elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişjojobet girişenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişcasibomcasibom girişcasibom güncel girişenbetenbet girişenbetenbet girişaresbetaresbet girişyakabetyakabet girişyakabetkulisbetkulisbet girişkulisbetteosbetteosbet girişteosbetaresbetaresbet girişwbahiswbahiskulisbetkulisbetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetmasterbettinggalabetrinabetkalebetyakabetprizmabetlordbahiskulisbetultrabetholiganbetholiganbetwinxbetwinxbet girişmislibetmislibet girişhepsibethepsibet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişhilbethilbet girişaresbetaresbet girişsohobetsohobet girişyakabetyakabet girişaresbetaresbet girişmisliwinmisliwin girişkulisbetkulisbet girişbetmarinobetmarino girişbetnanobetnanopadişahbetpadişahbet girişbetkolikbetnanokulisbetyakabetrinabetlordbahiskulisbettrendbetprizmabetprizmabettrendbetkulisbetlordbahisrinabetyakabetkulisbetbetnanobetkolik

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

jojobet giriş

primebahis

jojobet giriş

casibom

sekabet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

jojobet güncel giriş

Mavibet

Mavibet Giriş

holiganbet güncel

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

jojobet

aresbet

tlcasino

kingroyal

matbet

matbet giriş

bets10

cratosroyalbet

kingroyal

madridbet

cratosroyalbet

cratosroyalbet

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

https://www.apollotechnical.com/

meritking giriş

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

meritking

meritking giriş

madridbet

ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్ బుక్ ఇన్ ఇండియా

మన దేశ పౌరులపై సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాన్ని సోదాహరణంగా తెలుపు తూ ‘ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్‌బుక్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం 2019లో వచ్చింది. ఇం గ్లీషుతో పాటు ‘ఫేస్ బుక్ కా అసలీ చెహరా’ అని హిందీలో కూడా విడుదల చేశారు. రాబోయే రోజుల్లో సామాజిక మాధ్యమాల చేతుల లో మన దేశం పరాధీనురాలు, పౌరులు కీలు బొమ్మలు అని ఆరేళ్ల క్రితమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. పుస్తక రచయిత పరంజయ్ గుహ థాకర్తా, సహ రచయిత సిరిల్ శామ్. పరంజయ్ ఓ సీనియర్ జర్నలిస్టు. తన 35ఏళ్ల జర్నలిస్టు జీవితంలో దేశంలోని అన్ని ప్రధాన ఆంగ్ల పత్రికల్లో పనిచేశారు.

ఫేస్‌బుక్, వాట్సాప్‌ల వాడకం వల్ల సమాచారం వెంటనే అందే మాట నిజమే కానీ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను అది తప్పుడు, ద్వేషపూరిత సమాచార కర్మాగా రంలా మార్చివేస్తుందని ఈ పుస్తకం పేర్కొ నింది. కాలజ్ఞానంలా ఇందులో చెప్పినట్లే – ఎంతో చైతన్యవంతంగా కదిలే మనుషు లను కూచున్న చోటే గంటల తరబడి కట్టి వేసి ఏదో సాధిస్తున్నామనే భ్రమల్లో ఫేస్ బుక్ పడేసింది. కామెంట్లతో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్లు అనుకునే రోజులు వచ్చేశా యి. భావజాల తర్కానికి బదులు ద్వేషిం చుకొని, నోటికొచ్చిన బూతులు తిట్టుకునే స్థాయికి ఫేస్ బుక్ తెచ్చింది.

ఇలాంటి సామాజిక మాధ్యమాలు బూ టకపు, వివక్షాపూరిత, రెచ్చగొట్టే వార్తల ను ప్రచారం చేస్తూ, దేశ పౌరుల ఆలోచన సరళిని మార్చివేస్తున్నాయని, పాలకుల పంచన చేరి వ్యాపార విస్తరణ దిశగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నాయని, ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించా రు. దేశంలోని బొగ్గుగని కార్మికులపై ‘కోల్ కర్స్’ అనే డాక్యుమెంటరీ పరంజ య్ నిర్మించారు. దేశంలోని పెట్రోలియం ఉత్ప త్తుల ధరల్లోని అక్రమాలు ఎత్తిచూపుతూ ‘గ్యాస్ వార్స్’ అనే పుస్తకం రాశారు. 2008లో జరిగిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తొలి వ్యాసం రాసింది ఇతనే. ఇలా సుదీర్ఘ, సాహసో పేత పాత్రి కేయ చరిత్ర గల పరంజయ్ కలం నుండి దేశంలో ఫేస్ బుక్ లీలల గురించి వెలువడిన ఈ పుస్త కం సంచలనం సృష్టించింది. లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయి పాఠకుల మన్ననలు పొందుతోంది.

దేశంలోని వివిధ సంస్థల్లో ఫేస్‌బుక్ పెట్టిన పెట్టుబడుల వివరాలు, జియోకు కోరినంత ఆర్థిక బలాన్ని ఇ చ్చిన ఫేస్‌బుక్ ఉదారతపై అధ్యా యాలుగా ఈ పుస్తకంలో వివరించా రు. తొలి అధ్యాయాల్లో మన దేశం లో ఫేస్‌బుక్ ప్రజలకు ఎలా దగ్గరైం ది, క్రమంగా దేశ పాలకుల అవసరా లు తీర్చుతూ ఎలా ముందుకొచ్చింది అనే వివరాలు ఉన్నాయి. తనకు న చ్చని మీడియా సంస్థలను, జర్నలిస్టు లను, పాలకపక్షాన్ని విమర్శించేవారిని సెన్సార్ పేరిట ఫేస్ బుక్ పక్కన పెట్టిన తీరు వివరిం చారు. ఫేస్‌బుక్‌పై ప్రముఖ పత్రికలు వ్యక్తపరచిన అభి ప్రాయాలను కూడా ఇందులో పొందుపరిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలకు కట్టడి చేసేలా ఫేస్‌బుక్ నియమాలను మార్చు కుందని కారవాన్ పత్రిక పేర్కొంది. ఫేస్‌బుక్‌కు దే శ శాసనాలపై, చట్టాలపై గౌరవం లేదని, అది లైసెన్స్ లేని తుపాకీ అని ‘ది గార్డియన్’ రాసింది.

