Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

holiganbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

jojobet giriş

jojobet giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

jojobet

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

kocaeli escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

süratbet

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

bursa escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

betcio

vdcasino

restbet

grandpashabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

meritking

casibom güncel giriş

madridbet

kingroyal

artemisbet

asyabahis

గురువారం రాశి ఫలాలు (13-11-2025)

మేషం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృషభం

నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

మిధునం

వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటాబయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

కర్కాటకం

చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం

కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు పూర్తి కావు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. వృధా ఖర్చులు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కన్య

ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల

సమాజంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులు ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృశ్చికం

కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. వృత్తి, ఉద్యోగాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మందగిస్తాయి.

ధనస్సు

బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగ స్థానచలన సూచనలున్నాయి. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మకరం

చిన్న నాయుడు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

కుంభం

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు తప్పవు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.జ

మీనం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగమున మీ పనితీరుతో అధికారులను సైతం ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాల్లో అంచనాలు నిజం కాగలవు. పనులు చకచకా పూర్తి చేస్తారు..

 

23 ఏళ్ల రెబల్ స్టార్‘డమ్’

భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈశ్వర్ తర్వాత వరుసగా రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్‌నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబల్, మిర్చి వరకు ప్రభాస్ జర్నీ ఒక దశ అయితే బాహుబలితో ఆయన పాన్ ఇండియా జర్నీ మొదలైంది. బాహుబలి రెండు చిత్రాల తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నాడు. బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో ప్రభాస్ రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ చిత్రాలను ఖాతాలో వేసుకోవడం ఒక అరుదైన రికార్డు. ప్రభాస్ తొలి సినిమా ‘ఈశ్వర్’ 2022, నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ రోజును రెబల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు స్పెషల్ డేగా గుర్తుంచుకుంటారు. రెబల్ స్టార్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఆయన కొత్త సినిమా ‘రాజా సాబ్‘ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో సరికొత్త మేకోవర్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. ఈ పాన్ ఇండియా స్టార్ కెరీర్‌లో మరో ప్రతిష్టాత్మక మూవీగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్‘ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న సలార్ 2, సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ… ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లు. వీటితో పాటు వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న కల్కి 2 కూడా ప్రభాస్ లైనప్ లో ఉంది. ఈ పాన్ ఇండియా స్టార్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు సృష్టించబోతున్నాయి.

టీమిండియాలోకి మరో హైదరాబాద్ కుర్రాడు..

మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా అండర్19 ఏ టీమ్‌లో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ మాలిక్ చోటు సంపాదించాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. దీంతో అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఇండియా అండర్19 టీమ్‌లో చోటు కల్పించారు. టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రేరణతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని మాలిక్ వివరించాడు. కఠోర సాధన, అంకిత భావం వల్లే జాతీయ జట్టులో స్థానం సంపాదించే స్థితికి చేరారని వివరించాడు. బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌లో భారత్ అండర్19 టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టు తెలిపాడు.

టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం తన చిరకాల స్వప్నమని, దాని కోసం సర్వం ఒడ్డి పోరాడుతానని పేర్కొన్నాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన బౌలర్‌గా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తానని మాలిక్ ధీమా వ్యక్తం చేశాడు. తన కొడుకు జాతీయ జట్టులో స్థానం సంపాదించడంపై మాలిక్ తండ్రి మహ్మద్ అబ్దుల్ ఆనందం వ్యక్తం చేశారు. తాను కూడా క్రికెటర్ అని, అయితే జాతీయ జట్టులో స్థానం సంపాదించాలనే తన కల నెరవేరలేదన్నారు. అయితే తన కొడుకు మాలిక్ దాన్ని నెరవేర్చడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మాలిక్‌కు ఇండియా అండర్19 టీమ్‌లో చోటు దక్కడంతో సుభాన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

అదరగొట్టిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో…’

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న థియేటర్లలోకి వస్తుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, మొదటి మూడు ట్రాక్‌లు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. మేకర్స్ నాలుగవ సింగిల్ – ఫస్ట్ డే ఫస్ట్ షోను విడుదల చేశారు. ఈ సాంగ్‌ను అభిమానులు విమల్ థియేటర్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచ్ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఫ్యాన్స్ హీరో రామ్ కటౌట్ లాంచ్ చేశారు. సినిమా పట్ల అభిమానుల ఇష్టం, ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభూతిని ఈ పాట ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా చూపించడం జరిగింది. దినేష్ కాకర్ల రాసిన సాహిత్యం అభిమానుల ప్రేమ, ఆతృత, అంకితభావాన్ని ప్రతీ లైన్ లో ఉత్సవంలా చూపించింది. పాటలో నిజమైన అభిమానుల గొంతులు వినిపించడం మరింత నిజాయితీని, అసలైన ఉత్సాహాన్ని తెస్తుంది. రామ్ పోతినేని ఈ పాటలో ప్రతి అభిమాని సోల్ గా అదరగొట్టారు. తన అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు, ఎలక్ట్రిక్ ఎనర్జీతో స్క్రీన్ మొత్తాన్ని దద్దరిల్లేలా చేశాడు.

