Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

galabet

pusulabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

jojobet

holiganbet giriş

casibom giriş

esenyurt escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

grandpashabet

marsbahis

imajbet

grandpashabet

meritking

padişahbet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తొలిస్థానంలో తెలంగాణ

జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా అవతరించిందని జల్ శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. అలాగే 4.05 లక్షల టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులతో ఛత్తీస్ గఢ్ 2వ స్థానంలో, 3.64 లక్షల నీటి సామర్థ్య ప్రాజెక్టులతో రాజస్థాన్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు.‘జల్ శక్తి అభియాన్ : క్యాచ్ ది రెయిన్’ ప్రచారం కింద ఈ ఏడాది అవార్డులను అందిస్తున్నట్లు పాటిల్ ప్రకటించారు. నవంబర్ 18న జరిగే 6వ జాతీయ జల అవార్డుల కార్యక్రమంలో జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావుతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారని తెలిపారు.

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

గత పది రోజుల వరకు రాష్ట్రాన్ని తడిచి ముద్ద చేసిన వర్షాలు తగ్గాయనే లోపే చలి పంజాతో రాష్ట్రాన్ని వణికిస్తుంది. గత రెండు రోజులుగా చలి తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమొదయ్యాయి. ఆదిలాబాద్‌లో 10.2 డిగ్రీలు, రాజన్న సిరిసిల్లలో 11.5, నిర్మల్‌లో 11.7, నిజామాబాద్‌లో 11.8, వికారాబాద్‌లో 12.0, సంగారెడ్డిలో 12.1, కామారెడ్డిలో 12.2, జగిత్యాలలో 12.5, మెదక్‌లో 12.8, సిద్దిపేటలో 13.3, రంగారెడ్డి,

కరీంనగర్‌లో 13.4న, మంచిర్యాలలో 13.6, పెద్దపల్లిలో 13.7, మహబూబ్‌నగర్‌లో 14, నారాయణపేటలో 14.1, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లిలో 14.4, యాదాద్రి భువనగిరిలో 14.7, జనగాంలో 14.8, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 14.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు రాష్ట్ర డెవలెప్‌మెంట్ ప్రణాళికా సంఘం వెల్లడించింది.దీంతో పాటు రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉంటాయని పేర్కొంది. చలి తీవ్రత దృష్టా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

 అటవీ భూమిని అక్రమంగా నరుకుతుంటే అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని వత్తిమక్కులకుంట దగ్గర దాదాపు 15 ఎకరాల అటవీ భూమిలో కొంత మంది గిరిజనులు చెట్లను నరికారు. అటవీ భూమి నరకుతుంటే అడ్డుకోబోయిన ఫారెస్ట్ అధికారి జయరాంను వెంటబడి దాడి చేశారని ఫారెస్ట్ అధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని దాడి చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ కార్యాలయానికి తరిలించారు.కొంతమంది పరారైనట్లు ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ తెలిపారు.

అటవీ భూములను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని, అక్రమంగా అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అధికారిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గిరిజన మహిళలు తమపై దాడి చేసారని ఆరోపించారు. అటవీ అధికారులపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధికారుల సంఘం అధ్యక్షులు రవి కుమార్, ముజీబ్ ఘోరి, తేజశ్రీ, రాంబాబు, వల్య, హన్మంతు డిమాండ్ చేశారు.

ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ

ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీని కీలక వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు రోజు హర్యానాలోని ఫరీదాబాద్‌లో పట్టుబడ్డ 8మందితో కూడిన ఉగ్రవాద నెట్‌వర్క్‌తో ఉమర్‌కు సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు విచారణ క్రమంలో బదర్‌పూర్ అనే టోల్‌ప్లాజా వద్ద ఉమర్ నబీ ఫీజు చెల్లించడాన్ని సిసిటివి ఫుటేజీ ద్వారా గుర్తించారు. కారు హర్యానాలో ఫరీదాబాద్ నుంచి సోమవారంనాడు తెల్లవారుజామునే ప్రయాణం మొదలు పెట్టినట్లు అంచనాకు వచ్చారు. తొలుత ఫరీదాబాద్‌లోని ఏషియన్ ఆస్పత్రి వెలుపల ఉదయం 7.30గ.లకు కారు కనిపించింది. బదర్‌పూర్ టోల్‌ప్లాజాను సుమారు 8.13గంటలకు, ఒక్లాహా పారిశ్రామిక వాడకు సమీపంలోని పెట్రోల్ పంప్‌ను 8.20గంటలకు దాటింది. ఢిల్లీహర్యానా సరిహద్దుల్లో ఈ ప్రాంతాలు ఉంటాయి. మధ్యాహ్నం 3.19గంటలకు ఎర్రకోట కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ ఏరియాలోకి కారు ప్రవేశించింది.