మయన్మార్‌లో రోహ్యింగాల పట్ల ద్వేషం పెంచి వేలాది మంది మరణాలకు, వలసలకు ఫేస్‌బు క్ కారణమైందని ఐక్యరాజ్య సమితికి అందిన ఓ రిపోర్ట్‌లో ఉంది. హిందూస్తాన్ టైమ్స్ జర్నలిస్టు చార్లెస్ అస్సేసీ ‘నేనెందుకు ఎఫ్‌బిని హేట్ చేస్తాను’ అనే వ్యాసంలో ‘ముందు అది మను షుల్ని మూగవారిని చేస్తుందని, ఆ తర్వాత వారి జీవితాల్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంటుంది’ అని రాశారు. అందుకే అనవసరంగా వేలు ఆడించకూడదు. ప్రతి స్పందన ఫేస్‌బుక్‌కు కొంత ఆదాయాన్ని, కొత్త సమాచారాన్ని అంది స్తుంది అని ఈ పుస్తకం ముందు జాగ్రత్తలు బోధిస్తోంది.

– బద్రి నర్సన్

డేవిడ్ స్జాలైకు ప్రతిష్టాత్మక పురస్కారం.. సమకాలీన జీవన తాత్వికతకు దర్పణం ’ఫ్లెష్’ నవల

సాహితీ జగత్తులో ప్రతిధ్వనించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్, ఈ ఏడాది హంగేరియన్ -బ్రిటీష్ రచయిత డేవిడ్ స్జాలై రాసిన ‘ఫ్లెష్’ నవలకు దక్కింది. ఈ విజయం ఆధునిక కల్పనా సాహిత్య తాత్విక అన్వేషణ సరిహద్దులను మరింత విస్తృతం చేసింది. నిశితమైన జీవిత పరిశీలన, సున్నితమైన భావోద్వేగ చిత్రణలతో ఆధునిక సాహితీప్రియులను ఆకట్టుకుంటున్న స్జాలైకి ఈ పురస్కారం లభించడం, ఆయన రచనా ప్రయాణం లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ విజయం ద్వారా ఈ బహుమతి గెలుచుకున్న తొలి హంగేరియన్-, బ్రిటీష్ రచయితగా ఆయన చరిత్ర లో నిలిచారు.

డేవిడ్ స్జాలై సమకాలీన సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న రచయిత. 1974లో కెనడా లో జన్మించినప్పటికీ, లండన్‌లో పెరిగి, ప్రస్తుతం వియన్నాలో నివసిస్తున్నారు. వివిధ సంస్కృతుల మధ్య పెరిగిన అనుభవం, వలస జీవితంపై ఆయనకు లోతైన అవగాహన కల్పించింది. ఆ అనుభ వం ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 2016లో ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ నవలకు సైతం బుకర్ ప్రైయిజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన స్జాలై, ఆరు నవలలు, పలు రేడియో నాటకాలు రచించారు. డేవిడ్ స్జలే-అస్తిత్వపు అన్వేషకుడు : ప్రపంచ సాహిత్య వేదికపై నిర్లిప్తత, వాస్తవికత అనే రెండు ధ్రువాల మధ్య నిలబడి ఆధునిక మానవుని అంతరంగ మథనాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన ఈ నవల కేవలం ఒక కథా సంపుటి మాత్రమే కా దు. ఇది సమకాలీన ప్రపంచంలో అస్తిత్వ శూన్యత ను, వలసల వల్ల కలిగే మానసిక విచ్ఛేదనాన్ని, పురుషత్వ నిగూఢ అర్థాలను లోతుగా విశ్లేషించే ఒక సాహిత్య దర్పణం. స్జాలై రచన అనంతమైన శూన్యంలో ఉనికి కోసం పోరాడుతున్న ప్రతి జీవి నిశ్శబ్ద రోదనను ప్రతిబింబిస్తుంది.

కథన శిల్పం-వచన వైవిధ్యం: స్జాలై రచనా శైలి అసాధారణమైన పొదుపుదనంతో కూడుకున్నది, దీనిని విమర్శకులు ‘శైలీపరంగా అస్థిపంజరం వంటిది’గా అభివర్ణించారు. ఈ పొ దుపుదనం కేవలం శైలిపరమైన ఎంపిక మాత్రమే కాదు, ఇది ఒక తాత్విక వైఖరి. ఆయన గద్యం, అలంకారాలు, విస్తృత వర్ణనల బరువు లేకుండా కేవలం మౌలికమైన సత్యాన్ని మాత్రమే ఆవిష్కరి స్తుంది. ఇది ఒక స్పటికపు అద్దం వలే మౌలికమైన మానవ సత్యాన్ని యథాతథంగా పట్టి చూపిస్తుంది. ఈ సాంద్రమైన భాషా సంవిధానం పాఠకుడికి మ రింత లోతైన భావనా ప్రపంచంలోకి ప్రవేశించే అ వకాశాన్ని కల్పిస్తుంది. దీనికి కారణం ఏమంటే కథలోని కీలకమైన సంఘటనలను, ముఖ్యంగా ఇస్త్వాన్ జీవితంలోని చీకటి కోణాలైన జైలు జీవి తం, యుద్ధ సేవలను రచయిత వివరంగా చెప్ప కుండా ఉద్దేశపూర్వకంగా మౌనాన్ని పాటించడం ద్వారా ఆ ఖాళీలను పూరించాల్సిన భావనాత్మక భారాన్ని పాఠకుడికే బదిలీ చేస్తారు. తద్వారా ఆ హింస నిజమైన భారాన్ని పాఠకులు తమ అంత రంగంలో అనుభూతి చెందేలా ప్రేరేపిస్తుంది. ఈ కథన శిల్పం ద్వారా జీవితంలోని కొన్ని గాయాలు పైకి కనిపించకుండానే మనలో ఎంతగా లీనమైపో యి, మన అస్తిత్వాన్ని ఎలా శాసిస్తాయో రచయిత నిరూపించారు. నవలలోని ఈ నిర్లిప్త కథనం, ఇస్త్వాన్ పాత్ర భావోద్వేగ తిమ్మిరిని పాఠకులకు తెలియజేయడంలో అద్భుతంగా విజయం సాధిం చింది. ఇది స్జాలై ప్రయోగాత్మక కథన శిల్పానికి నిదర్శనం.