తగ్గనున్న కెనరా బ్యాంకు ఈఎంఐ భారం

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు శుభవార్త వెల్లడించింది. ఈఎంఐల భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసిఎల్‌ఆర్) తగ్గిస్తున్నట్లు బుధవారంనాడు ప్రకటించింది. వివిధ కాలపరిమితులపై వడ్డీ రేట్లో 5శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. కెనరాబ్యాంకు తాజా నిర్ణయంతో అందించే గృహ, వాహన, పర్సనల్ లోన్స్‌పై ఈఎంఐ భారం తగ్గనుంది. సవరించిన వడ్డీ రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. ఓవర్‌నైట్ ఎంసిఎల్‌ఆర్‌ను 7.95 శాతం నుంచి 7.90కి తగ్గించింది. మూడు నెలల ఎంసిఎల్‌ఆర్‌ను 8.15శాతానికి, ఆరు మాసాల ఎంసిఎల్‌ఆర్‌ను 8.50 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. 

ఎస్‌ఐఆర్ రెండో దశ..37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ

న్యూఢిల్లీ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) రెండో దశ ప్రక్రియలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకు 37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను అంటే 72.66 శాతం వరకు ఎన్నికల కమిషన్ పంపిణీ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 7.66 కోట్ల ఓటర్లు ఉండగా, 6.80 కోట్ల లేదా 88.8 శాతం వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని బుధవారం ప్రకటించింది.

ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు జరగనున్న ఈ ప్రక్రియలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, రాష్ట్రాల్లో 2026 లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41కోట్ల వరకు ఉండగా, 5 కోట్లవరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ అయ్యాయి. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ఎక్సర్‌సైజును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 

బిజేపి , ఈసి కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీ :రాహుల్

న్యూఢిల్లీ : బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యక్షంగా “ప్రజాస్వామ్య ఖూనీ” సాగుతోందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ ఖాతాలో ఆయన అనేక ఆరోపణలు చేశారు. ఒక వ్యక్తి హర్యానా, ఢిల్లీ, బీహార్ ఎన్నికల పోలింగ్‌ల్లో ఓటు వేశాడని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎక్స్ పోస్ట్‌లో షేర్ చేశారు. బీహార్ తుది దశ పోలింగ్ పూర్తయి, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్న తరుణంలో ఆయన ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాల్లో ఎన్‌డిఎ మెజారిటీ మార్కు 122 దాటి సులువుగా విజయం సాధిస్తుందని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బుధవారం చాణక్య కూడా బీజేపీ దాని మిత్రపక్షాలు 160 సీట్లు, ఆర్‌జేడీ దాని మిత్ర పక్షాలు 77సీట్లు సాధిస్తాయని అంచనా వేసింది. అదే విధంగా మేట్రిజ్ ఎగ్జిట్ పోల్ ఎన్‌డిఎ 147167. మహాఘఠ్‌బంధన్ 7090, జన్‌సురాజ్ 02 సీట్లు, సాధిస్తాయని వెల్లడించింది. దైనిక్ భాస్కర్ కూడా ఎన్‌డిఎ అదే స్థాయిలో 145160 సీట్లు, మహాఘఠ్ బంధన్ 7391 స్థానాలు సాధిస్తుందని వివరించింది.

