తు ఏమిటన్నది ఆందోళన కలిగించడం లేదు. మా న్యాయపరమైన హక్కుల కోసం మేం పోరాటం సాగించేందుకు దృఢచిత్తంతో ఉన్నాం. ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలను మాపై రుద్దేయలేదు. లడఖ్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలన్నదే మా నిశ్చితాభిప్రాయం. ఆ డిమాండ్ నెరవేరే వరకూ మేం విశ్రమించం.

ప్రశ్న: గతంలో కార్గిల్‌లో బిజెపి పెద్దగా లేదు. అయినా కౌన్సిల్ ఎన్నికల్లో కాస్త మెరుగ్గా ఓ సీటు గెలుచుకుంది ఎలా?

జవాబు: కార్గిల్‌లో బిజెపి ప్రభావం నిజానికి పరిమితమే. బౌద్ధుల జనాభా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో వారు సులభంగా మద్దతు పొందుతున్నారు. మొత్తం మీద చూస్తే, లేహ్‌లో వారి బలం గణనీయమైనదే.

ప్రశ్న: సోనం వాంగ్ చుక్‌ను విడుదల చేయాలని జరిగిన హింసాత్మక ఘటనలపై జుడీషియల్ విచారణ చేయాలని మీరు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందస్తు డిమాండ్లు ఇవేనా. ఇదికాక మీ డిమాండ్ ఏమైనా ఉందా?

జవాబు: మా ప్రధాన డిమాండ్ ఒకటే లడఖ్‌కు తమ డిమాండ్ చెప్పే అవకాశం ఇవ్వండి. కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజల గొంతు మూగపోయింది. ఇక్కడి ప్రజలకు రాజకీయ డిమాండ్లు ఏమీ లేవు. అంతా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. కంటి తుడుపు ప్రజాస్వామ్యం కాదు. పూర్తిస్థాయి నిజమైన ప్రజాస్వామ్యం. లడఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కల్పించాలన్నదే మా డిమాండ్. మాకు రాజ్యాంగపరమైన అన్ని హక్కులు కల్పించండి. అదనంగా ఆరో షెడ్యూల్‌లో మమ్మల్ని చేర్చమని కోరుతున్నాం.

ప్రశ్న: కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం హోదా కల్పిస్తే!

జవాబు: వారు అదే చేయవచ్చు. కానీ, దానివల్ల మా పోరాటం ముగిసిపోదు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం అయినా, పూర్తి అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ కే ఉంటాయి. ప్రజలకు నిర్ణయాధికారం ఉండదు. లడఖ్ మరో ఢిల్లీ కావాలని మేం కోరుకోవడం లేదు. రాజ్యాంగ పరిరక్షణలతో కూడిన ప్రజాస్వామిక సూత్రాలకు అనుగుణంగా నడిచే స్వయం పాలిత రాష్టం హోదా కల్పించాలి. పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తే తప్ప అది నెరవేరదు.

స్థానికంపై నేడు నిర్ణయం?

మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గం నేడు మరోసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. బిసి రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తుండగా మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బిసి పునరుద్ధరణ, ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ పనులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రైతు భరోసా స్కీమ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం కాగా, నేడు మరోసారి కేబినెట్ భేటీ జరుగనుంది.