నవల అంతరార్థం: ‘ఫ్లెష్’: మానవ బలహీనతల సూక్ష్మచిత్రణ ‘ఫ్లెష్’ కేవలం ఇస్త్వాన్ వ్యక్తిగత కథ మాత్రమే కాదు. కథానాయకుడు ఇస్త్వాన్ జీవిత ప్రయాణం హంగేరీలోని పేదరికం నుండి లండన్‌లో ని సంపన్న వర్గాల సేవకునిగా మారడం, ఈ వ్యవస్థలో ఒక మనిషి కేవలం శారీరక శ్రమకు పరిమితమైన ఒక సాధనంగా ఎలా మారుతాడో విశ్లేషిస్తుంది. అంతే కాకుండా, లండన్‌లోని సంపన్నుల ఇళ్లలో పనిచేస్తూ, వారికి అదృశ్య సేవకుడిగా మారతాడు. ఇస్త్వాన్ తన దేశంలో గౌరవం లేని శ్రమను, విదేశంలో గుర్తింపు లేని శ్రమగా మార్చుకుంటాడు. ఇక్కడ ఇస్త్వాన్ శరీరం కేవలం శ్రమ యంత్రంగా పరిగణించబడుతుంది. అతని వ్యక్తిత్వం, ఆకాంక్షలు పూర్తిగా విస్మరించబడతాయి. ఈ నవల, ఆధునిక కాపిటలిజంలో మాన వ దేహం ఎలా ఒక వ్యాపార వస్తువుగా మారుతుందో లోతుగా తెలియజేస్తుంది.

ఇస్త్వాన్ పాత్రలో స్జాలై ఒక అస్తిత్వ వాద సంక్షోభాన్ని ఆవిష్కరించారు. అతను ఏ సమాజా నికీ పూర్తిగా చెందడు. హంగేరీలో లేడు, లండన్‌లో విలీనం కాలేదు. ఈ మధ్యస్థ స్థితి అతనిలో ఒక శాశ్వతమైన ఏకాంతాన్ని సృష్టిస్తుంది. నవలలోని ఏకాంత దృశ్యాలు ఇస్త్వాన్ ఒంటరిగా తిరుగుతూ, తన గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును విశ్లేషిం చుకోవడం పాఠకులను కూడా తమ వ్యక్తిగత శూన్యంలోకి ప్రయాణించేలా చేస్తాయి. స్జాలై పురుషత్వం అనే భావనను ప్రశ్నిస్తూ, అది పురుషుడికి బలం ఇవ్వడానికి బదులుగా ఎలా ఒక భారంగా మారుతుందో చూపించారు.ఇస్త్వాన్ హింసాత్మక చర్యలు, భావోద్వేగాలను అణచివేయ డం అనేవి సమాజం అతనికి నేర్పిన విషపూరిత పౌరుషానికి ప్రతిబింబాలు. తన బలహీనతను దా చడానికి అతను శక్తిని ఉపయోగించాలనుకుంటా డు, కానీ అది మరింత బాధను మాత్రమే మిగు లుస్తుంది.

వర్తమాన సమాజానికి అద్దం : బుకర్ న్యాయ నిర్ణేతల బృందం ఈ నవలలోని మా నసిక వాస్తవికత, కథన శిల్పంలోని సాంద్రతను అసాధారణంగా ప్రశంసించారు. వారు ఈ నవల ను ‘గాయపడిన ప్రపంచ గ్రంథం’గా అభివర్ణించ డం ద్వారా దాని తాత్వికతను గుర్తించారు. ‘ఫ్లెష్’ మరచిపోయే రచన కాదు. ఇది పాఠకుడిలో లోతైన ప్రశ్నలను రేకెత్తించి, జీవించడంలో ఉన్న నిశ్శబ్ద బాధను, అరుదైన సౌందర్యాన్ని ఏకకాలంలో అను భూతి చెందేలా చేస్తుందని వారు ప్రకటించారు.

సాహిత్యం-సత్యానికి, సంక్లిష్టతకు వారధి: ‘ఫ్లెష్’ బుకర్ ప్రైజ్ గెలుచుకోవడం ద్వారా సాహి త్య కర్తవ్యం కేవలం సౌందర్యారాధన కాదని, నిర్భ యంగా సత్యాన్ని ఆవిష్కరించడం, నిశ్శబ్దంగా ఉన్న గొంతులకు స్థానం కల్పించడం అని డేవిడ్ స్జాలై మరోసారి నిరూపించారు. ఈ నవల సమకా లీన సాహిత్యంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుంది.