అక్కడ మూడు గంటల పాటు నిలిపివుంది. 6.22గంటలకు పార్కింగ్ ఏరియాను వీడిన కారు ఎర్రకోటకు సమీపించింది. అనంతరం 6.52గంటలకు పేలుడు సంభవించింది. పార్కింగ్ ఏరియాను వీడిన అర్ధగంట తర్వాత భారీ పేలుడును సృష్టించింది. ఇంకా ఢిల్లీ పొరుగు ప్రాంతాలు, ముఖ్యంగా ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చే రహదారులపై ఉన్న సిసిటివి ఫుటేజీలను తెప్పిస్తున్నామని, వాటన్నింటిని విశ్లేషించిన తర్వాత కారు ప్రతి కదలికను గుర్తించగలుతామని పోలీసులు వివరించారు. కాగా సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బదర్‌పూర్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించి ఉమర్ రిసిప్ట్ అందుకున్న దృశ్యాలు, ఆ సమయంలో నిందితుడు మాస్క్ ధరించి ఉన్నట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఇదే కారులో రెండు వారాల క్రితం ఉమర్ సహా ముగ్గురు కలిసి ప్రయాణించారని, ఒకచోట కారుకు పొల్యూషన్ చెకప్ కూడా చేయించినట్లు గుర్తించారు. ఆ మిగతా వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు ఉపయోగించిన కారు హర్యానా నెంబర్ ప్లేట్ కలిగి ఉంది. దాని యజమాని పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 

‘కాంత’లో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం:భాగ్యశ్రీ బోర్సే

హీరో దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా ’కాంత’ను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 14న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మీడియాతో మాట్లాడుతూ “-కాంత నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాది. దుల్కర్, రానాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. -నేను చేసిన కుమారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. -డైరెక్టర్ సెల్వ చాలా టాలెంటెడ్. కుమారి క్యారెక్టర్‌ని ఆయన రాసుకున్న విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. అందరి నటుల నుంచి చాలా మంచి నటనను రాబట్టుకున్నారు.

‘కాంత’లో కుమారి క్యారెక్టర్ చేయడం నా అదృష్టం. నేను చేసిన కాంత, ఆంధ్ర కింగ్ సినిమాలు వరుసగా వస్తుండడం ఎంతో హ్యాపీగా ఉంది. తప్పకుండా మంచి ఫలితం ఉంటుందని నమ్ముతున్నాను. -కాంతలో సినిమాలో సినిమా ఉంటుంది. ఆంధ్ర కింగ్ ఒక ఫ్యాన్ బయోపిక్. ఈ రెండు కూడా దేనికవే డిఫరెంట్ సినిమాలు. కాంతలో కుమారి క్యారెక్టర్‌కి ఆంధ్ర కింగ్ లో మహాలక్ష్మి క్యారెక్టర్‌కి అసలు పోలికే ఉండదు. దేనికవే ప్రత్యేకమైన సినిమాలు. రెండు సినిమాలు ప్రేక్షకులని అలరిస్తాయని నమ్ముతున్నాను. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీని మంచి నటి అంటారని ఆశిస్తున్నాను. -ఇక ప్రస్తుతం నాకు తెలుగు సినిమాలు, అలాగే హిందీ సినిమాలు ఉన్నాయి. నా ప్రాజెక్ట్‌ల గురించి మేకర్స్ ప్రకటిస్తారు”అని అన్నారు.

17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

అమ్మవారి బ్రహ్మోత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలి

పంచ్మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు

కంట్రోల్ కమాండ్ సెంటర్ నుండి పర్యవేక్షణ

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక

టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్

మన తెలంగాణ, నవంబర్ 11: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్హ్మ్రోత్స్వాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుచానూరు ఆస్థానమండంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి సీవీఎస్వో కే. వి. మురళీకృష్ణ లతో కలసి టిటిడి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో, టిటిడి జేఈవో సమీక్ష నిర్వహించారు. తిరుచానూరు ఆలయం పరిసరాలలోను, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సిద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సేవలు అందిస్తారన్నారు.

అదేవిధంగా, రోజువారి 10 వేల మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుండే అవకాశం ఉందన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపడుతారన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము వస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో భారత రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి ఈవో ఆహ్వానించారు.