కుప్పకూలిన టర్కీ సైనిక విమానం… 20 మంది మృతి

అంకారా : టర్కీకి చెందిన సీ130 సైనిక రవాణా విమానం 20 మందితో మంగళవారం అజర్‌బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై కూలిపోయింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులేర్ బుధవారం ఈ సంఘటన గురించి వెల్లడించారు. అజర్‌బైజాన్ సరిహద్దుకు సమీపంలో జార్జియాలోని సిగ్నాఘి మున్సిపాలిటీ ప్రాంతంలో కుప్పకూలింది. టర్కీ నుంచి దర్యాప్తు బృందం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్లింది. విమాన శిధిలాల కోసం గాలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సైనిక బలగాలను తరలించడానికి, లాజిస్టిక్ కార్యకలాపాల కోసం టర్కీ సీ130సైనిక కార్గో విమానాలనే తరచుగా వినియోగిస్తుంది. టర్కీ, అజర్‌బైజాన్ దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయి. బకులో నవంబరు 8న అజర్‌బైజాన్ విజయోత్సవాలు జరగ్గా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఇతర టర్కీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రమాదానికి గురైన కార్గో విమానంలోని మిలిటరీ అధికారులు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారో లేదో తెలియదు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఈహం ఎలియేవ్, జార్జియా విదేశాంగ మంత్రి మకాబోచ్‌రిష్‌విల్లి ఈ ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలియజేశారు.

చైనాలో కూలిన భారీ వంతెన

బీజింగ్ : చైనాలో నిర్మించిన భారీ వంతెన పాక్షికంగా కుప్పకూలింది. సిచూవాన్ ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఓ నదిపై నిర్మించిన ఈ వంతెనను జాతీయ రహదారుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ చైనా నుంచి టిబెట్‌కు దగ్గరి దారి ఏర్పడేందుకు దీనితో వీలేర్పడింది.

పగుళ్లు తలెత్తిన ఒక్కరోజులోనే ఇది కొంత భాగం వరకూ కూలిపోవడంతో కింద నదిలో టన్నుల కొద్ది కాంక్రీటు పడింది. ఈ ప్రాంతం అంతా గంటల తరబడి దుమ్మూధూళి నెలకొందని వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. గాయపడలేదు. ఇక్కడి ఎతైన కొండప్రాంతంలో తలెత్తిన భూగర్భ కుదుపులతోనే బ్రిడ్జి కూలిందని ప్రాధమిక దర్యాప్తు క్రమంలో వెల్లడైందని అధికారులు తెలిపారు. 

ఎర్రకోట పేలుడు దారుణ ఉన్మాద చర్య..

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు దారుణ ఉగ్రవాద చర్య అని కేంద్ర మంత్రి మండలి గర్హించింది. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన తరువాత బుధవారం ఇక్కడికి రాగానే మంత్రి మండలి సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో ముందుగా రెడ్‌ఫోర్టు వద్ద ఘటనపై సమీక్షించారు. ఇది ఉగ్రచర్య, గర్హనీయం అని కేబినెట్ పేర్కొంది. దర్యాప్తు సంస్థలు ఎటువంటి జాప్యం లేకుండా , అత్యంత ప్రాధాన్యతాక్రమంతో కేసు విచారణ చేపట్టాలి, సునిశిత వృత్తినైపుణ్యతతో కేసును ఛేదించాలి. మూలాలను కనుగొని, కుట్రదారులను, పాత్రధారులు, సూత్రధారులను వెలుగులోకి తీసుకుని రావాలని కేంద్ర మంత్రి మండలి ఆదేశించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పూర్తి స్థాయిలో అణచివేయడమే దేశ సంవిధానం .

ఇందులో రాజీ ప్రసక్తే లేదని తెలిపారు. ఎవరు ప్రోత్సాహకులు, ఎవరు కార్యాచరణకు దిగుతున్నారనేది వెలుగులోకి తీసుకుని రావడంలో ఏ స్థాయిలో ఎటువంటి జాప్యం వహించరాదని తేల్చిచెప్పారు. ముందుగా ఈ ఉగ్రవాద దాడిలో బలి అయిన వారి ఆత్మశాంతికి కేబినెట్ రెండు నిమిషాల పాటు మౌనం వహించింది. ఖండన తీర్మానం వెలువరించింది. పరిస్థితిని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడూ సమీక్షించుకుంటుందని కేబినెట్ తీర్మానంలో తెలిపారు. అత్యున్నత స్థాయిల్లో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలి. పూర్తి సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది.

నేరస్తులను. కుట్రదారులను పట్టి చట్టానికి అప్పగించాలని సూచించారు. ఉగ్రవాద చర్య ఉన్మాదచర్యనే , పిరికిపందలే ఈ విధంగా చేస్తారని తగు జవాబు ఇస్తామని హెచ్చరించారు. అధికార యంత్రాంగం, భద్రతా సంస్థలు సకాలంలో స్పందించాయని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయని, పౌరులు ధైర్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఈ ఘటనపై ఖండనలు, భారత్ పట్ల సంఘీభావం వ్యక్తం కావడం జరిగిందని మంత్రి తెలిపారు.