– విర్గో

హైదరాబాద్ బుక్ ఫెయిర్-38వ పుస్తక ప్రదర్శన

పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణ: 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 డిసెంబర్ 19 నుండి మొదలై 29 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్.టి.ఆర్. స్టేడియం) లో జరుగబోతోంది. ఈ మొత్తం రోజుల్లో పన్నెం డు నుండి పదిహేను లక్షలమంది పుస్తకాభిమానులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భం గా పుస్తకాల స్టాల్స్‌లో వందల, వేల పుస్తకాలు కొలువుదీరనున్నాయి. ఆ పదిరోజులు పుస్తకాల పండుగే. ప్రతిరోజూ ఒంటి గంటకు ప్రారంభమయ్యే బుక్ ఫెయిర్‌లో 2 గంటల నుండి 5 గం టల వరకు తెలంగాణ బాలోత్సవం నిర్వహణ లో పిల్లల కార్యక్రమాలు, ఐదింటి నుండి ఆరిం టి వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తరవాత ‘పుస్తక స్ఫూర్తి’ కార్యక్రమం మూడు సెషన్లుగా సాగుతాయి. ఇందులో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకంపై చర్చలు, ప్రసంగాలు, కవి సమ్మేళనాలు ఉంటాయి. ఈ మూడు సెషన్లలో రెండు వందల వరకు సాహిత్యకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కూడా పుస్తక ప్రాధాన్యతను తెలుపుతూ ‘బుక్‌వాక్’ ఒకరోజు పుస్తక ప్రేమికులతో కలిపి జరుగుతుంది. ఇంకోవైపు రెండవ వేదికపై కొత్త పుస్తకాలు, వాటి ఆవిష్కరణలు.. అదొక సందడి. 1985లో 38సంవత్సరాల క్రితం ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రతి ఏటా బుక్ ఫెయిర్‌లు నిర్వహిస్తోంది. గత సంవత్సరంలో లాగే 350 స్టాల్స్‌కు పైగా ఈ బుక్ ఫెయిర్‌లో ఉంటాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలనుంచి కూడా పబ్లిషర్స్ వస్తున్నారు.

పుస్తకమంటే జ్ఞానం. సర్వజన నేస్తం. అధ్యయనం పట్ల నేటి యువత ఆసక్తి చూపుతున్నది. సమాజ మార్పులో పుస్తకం పాత్ర కీలకం. ఇంటర్నెట్ యుగంలో పుస్తకం ప్రాధాన్యత తగ్గుతున్నదనేది ఒట్టిమాటే. ఉన్నత చదువుల్లో బిజీగా ఉండి కూడా యువత రచనలు చేయడం మంచి పరిణామం. ఆహ్వానించదగినది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పుస్తక ప్రదర్శనలకు ఆదరణ పెరుగుతున్నది. ఆ దిశలోనే హైదరాబాద్ బుక్ ఫెయిర్ చెప్పుకోదగ్గ పుస్తక ప్రదర్శనగా ఎదిగింది. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది పుస్తక ప్రియులను ఒక్కచోటకి చేర్చి జాతరను తలపిస్తున్నది. సమాజాన్ని మేల్కొలిపే అక్షర సమూహంగా బుక్ ఫెయిర్ మారింది. డిసెంబరు 19 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో గల అందెశ్రీ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జరుగనున్నది.

జీవితంలో ఎవరైనా కోరుకునేది సుహృద్భావ వాతావరణంలో బతకాలన్నదే. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టుకతో రావచ్చు గాక, వారందరినీ కలిపి ఉంచేది మానవీయతనే. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన చెడకుండా కొనసాగాలంటే దానికి అనుగుణమైన రచనలను సమాజంలోకి వెదజల్లాల్సిన అవసరముంది. అంతిమంగా మనుషులను విభజించని సాహిత్యం రావాల్సిన అత్యావశ్యకత ఉంది. దానికై ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సిన బాధ్యత యువ రచయితలపై ఉందని మేము భావిస్తున్నాము. మానవజాతిని కదిలించే శక్తి పుస్తకానికి ఉంది. అ ధ్యయనం చేయకపోతే ఎదుటివారు చెప్పేదే నిజమనే భావనలోకి కూరుకుపోతాం. డాక్టర్లుగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మరే ఉన్నత ఉద్యోగం లో రాణించాలన్నా సామాజిక స్పృ హ తప్పనిసరి. పుస్తకజ్ఞానం ఉన్నవారే జీవితంలో రాణిస్తారు. ఉన్నతస్థాయిలో ఉన్నవారినెవరిని పరిశీలించినా అది మనకు కనిపిస్తున్నది. మంచి సమాజం కావాలంటే పుస్తకాలు చదవాలి.

బాలసాహిత్యం కొనుగోలు పెరగటం మంచి పరిణామం. చిన్నపిల్లల తో విరివి గా కథల పుస్తకాలు చదివించాలి. ఇది పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఏఐ టెక్నాలజీ, సోషల్‌మీడియా ఇంకేం వచ్చినా, పుస్తకాలకు శాశ్వత విలువ ఉంటుంది. పుస్తకం చదివితే వచ్చే మానసికానందం వెలకట్టలేనిది. ప్రభుత్వ తోడ్పా టు మరింత పెరగాలి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిది. కొన్నేండ్లుగా బుక్ ఫెయిర్ నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియాన్ని ఉచితంగానే ఇస్తున్నది. దీనిలో పుస్తకాల ప్రదర్శనలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రచారానికి కొన్ని స్టాళ్ళను కేటాయిస్తున్నాం. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు సొంత భవనమంటూ లేదు. సాహిత్య కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు జరుపుకునేందుకు ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండాలి. సాహితీ ప్రముఖులు, పుస్తకాల పబ్లిషర్స్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఉండటానికి కొన్ని రూములతో కూడిన భవనం ఉండాలి. అలాచేస్తే హైదరాబాద్ బుక్ ఫెయిర్ విశిష్టత, కదలిక, పనివిధానం పెరుగుతుంది. మరింత మెరుగవుతుంది. ఆ వైపుగా ప్రభుత్వం సహకరించాలి.