పాక్‌లో భారీ పేలుడు..12 మంది మృతి

ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవాదులు, సిబ్బంది ఉన్నారు. కోర్టు కాంప్లెక్సు వద్ద పార్కింగ్ స్థలంలో ఓ కారులో ఈ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి అని కారులో అమర్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రద్దీ సమయంలో ఈ సంఘటన జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఇస్లామాబాద్ జిల్లాకోర్టు లోని న్యాయవాదులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల వరకు వినిపించిందంటే పేలుడు తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దగ్ధమైన కారు నుంచి మంటలు, పొగలు ఉవ్వెత్తున పైకి కమ్ముకోవడం వీడియోల్లో కనిపించింది. సమీపాన పార్కింగ్ చేసి ఉన్న అనేక వాహనాలు ఈ పేలుడుకు భారీగా దెబ్బతిన్నాయి. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ, ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. దక్షిణ వజీరిస్థాన్ లోని కాడెట్ కాలేజ్ వానా వద్ద తెహ్రీక్‌ఇతాలిబన్ పాకిస్థాన్ ( టిటిపి) దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేసిన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న తెహ్రీక్ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో టిటిపికి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పాక్ సైన్యం మట్టుపెట్టింది. 

బీహార్‌లో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయే హవా

బీహార్‌లో తుది విడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్ లో అత్యధిక స్థాయిలో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. కాగా, ఈనెల 14న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, బీహార్‌లో రెండో దశ పోలింగ్ పూర్తి కావడంతో ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించారు. ఇందులో ఎన్డీయే హవా చూపుతోంది. ఎన్డీయే కూటమే ప్రభుత్వంలోకి రాబోతున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగింది:మాగంటి సునీత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్లను భయపెట్టారని బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతూ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు జూబ్లీహిల్స్‌లో ఏం పని..? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో మంగళవారం మధ్యాహ్నం మాగంటి సునీత మీడియాతో మాట్లాడుతూ, ఉద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు ఓటర్ల భయపడవద్దని, తాను ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేయాలని బెదిరింపులకు దిగుతూ.. మాట వినకపోతే బూతులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అభ్యర్థి అని చూడకుండా బూతులు మాట్లాడతారా..?అని మండిపడ్డారు. ఓటర్లు విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలంతా జూబ్లీహిల్స్‌లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. సురేశ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద బిఆర్‌ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లను కూర్చోనివ్వలేదని, లేదని, పోలింగ్ బూతుల్లోని టేబుళ్లను బయట పడేశారని మండిపడ్డారు. బిర్యానీల్లో డబ్బులు పెట్టి ఓటర్లకు ఇచ్చారని, బిర్యానీ ప్యాకెట్లను చూసి కూడా పోలీసులు వదిలేశారని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగులకు వీల్‌చైరుల కూడా సరిపడేంతగా పెట్టలేదని తెలిపారు. రజియా అనే అమ్మాయి ఇంటికి వెళ్లి దాడులకు దిగారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీరాజ్యంగా మార్చారని, నవీన్ యాదవ్ మనుషులు వచ్చి తన సంగతి చెప్తానని తననే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త మాగంటి గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇంత దౌర్జన్యం ఎప్పుడూ చూడలేదని సునీత పేర్కొన్నారు. 13వ తేదీవరకు ఎన్ని కుట్రలు చేస్తారో చేయండి.. 14వ తేదీ తర్వాత తాను గెలిచాక అందరి సంగతి చెబుతానని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.

కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించిన సునీత

కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి సునీత కృష్ణానగర్ పోలింగ్ బూత్ వద్ద బైఠాయించారు. దొంగ ఓటర్లకు పోలీసులు సహకరించారని మండిపడ్డారు. తాము దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడి, తమ పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగి వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరించారని పేర్కొన్నారు.

హంగేరీ రచయితకు 2025 బుకర్ ప్రైజ్ అవార్డు

లండన్ : హంగేరీకి చెందిన బ్రిటిష్ రచయిత 51ఏళ్ల డేవిడ్ సలై తన ఫ్లెష్ అనే నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. సోమవారం రాత్రి బుకర్‌ప్రైజ్ వేడుకలో భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ డేవిడ్ రాసిన నవలకే అవార్డు దక్కింది. సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్‌కు ఎంపిక కావడం విశేషం. ఈమేరకు డేవిడ్ సలైకు సుమారు 50 వేల పౌండ్ల నగదు పారితోషికం అందజేశారు. గత ఏడాది విన్నర్ సమంతా హార్వే చేతుల మీదుగా ట్రోఫీని బహూకరించారు.