జగ్గారెడ్డి రూటే సపరేటు

వచ్చే పదేళ్లదాకా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోను అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొనడం ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏటా దసరా, శ్రీరామనవమి, మహాశివరాత్రి వేడుకలను జగ్గారెడ్డి వైభవంగా నిర్వహిస్తారు. సంగారెడ్డిలోనే భారీ ఏర్పాట్ల నడుమ అట్టహాసంగా జరిపే ఈ వేడుకలకు వేలాది మంది హాజరవుతారు. అయితే, దసరా, శివరాత్రి వేడుకలకు సభా వేదిక కూడా ఉంటున్నందున ఈరెండు సందర్భాల్లో ఆయన ప్రసంగిస్తారు. ఈసారి కూడా అలాగే దసరా వేడుకల్లో వేలాది మందిని ఉద్దేశించి మాట్లాడారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ ఉద్యమ సమయంలో జగ్గారెడ్డి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. నాటి టిఆర్‌ఎస్‌పై ప్రతి సందర్భంలోనూ ఒంటికాలిపై లేచారు. బిఆర్‌ఎస్ నేతలే కాదు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొందరు ఆయనకు దూరంగా ఉండేవారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఆయన వ్యవహరించిన తీరు ఫైర్ బ్రాండ్ పేరును కొనసాగించింది. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు ఉభయ రాష్ట్రాల్లో ఆయనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా తెచ్చిపెట్టింది. అందుకని ఆయన ఎక్కడికి వెళ్లినా.. హంగామా ఉంటుంది. మాజీ సిఎం కెసిఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు, నేటి మంత్రి రాజనర్సింహ, దివంగత బాగారెడ్డి లాంటి నేతలు ఉమ్మడి మెదక్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ జగ్గారెడ్డిది ప్రత్యేక శైలి! సహజంగా రాజకీయ నేతలు ఖద్దరు చొక్కాలు ధరిస్తారు. లేకుంటే, వివిధ రంగుల్లో చొక్కాలు ధరిస్తారు. కానీ, ఎల్లప్పుడూ టీషర్టు ధరించడం ద్వారా ‘మాస్’ ముద్ర వేసుకున్నారు.

తొలుత బిజెపి ద్వారా సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌గా పని చేసి, ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా సంగారెడ్డి నుంచి గెలుపొందారు. కేంద్ర మాజీ మంత్రి టైగర్ నరేంద్ర ప్రియశిష్యునిగా ఆయన వాగ్ధాటిని పుణికిపుచ్చుకున్నారు. అదే జోష్‌ను గత రెండున్నర దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న తరుణంలో కాంగ్రెస్ సభను ఆయన నిర్వహించారు. కోట్లాది రూపాయల ఖర్చుతో సంగారెడ్డిలో జరిపిన ఈ సభ ద్వారా ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టిలో ఆయనపడ్డారు. ఆ విధంగా ఢిల్లీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 లో మూడోసారి ఎంఎల్‌ఎగా గెలిచిన తర్వాత రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విధంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023 ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ కోటాలో మంత్రి పదవి ఖాయమనుకున్న సమయంలో.. ఓటమి పాలయ్యారు. ఆ విధంగా ఆయన దూకుడుకు బ్రేకు పడింది. అయినప్పటికీ అటు రాహుల్ గాంధీ వద్ద ఉన్న పలుకుబడితో, ఇటు రాష్ట్రంలో ఉన్న పార్టీ అవసరాల రీత్యా ఆయన భార్య నిర్మల కు టిజిఐఐసి ఛైర్మన్‌గా నామినేటెడ్ పోస్టు లభించింది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పదవి ద్వారా జగ్గారెడ్డికి పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు మరోసారి వెల్లడయింది.

ఈ నేపథ్యంలో తరచుగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల దసరా ఉత్సవాల్లో చేసిన వ్యాఖ్యలు అటు సొంత పార్టీలో, ఇటు విపక్షాల్లో కూడా చర్చకు దారితీశాయి. మరో మూడేళ్ల తర్వాత, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. తనకిప్పుడు 59 సంవత్సరాలు అని, పదేళ్ల తర్వాత అంటే 69 సంవత్సరాల వయస్సులో తిరిగి పోటీ చేస్తానని, మధ్యలో తన కోసం సేవ చేసిన తన అనుచరుడు ఆంజనేయులు వస్తే రావచ్చని ఆయనన్నారు. అప్పటి వరకు తాను వీరికి వెంట ఉండి నడిపిస్తానని అన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వల్లనే జగ్గారెడ్డి ఇలా అంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ క్రియేట్ చేసేందుకు ఇలా అన్నారని మరికొందరు అంటున్నారు. దీని వెనుక భారీ వ్యూహం ఉన్నదని ఇంకొందరు అంటున్నారు. మూడేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఏమో? ఇంత ముందుగా ప్రకటనలు అవసరమా? అని విపక్షాలు అంటున్నాయి. మూడేళ్ల తర్వాత అయినా… ఇంకా ఎప్పుడైనా… పార్టీ నిర్ణయాన్ని పాటించాల్సిందే కదా…! అలాంటప్పుడు ఈ వ్యాఖ్యల ప్రభావం ఏమీ ఉండదని స్వపక్షంలోని కొందరు భావిస్తున్నారు. పదేళ్ల తర్వాత రాజెవడో… రాకాసి ఎవడో..!? అని అంటున్నారు. ఆయన అనుచరులు మాత్రం కొంత గందరగోళానికి గురవుతున్నారు.

గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేసినప్పటికీ ఈ దఫా చేసిన ప్రకటన తన రాజకీయాలకు సంబంధించినది కావడం ప్రత్యేకత సంతరించుకున్నది. మొత్తమ్మీద తన ప్రకటనలు, వ్యాఖ్యానాల ద్వారా నిత్యం జనంలో చర్చలో ఉండడం ద్వారా జగ్గారెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆయనకు కొన్ని సార్లు నష్టం కలిగించగా, మరికొన్ని సార్లు బలాన్ని పెంచాయి. ఉమ్మడి ఎపి మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి లాంటి ఉద్దండులు ఏలిన సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం పార్టీలో ఏకచ్ఛత్రాధిపత్యాన్ని జగ్గారెడ్డి కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సిఎంలు వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి తోపాటు నేటి రేవంత్‌రెడ్డితో తాను సన్నిహితంగా ఉన్నానని బహిరంగంగానే అంటుంటారు. గెలుపోటములకు సంబంధం లేకుండా తనకంటూ ఒక వర్గాన్ని ఆయన సృష్టించుకున్నారు. నాకు తోచిందే నేను చేస్తాను… ఇంకొకరు చెప్పింది చేయనే చేయను… అని చెప్పడం కూడా ఆయనకే చెల్లింది! అందుకని బిఆర్‌ఎస్ ఆయనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో సక్సెస్ అయింది. ఈసారి ఏమవుతుందో చూడాలి!.

బండారు యాదగిరి

98489 97083

(ఉమ్మడి మెదక్ బ్యూరో)

నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత్ కు సవాల్

అడిలైడ్: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే రెండో వన్డే టీమిండియాకు సవాల్‌గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. ఇక తొలి వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. మొదటి వన్డేలో పలుమార్లు వర్షం అడ్డంకిగా మారడంతో భారత బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతిన్నది. దీని ప్రభావం జట్టు బ్యాటింగ్‌పై బాగానే పడింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని ఆస్ట్రేలియా బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు.

హాజిల్‌వుడ్, మిఛెల్ ఓవెన్, కుహ్నెమన్ తదితరులు అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాటర్లను హడలెత్తించారు. తొలి వన్డేలో కీలక ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ తదితరులు నిరాశ పరిచారు. కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా విఫలమయ్యాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ విఫలం కావడంతో భారత్ ప్రత్యర్థి టీమ్ ఆస్ట్రేలియా ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచలేక పోయింది. ఈ మ్యాచ్‌లోనైనా కోహ్లి, రోహిత్, అయ్యర్, గిల్ తదితరులు తమ తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే టీమిండియా గెలుపు అవకాశాలు మెరుగు పడుతాయి.

ఆత్మవిశ్వాసంతో..

మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఇందులోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. స్టార్క్, హాజిల్‌వుడ్, ఎల్లిస్, ఓవెన్, కుహ్నెమన్ తదితరులతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక కెప్టెన్ మార్ష్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్, రెన్‌షా, ఓవెన్ తదతరులతో బ్యాటింగ్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

రవాణా చెక్‌పోస్టులు రద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీ సుకుంది. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆ దేశాలు జారీ చేసింది. అక్టోబర్ 22వ తేదీన సాయంత్రం 5 గం టల లోపు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశా రు. రెండు నెలల క్రితం ఈ చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణ యం తీసుకున్నా వాటిని కొనసాగించడంపై సిఎం రేవంత్ సీరియస్ అ య్యారు. వెంటనే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌ఫోర్ట్ చెక్ పోస్టులను మూ సివేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో రవాణా శాఖ కమిషనర్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. దీంతోపాటు తాను జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే అమల్లోకి తీసుకు రావాలని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్లు, జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు, సిగ్నేజ్ తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. సిబ్బందిని ఇతర శాఖలకు తిరిగి నియమించాలని చెక్ పోస్టుల దగ్గర ఎవరూ ఉండొద్దని ఆయన సూచించారు. చెక్ పోస్టుల దగ్గర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, రికార్డులు, ఫర్నీచర్, పరికరాలు వెంటనే జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయానికి తరలించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక, పరిపాలనా రికార్డులను సమన్వయం చేసి భద్రపరచాలని కమిషనర్ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా తగిన ప్రకటనలు ఇవ్వాలని, చెక్ పోస్టుల మూసివేతపై సమగ్ర నివేదికను అక్టోబర్ 22 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని రవాణాశాఖ కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.’