పాఠశాలలు, కళాశాలల్లో సామాజిక, సాహిత్య శాస్త్రాల అధ్యయనం పెరగాలి. పాఠశాలలు, కళాశాలల్లో సామాజిక, సాహి త్య, శాస్త్రాలు చదువుకునే అవకాశాలను పెంచాలి. ఆవైపు పిల్లలను తీర్చిదిద్దాలి. నిజమైన చరిత్రలు నమోదు కావాల్సిన అవసరముంది. మరుగునపడిన పుస్తకాల ప్రస్తావన తెరపైకి తేవాలి. బుక్ ఫెయిర్‌లో నచ్చిన పుస్తకం, ప్రభావితం చేసిన పుస్తకం అనే థీమ్‌తో ప్రముఖ రచయితలు, కవులతో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చావేదిక నడుస్తోంది. మరుగునపడిన అనేక పుస్తకాల ప్రస్తావన మళ్లీ తెరమీదికి వస్తోంది. కొత్తతరంలో ఆసక్తిని రేకెత్తించి, వాటిని చదవడానికి పురిగొల్పే వాతావరణాన్ని తీసుకురావ డం దీని ముఖ్య ఉద్దేశం.

చదువు జ్ఞానానికి సింబల్. ప్రస్తుతం చదువుకోవడం జ్ఞానానికి సింబల్ అనే భావన నుంచి ఉద్యోగం కోసం చదువు అనే పరిస్థితి ఉంది. విద్యాలయాల్లో చదువుల నిర్వచనం మారి మార్కులతో విద్యను కొలిచే పద్ధతి వచ్చింది. దీంతో జనరల్ బుక్స్ చదవడం మానేసి ఆ సబ్జెక్ట్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఉద్యోగాల సాధనకు పనికొచ్చే చదువే ముందుకొస్తున్నది. అందుకే సాహిత్య, సామాజిక, శాస్త్రాలను చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్న ది. ఇది నాణానికి ఓవైపు మాత్రమే. మరోవైపు పరికించి చూస్తే రాయడం, చదవడం, అచ్చువేయడం వైపు యువత ఎక్కువ దృష్టి సాధించడం శుభపరిణామం. కొందరు ఇండ్లనే గ్రంథాలయాలుగా మార్చుతున్నారు. గ్రామాల్లో వాటిని నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం.

రాబోయే కాలంలో సాంస్కృతిక రంగాల్లో ఒక పునర్జీవనం, కొత్త చైతన్యం రాబోతున్నది. యువతను అధ్యయనం, రాయడం వైపు మళ్లించే బాధ్యత సామాజిక సంఘాలపైనా, ప్రభుత్వాలపైనా ఉంది. బుక్ ఫెయిర్‌ల లక్ష్యం పుస్తకాలు అమ్మడం, కొనడం అనే ప్రక్రియ మాత్రమే కాదు. పుస్తకాలను ప్రజల దగ్గరకు విస్తృతంగా చేర్చడం, మెరుగైన సమాజం దిశగా అడుగులు వేసేలా పౌరుల ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఉండాలి. ఈ పది రోజుల్లో కూడా పుస్తకాల మీద చర్చలు, సాహి త్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, స్కూల్, కాలేజీ పిల్లలు బుక్ ఫెయిర్‌ను సందర్శించేలా చేయడం ద్వారా పుస్తకాలు చదివే సంస్కృతి వైపు వారిని నడిపించే బాధ్యతను బుక్ ఫెయిర్ తలకెత్తుకున్నది.

ఇంతితై.. వటుడింతైనట్టుగా చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీలో నాలుగైదు పబ్లిషింగ్ సంస్థలు, సెల్లర్స్‌తో ప్రారంభమైన హైదరాబాద్ బుక్ ఫెయిర్ గణనీయమైన స్థాయికి నేడు చేరుకున్నది. మనదేశంలో కలకత్తా, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, జైపూర్ లాంటి బుక్ ఫెయిర్లతో పాటు జాతీయ స్థాయికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎదుగుతుందనే ఆశ ఉన్నది.

-కవి యాకూబ్, (అధ్యక్షుడు) మలుపు బాల్రెడ్డి, (ఉపాధ్యక్షుడు) ఆర్.శ్రీనివాస్ (వాసు) కార్యదర్శి

మహిళతో కొలికపూడి వీడియోలు… సోషల్ మీడియాలో వైరల్

అమరావతి: ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపి కేశినేని చిన్ని మధ్య టిడిపిలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. వరుస పోస్టులతో ఎంపి వర్గానికి ఎమ్మెల్యే కొలికపూడి నిద్రలేకుండా చేస్తున్నారు. ఇటీవల కొలికపూడి ఓ మహిళతో ఉన్న ఫోటోను చిన్ని వర్గీయులు విడుదల చేశారు. టిడిపి సోషల్ మీడియా గ్రూపుల్లో కొలికపూడి ఫోటో చక్కర్లు కొట్టింది.  కౌంటర్ గా ఇద్దరు నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోస్టు చేశారు.  తిరువూరుకు చెందిన బుడ్డయ్య, చెరుకూరి రాజేశ్వరరావులు మహిళలతో ఉన్న ఫోటోలను కొలికపూడి విడుదల చేయడంతో వైరల్ గా మారాయి. రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా? అంటూ పోస్టులు పెట్టారు. కొలికపూడిపై ఎంపి చిన్ని వర్గం రగిలిపోతుంది.  ఎఐతో తయారు చేసి ఫోటోలు విడుదల చేశారంటూ ఎంపి కేశినేని చిన్నిపై కొలికపూడి వర్గం మండిపడుతుంది. 

