యుఎఇపై భారీ విజయం సాధించిన యువ భారత్
దుబాయ్: అండర్-19 ఆసియా కప్‌ను భారత్ ఘన విజయంతో ఆరంభించింది. యుఎఇతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 433 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో యువ కెరటం వైభవ్ సూర్యవంశీ (171, 9 ఫోర్లు, 14 సిక్సులు) విజృంభించగా.. ఆరోన్ జార్జి 69, విహాన్ మల్హోత్రా 69, వేదాంత్ త్రివేది 38, అభిజ్ఞాన్ కుందు 32 పరుగులతో రాణించారు.
భారీ లక్ష్య చేధనలో యుఎఇ ఆరంభం నుంచి తడబడుతూ వచ్చింది. 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో పృధ్వీ మధు(50), ఉద్దిష్ సురి(78) జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, భారీ లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. 50 ఓవర్లలో యుఎఇ 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 234 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.