లక్షల ఎకరాలను ముంచిన మొంథా
మన తెలంగాణ/హైదరాబాద్ :మొంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటల వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొంథా తుఫాన్ కారణంగా రా ష్ట్రంలో 1,17,757 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయశాఖ నివేదికను సమర్పించిందన్నారు. తుఫాన్ ప్రభావంతో నష్టం వాటిల్లిన జిల్లాలలో పర్యటించిన వ్యవసాయశాఖ అధికారుల బృందం, దెబ్బతిన్న పంటల వివరాలను, సర్వే చేసి నివేదికను సి ద్ధం చేసినట్టు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అత్యధికంగా వరి 83,407 ఎకరాలలో, పత్తి 30,144,మొక్కజొన్న2,097 ఎకరాలలో న ష్టం జరిగిదని, నాగర్ కర్నూల్ జిల్లాల్లో న ష్టం జరిగినట్లు వ్యవసాయ నివేదికలో పేర్కొన్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 33 శా తంకి పైగా పంట నష్టం జరిగిన వివరాలు సేకరించామని, 27 జిల్లాల్లోని 1,22,142 మంది రైతులకు చెందిన 1,17,757 ఎకరా ల్లో నష్టం వాటిల్లిందని మంత్రి చెప్పారు. కేం ద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్‌డిఆర్‌ఎఫ్ కింద ఇసుక మేటలకు ఎకరానికి రూ 7,285, నీటిపారుదల కింద సాగైన పంటలకు ఎకరానికి
రూ.6,880, వర్షాధార పంటలకు ఎకరానికి రూ. 3,440,- తోటలకు ఎకరానికి రూ. 9,106- చొప్పున మొత్తం 70 కోట్ల నిధులు రాష్ట్రానికి నిధులు రావల్సి ఉందని మంత్రి చెప్పారు. గతంలో వరదలు సంభవించినప్పుడు కేంద్రం నుండి రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందలేదని, ఈ పంట నష్టం వివరాలు కేంద్రానికి పంపి ఎన్‌డిఆర్‌ఎఫ్‌లో కేంద్రాన్ని నిధులు అడుగుతామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మొంథా తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపించాలని కోరామన్నారు. త్వరలోనే పంటనష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల చొప్పున పరిహారం చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
జిల్లాల వారీగా పంట నష్టం వివరాలు
మొంథా తుఫాన్ దాటికి జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ పంటం నష్టం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్‌లో 23,508.6 ఎకరాల్లో పంట నష్టం కాగా, తరువాత వరుసగా వరంగల్‌లో 19,736.22, కరీంనగర్‌లో 11,473.32, హన్మకొండలో 11,310.10, జనగాంలో 8,457.04, మహబూబాబాద్‌లో 8, 318.07, సూర్యాపేటలో 7,476, సిద్దిపేటలో 5,277, నల్గొండలో 5,259.20, సంగారెడ్డిలో4,858.01, ఖమ్మంలో 3,901.34, వనపర్తిలో 1,884.01, మెదక్‌లో 1,634.19, జగిత్యాలలో 1,157.16, మంచిర్యాలలో 570.15, వికారాబాద్‌లో 523.35, జయశంకర్ భూపాలపల్లిలో 481.25, మహబూబ్‌నగర్‌లో463.36, యాదాద్రి భువనగిరిలో 421.04, రంగారెడ్డిలో 316.19, నిర్మల్‌లో 252.23, నిజామాబాద్‌లో 250.14, ఆదిలాబాద్‌లో 62.38, రాజన్న సిరిసిల్లలో 55.03, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 13.28, జోగులాంబ గద్వాల్‌లో 12.16, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 7.30 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, వ్యవసాయ శాఖ వెల్లడించింది.