టిడిపిలో ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో సంచలన పోస్టులు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎంపి చిన్ని వర్గీయులకు కొలికపూడి వరసగా షాక్ లు ఇస్తున్నారు.  విస్సన్నపేట మండల టిడిపి నేతల దోపిడీని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్ కా ?’ అంటూ విమర్శలు గుప్పించారు. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే  కేశినేని నిజంగా రాయల్ అని దుయ్యబట్టారు. కొలికపూడి వరుస పోస్టులు తిరువూరులో హాట్ టాపిక్ గా మారాయి. 

ఫస్ట్ ఫేస్ ఫలితాలే రిపీట్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. మొదటి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని జోష్ మీదున్న ఆ పార్టీ, రెండో విడతలోనూ విజయపరంపర కొనసాగించింది. 193 మండలాల్లో 3,911 గ్రామ పంచాయతీ సర్పంచి స్థానాలకు, 29,913 వార్డు స్థానాలకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. రాత్రి 11 గంటల వరకు ప్రకటించిన 3,867 సర్పంచి స్థానాలకు, 29,831 వార్డు స్థానాలకు రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,217 సర్పంచి స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 1,180, బిజెపి మద్దతుదారులు 262 స్థానాల్లో గెలుపొందారు. 618 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. రెండో విడతలో మొత్తం 4,331 సర్పంచి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో 415 స్థానాలు ఏకగ్రీవం కాగా, 5 స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దాంతో 3,911 సర్పంచి స్థానాలకు, 29,913 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలలో మొత్తం 12,832 మంది సర్పంచ్ అభ్యర్థులు, 71,070 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు బరిలో నిలిచారు.

లాటరీలో వరించిన విజయం

మెదక్ మండలం చీపురుదుబ్బతండా గ్రామ సర్పంచి ఎన్నిక ఫలితం డ్రాలో తేలింది. చీపురుదుబ్బతండా పంచాయతీకి మోటు కాడి తండా, నైలి తండా అనుబంధంగా ఉన్నాయి. మొత్తం 3 తండాల్లో కలిపి 377 ఓట్లు ఉండగా, 367 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్ పార్టీ మద్దుతులో పోటీ చేసిన కేతావత్ సునీతకు 182, బిఆర్‌ఎస్ మద్దతులో పోటీ చేసిన బీమిలికి 182 ఓట్లు లభించాయి. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో రిటర్నింగ్ అధికారి వెంకటయ్య డ్రా తీశారు. లాటరీలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతను అదృష్టం వరించింది. దీంతో ఆమె సర్పంచిగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

ఒక్క ఓటుతో విజయం

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచిగా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ పంచాయతీలో శ్రీవేద, స్వాతి ఇరువురు పోటీ పడగా 426 ఓట్లకు 378 ఓట్లు పోలయ్యాయి. ఇందులో శ్రీవేదకు 189, హర్షస్వాతికి 188 ఓట్లు రాగా ఒక్క ఓటు చెల్లలేదు. దీంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

వార్డు సభ్యురాలే సర్పంచిగా గెలుపు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఉప్పుమడుగు సర్పంచిగా కొత్తకొండ రోజా 140 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గ్రామంలో ఆరో వార్డుకు నామినేషన్లు రాకపోవడంతో రోజా ఒక్కరే దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అటు వార్డు సభ్యురాలిగా, ఇటు సర్పంచి ఎన్నికై రోజా డబుల్ ధమామా సాధించారు. వార్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయనున్నారు.

సర్పంచిగా గెలిచిన మాజీ వార్డు సభ్యుడు

యాదాద్రి భువనగిరి జిల్లా కొండమగుడు గ్రామానికి ఇదివరకు వార్డు సభ్యులుగా సేవలందించిన కడెం పాండును ఈ ఎన్నికల్లో బిజెపి పార్టీ సర్పంచిగా బలపరచింది. 32 ఏళ్ల వయసు గల పాండు సర్పంచిగా గెలుపొందడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవతున్నాయి. కాగా, కొండమడుగు గ్రామంలో 12 వార్డులకు 6 వార్డులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలువగా, 5 వార్డులు బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఒక్క వార్డు కూడా గెలువకుండా కడెం పాండు సర్పంచిగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓటేసిన పలువురు ప్రజాప్రతినిధులు చేగుంట మండలం రుక్మాపూర్‌లో ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తి సింగపూర్ నుంచి వచ్చి ఓటేశారు. సిద్దిపేట జిల్లా పోతారంలో దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బొప్పాపూర్‌లో మెదక్ ఎంపి మాధవనేని రఘునందన్‌రావు దంపతులు ఓటు వేశారు. భూంపల్లిలో రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట సిపి విజయ్ కుమార్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