ఏసిబి నివేదిక ఆధారంగా…..

కాగా, గత శనివారం అర్ధరాత్రి (18వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసిబి అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం జిల్లాల్లోని చెక్ పోస్టులపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించడంతో పాటు అక్కడ జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి ఏసిబి నివేదిక అందించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులను మూసివేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

చెక్‌పోస్టుల స్థానంలో ఏఎన్‌పిఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి….

ఈ చెక్‌పోస్టుల ఎత్తివేత అనంతరం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పిఆర్) అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అడ్వాన్సుస్డ్ కెమెరా సిస్టమ్ ఖైరతాబాద్‌లోని ప్రధాన రవాణా శాఖ ఆఫీస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో రవాణా శాఖలో పారదర్శకత స్పష్టంగా కనిపించనుంది. అయితే, ప్రస్తుతం చెక్‌పోస్టుల వద్ద డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. ఏ వాహనం అయినా కెమెరా కళ్లు గప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్‌లను కూడా రవాణా శాఖ రంగంలోకి దింపనుంది. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్‌ఫోర్ట్ చేసే వాహన యజమానుల అసోసియేషన్‌కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించనున్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్‌తో పాటు సరకు రవాణా వాహనాల పర్మిట్లు, మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్‌లైన్‌లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతుల్లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు 15 చెక్ పోస్టులు దగ్గర విధుల్లో ఉన్న సుమారు 70 మంది ఎంవిఐలు, ఏఎంవిఐలు, ఇతర సిబ్బందిని ప్రస్తుతం రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు.

రెండేళ్లలో ఉస్మానయా

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణంపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. నూతన ఆసుపత్రి అవసరాలకు తగినట్లుగా అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలు సి ద్ధం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. అధునాతన పరికరాల ఏర్పాటుకు తగినట్లుగా గదులు, ల్యాబ్‌లు, ఇతర నిర్మాణలు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు స్థానికులకు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల వేగవంతానికి వైద్యారోగ్య శాఖ, పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రతి పది రోజులకోకసారి సమావేశమై ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటూ పనులు 

వేగంగా జరిగేలా చూడాలని సిఎం ఆదేశించారు. ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యాక అక్కడి బందోబస్తు ట్రాఫిక్ విధుల నిర్వహణకు సంబంధించి ముందుస్తుగానే తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలు ఇప్పటి నుంచే రూపొందించాలని ఆర్ అండ్ బి అధికారులకు సిఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్మాణానికి ఒక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్మాణాలపై 24×7 అధికారి పర్యవేక్షించేలా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించాలని సిఎం సూచించారు. వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, శ్రీనివాసరాజు, సిఎం కార్యదర్శి మాణిక్ రాజ్, డిజిపి శివధర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, క్రిస్టియానా జోంగ్తూ, ఇలంబర్తి, ముషారప్ అలీ ఫరూఖీ, హరిచందన తదితరులు పాల్గొన్నారు. 

జెన్‌కో, ట్రాన్స్‌కోలో సమ్మె నిషేధం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ని విద్యుత్ పంపిణీ సం స్థలు మరో కీలక నిర్ణ యం తీసుకున్నాయి. రాష్ట్ర పవర్ కార్పొరేషన్ల లో రానున్న 6 నెలలపా టు సమ్మెలను నిషేధి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో లోని మూడు డిస్ట్రిబ్యూషన్ సంస్థల్లో, జెన్‌కో లో విద్యుత్ ఉద్యోగులు ఎలాంటి సమ్మెకు దిగరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఈ ఉత్తర్వు లు నవంబర్ 10 నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది. అయితే ఇంతకముందు మే 10 నుంచి నవంబర్ 9 వరకు పవర్ కార్పొరేషన్లలో సమ్మెలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా తా జాగా వాటిని మరో 6 నెలలపాటు రాష్ట్ర ప్రభు త్వం పొడిగించింది. ఉత్తర్వులను అతిక్రమించిన విద్యుత్ ఉద్యోగులపై, ఆయా ఉద్యోగ సం ఘాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభు త్వం హెచ్చరించింది.