85.86 శాతం పోలింగ్

రెండో విడత పల్లెపోరు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తమ గ్రామ పరిపాలకులను ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఓటేశారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 85.86 శాతం పోలింగ్ నమోదైంది. అందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో 76.71 శాతం, జగిత్యాలలో 78.34 శాతం, భదాద్రి కొత్తగూడెంలో 82.65 శాతం నమోదైంది. అలాగే నిర్మల్‌లో 82.67 శాతం, వికారాబాద్‌లో 82.72 శాతం, ములుగులో 82.93 శాతం, నాగర్‌కర్నూల్‌లో 83.98 శాతం, పెద్దపలిలో 84.15 శాతం, నారాయణపేటలో 84.33 శాతం, రాజన్న సిరిసిల్లలో 84.41 శాతం, మంచిర్యాలలో 84.59 శాతం, మహబూబాబాద్‌లో 85.05 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 85.25 శాతం, రంగారెడ్డిలో 85.30 శాతం, కామారెడ్డిలో 86.08 శాతం, కరీంనగర్‌లో 86.58 శాతం, మహబూబ్‌నగర్‌లో 86.62 శాతం, కొమురం భీం అసిఫాబాద్‌లో 86.63 శాతం, అదిలాబాద్‌లో 86.68 శాతం, సంగారెడ్డిలో 86.96 శాతం, వనపర్తిలో 87.05 శాతం, జోగులాండ గద్వాల్‌లో 87.08 శాతం, హన్మకొండలో 87.34 శాతం, వరంగల్‌లో 88.11 శాతం, సిద్దిపేటలో 88.36 శాతం, జనగాంలో 88.82 శాతం, నల్గొండలో 88.52 శాతం, మెదక్‌లో 88.74 శాతం, సూర్యాపేటలో 88.80 శాతం, ఖమ్మంలో 91.21 శాతం పోలింగ్ నమోదైంది.

రాజ్యాంగం రద్దుకు కమలం కుట్రలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఓట్ చోరీ తర్వాత ఆధార్, జమీన్, రేషన్ కార్డులనూ రద్దు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఓట్ చోరీ గద్దీ చోడ్ పేరిట ఢిల్లీలోని రాం లీలా మైదానంలో ఏఐసిసి ఆదివారం నిర్వహించిన మహా ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఈ మహా ధర్నాలో ఏఐసిసి చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు ఏఐసిసి నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, వివిధ రాష్ట్రాల ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ నాడు మహాత్మా గాంధీ, అంబేద్కర్ తదితరులు రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందని చర్చిస్తున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వర్కర్ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, పేదలకు ఓటు హక్కు కల్పించరాదని అన్నారని చెప్పారు. అయితే గాంధీ, అంబేద్కర్ అదేమీ పట్టించుకోకుండా అందరికీ 

ఓటు హక్కు కల్పించినందుకే ఇప్పుడు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, పేదలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఆయన వివరించారు. గోల్వర్కర్, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులు ఉన్నారని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్, గోల్వర్కర్ భావజాలాన్ని అమలు చేసేందుకే తమకు లోక్‌సభలో నాలుగు వందల సీట్లు కావాలని బిజెపి ఎత్తుగడ వేసిందని, అయితే ఆ రకమైన మెజారిటీ లభిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా విస్తృంగా ప్రచారం చేసినందుకే ప్రజలు ఆలోచించి ఓట్లు వేయలేదన్నారు. అయినా ఆ పార్టీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయన్నారు. నాలుగు వందల సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు లేకుండా చేసే వారని అన్నారు. ‘సర్’ పేరిట ఓట్ల గల్లంతు అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతున్నదని, భవిష్యత్తులో ఆధార్ కార్డు, భూమి, రేషన్ కార్డులూ తొలగిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ మొత్తం అండగా నిలబడుతుందని, అదేవిధంగా దేశం మొత్తం కూడా బాసటగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ చోరీపై రాహుల్ గాంధీ అనేక ఆధారాలతో బయట పెట్టారని ఆయన చెప్పారు.

భారీగా హాజరైన తెలంగాణ నేతలు

ఇదిలాఉండగా ఢిల్లీలో ఓట్ చోరీ మహా ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిసిసి చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రం నుంచి అనేక మంది ముఖ్య నాయకులు తమ అనుచరులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి హస్తినలో జరిగిన సభకు హాజరయ్యారు.

సాగు నీటి కోసం.. పోరుబాట

మనతెలంగాణ/హైదరాబాద్: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్‌ఎస్‌ఎల్‌పి సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, పదేండ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకు పోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించనున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్న కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బిఆర్‌ఎస్ భావిస్తున్నది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 91 టిఎంసిలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టిఎంసిలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 45 టిఎంసిలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని,

కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే అని బిఆర్‌ఎస్ పార్టీ పేర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపిలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని, బిజెపి పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నదని బిఆర్‌ఎస్ అభిప్రాయపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బిజెపి చేస్తున్న అన్యాయాన్ని కానీ., కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బిజెపి విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కెసిఆర్ భావిస్తున్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి అని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి అని పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదు అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టిఎంసిలు ఒప్పుకోవడం అనేది ఘోరాతి ఘోరం, దుర్మార్గం… కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు అని పార్టీ స్పష్టం చేసింది. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను.. ఈనెల 19వ తేదీన నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నారు. 

ప్రపంచ స్కాష్ ఛాంపియన్ భారత్

చెన్నై: ప్రపంచకప్ స్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. చెన్నై వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో భారత్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ప్రపంచకప్ స్కాష్ టైటిల్ సాధించిన తొలి ఆసియా జట్టుగా నయా చరిత్ర లిఖించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 30 తేడాతో హాంకాంగ్, చైనా టీమ్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. తొలి సింగిల్స్‌లో జోష్న చిన్నప్ప విజయం సాధించింది. ఇలీతో జరిగిన హోరాహోరీ సమరం లో చిన్నప్ప 73, 27, 75, 71తో జయకేతనం ఎగు ర వేసింది. తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ అభయ్ సింగ్ జయభేరి మోగించాడు. అలెక్స్ లౌతో జరిగిన పోరులో అభయ్ 71, 74, 74తో విజయం సాధించాడు. దీంతో భారత్ 20 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం జరిగిన మూడో మ్యాచ్‌లో 17 ఏళ్ల యువ సంచలనం అనహత్ సింగ్ జయభేరి మోగించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అనహత్ 72, 72, 75తో టొమాతో హోను చిత్తు చేశాడు. దీంతో వరుసగా మూడు సింగిల్స్ మ్యాచ్‌లు గెలిచిన భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఇంతకుముందు ఏ ఆసియా జట్టు కూడా ప్రపంచకప్ స్కాష్‌లో టైటిల్ సాధించలేదు. భారత్ తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్రను తిరగరాసింది.