సిఎంకు జూపల్లి ఫిర్యాదు..రిజ్వీ విఆర్‌ఎస్

మనతెలంగాణ/హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిజ్వీ 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆయనకు సుమారుగా 10 ఏళ్ల సర్వీసు ఉన్నా ఆయన పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆయన పనితీరుపై ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆయన పనితీరుతో పాటు మద్యం కంపెనీల విషయమై సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావు వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీల మధ్య వార్ జరిగిందన్న చర్చ ప్రస్తుతం ఎక్సైజ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై పలు ఆరోపణలు చేస్తూ మంత్రి జూపల్లి సిఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీంతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ తీసుకున్న నిర్ణయాలతో ఎక్సైజ్ శాఖకు కోట్లలో నష్టం వచ్చిందని సిఎంకు మంత్రి జూపల్లి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం.

మంత్రి జూపల్లి చేసిన ఫిర్యాదులోని కొన్ని అంశాలు ఇలా…

మంత్రి జూపల్లి చేసిన ఫిర్యాదులోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. మద్యం లేబుళ్లకు సంబంధించి రిజ్వీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, దీంతోపాటు 2బి బార్‌ల విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా రిజ్వీ వ్యవహారించారని, బార్ యజమానుల బకాయిల చెల్లింపులోనూ, బార్ లైసెన్సులను రెన్యువల్ వ్యవహారంలోనూ రిజ్వీ ఆరునెలల పాటు ఆలస్యం చేశారని మంత్రి జూపల్లి సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. వీటితో పాటు టిజిబిసిఎల్ విషయంలోనూ రిజ్వీపై మంత్రి జూపల్లి అనేక ఫిర్యాదులు చేసినట్టుగా తెలిసింది. రిజ్వీపై వచ్చిన ఆరోపణలపై మంత్రి జూపల్లి సంజాయిషీ కోరినా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ పట్టించుకోలేదని మంత్రి జూపల్లి సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది.

టిజిబిసిఎల్‌లో అనేక అవకతవకలు?

టిజిబిసిఎల్‌లో అనేక అవకతవకలు జరిగాయని, వాటికి సంబంధించి రికార్డులను సమర్పించాలని మంత్రి జూపల్లి ఆదేశించినా అటు ప్రభుత్వానికి, ఇటు మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ సమర్పించలేదని మంత్రి జూపల్లి సిఎంకు ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇక, మద్యం ధరల విషయంలోనూ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చేటట్టు వ్యవహారించారని ఇదే విషయమై గతంలోనూ ప్రభుత్వం ఆయన్ను వివరణ కోరగా ఆ విషయంలోనూ ఆయన స్పందించలేదని తెలిసింది. ప్రస్తుతం సిఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు వెళ్లిన నేపథ్యంలో రిజ్వీ మనస్థాపంతో విఆర్‌ఎస్ తీసుకున్నట్టుగా సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

14 నెలల పాటు వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా

వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన సుమారు 14 నెలల పాటు పనిచేశారు. గతనెల 18వ తేదీన రిజ్వీకి జిఏడి ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను సైతం ప్రభుత్వం అప్పగించింది.ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి సంబంధించిన వారు మాత్రం ఆయనకు ఓ ప్రైవేటు కంపెనీలో ముఖ్య అధికారిగా ఆఫర్ వచ్చిందని నెలకు రూ.25 నుంచి రూ50 లక్షల జీతమని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఆయన అనారోగ్య కారణంగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని పేర్కొంటుండడం విశేషం.

ముగ్గురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు

రిజ్వీ విఆర్‌ఎస్‌కు ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బాధ్యతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అందులో భాగంగా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఇక, దేవాదాయశాఖ డైరెక్టర్‌గా ఎస్.హరీశ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించగా, గనుల శాఖ డైరెక్టర్‌గా భవేశ్ మిశ్రాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌గా గరిమ అగర్వాల్‌ను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిఓ ఆర్‌టి 1472లో ఉత్తర్వులు జారీ చేశారు.