విత్తన చట్టంపై కార్పొరేట్ సవరణం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతి ఏటా నకిలీ విత్తనాలతో రైతుల నష్టపోతుడంటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ విత్తనాలను కట్టడి చేసేందుకు నూతన విత్తన చట్టం 2025 ను తీసుకురానుంది. ఈ క్రమంలో విత్తన చట్టం కఠినంగా అమలు కాకుండా కార్పొరేట్ కంపెనీలు కుట్రలు చేస్తున్నాయనే ప్రచారం ఒక వైపు వినిపిస్తోంది. ఒకసారి చట్టం అమలు చేస్తే రైతులకు నాసిరకం విత్తనాలు, అమ్మకాలు చేసి అడ్డుగోలుగా దోచుకునే పరిస్థితులు ఉండబోవని కంపెనీలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో చట్టంలోని కొన్ని నిబంధనలను తొలగించి తమ నకిలీ విత్తన వ్యాపారానికి ఢోకా లేకుండా చూసుకునేందుకు కంపెనీలు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నూతన చట్టం రాష్ట్ర రైతులకు హని చేసేవిధంగా ఉందని సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముసాయిదా బిల్లు కంపెనీలకే వత్తాసు పలికే విధంగా కేంద్రం రూపొందించిందని ఆరోపించారు. అయితే చట్టం రూపకల్పన పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ చెపుతోంది.

ఈ చట్టం పూర్తిగా రాష్ట్రాల అధికారాలు హరించే విధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ ఆరోపిస్తోంది. చట్టంలో నఖిలీ విత్తనాలతో రైతుల నష్టపోతున్న నేపథ్యంలో సదరు కంపెనీలు నుండి నష్టపరిహారం చెల్లించే విధంగా చట్టంలో నిబంధనలు ఉంటే విత్తనాల కంపెనీలు నాణ్యమయిన విత్తనాలు తయారు చేస్తాయని వ్యవసాయ శాఖ పేర్కొంటుంది. కంపెనీలపై నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ చేతిలోకి వెళ్లడంతో సామాన్య రైతులకు జరిగే న్యాయం ప్రశ్నార్ధకంగా మారనుంది. ముసాయిదాలో నూతన విత్తన తయారీలో కంపెనీలకు స్వీయ దృవీకరణకు అనుమతి ఇవ్వడం, స్థానిక వాతావరణ, ఇతర అనుకూలతలతో సంబంధం లేకుండా  అనుమతులకు అవకాశం, దీంతో పాటు విత్తన కంపెనీలు విత్తనాల నాణ్యత, మెలక శాతం లాంటి అనేక పర్యవేక్షణలకు చెందిన నిబంధనలు కార్పొరేట్ కంపెనీలకు వరంగా మారాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో గిరిజన రైతులు నష్టపోయిన తర్వాత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా విత్తన చట్టం రూపకల్పనకు నిర్ణయం తీసుకుంది.

భవిష్యత్ లో నకిలీ విత్తనాలు రాకుండా, కంపెనీల ఇష్టానుసారంగా అమ్మకాలు జరపకుండా కొత్త చట్టం చేయాలని నిర్ణయించింది. దీంతో ముసాయిదా కమిటీ సభ్యులు పలుమార్లు సమావేశమై విత్తన చట్టం ఏ విధంగా తీసుకొస్తే అన్నదాతలకు భరోసా లభిస్తుందనే విషయాలపై చర్చించారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టన ముసాయిదాలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, రైతు కమిషన్‌లు పేర్కొంటున్నాయి. దీంతో పాటు బిల్లులో చేయాల్సిన సవరణలు కేంద్రానికి పంపాయి. బిల్లులో సవరణలు జరిగితే కంపెనీలకు నష్టం చేకూరుతుందని, అందుకే ఈ సవరణలు అడ్డుకునేందుకు కంపెనీలు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతుల కోసం సవరణలు చేయాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది.

మేం తిరగబడితే రాష్ట్రం ఆగమే..

మన తెలంగాణ/నూతనకల్ : పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ బిఆర్‌ఎస్ శ్రేణులపై దాడులకు తెగబడుతోంది, మేము తిరగబడితే తట్టుకోలేరు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అధికార పార్టీకి ఘాటుగా హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ గూండాల చేతిలో దారుణ హత్యకు గురైన బిఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమ పార్టీ ఆ కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతగా భయపడుతోందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అద్భుతాలు చేశామని, రుణమాఫీ, ఇళ్లు, రేషన్ కార్డులు ఇచ్చామని కాంగ్రెస్ చెబుతున్న మాటలు నిజమే..

అయితే, ఎన్నికలంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పట్టేవారని, కానీ వైఫల్యాల భయంతోనే ఆ పార్టీ శ్రేణులు దాడులకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ‘పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం.. ఏనాడూ మీలాగా ఆలోచించలేదు. మేం కూడా మీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉండేదా?’ అ ని ప్రశ్నించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాం గ్రెస్ నేతలు ఇప్పటికైనా దిక్కుమాలిన రాజకీయాలు మా ని, ప్రజలకు మంచి చేయడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగితే, ఇక సహించేది లేదని, తాము కూడా తిరగబడక తప్పదని వ్యాఖ్యానించారు. అదే జరిగితే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి, పరిస్థితి చేయి దాటిపోతుందని హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి హింసాత్మక సంసృ్కతి గతంలో లేదని, ఇది మంచి పద్ధతి కాదని విజ్ఞప్తి చేశారు.

మల్లయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం..

మల్లయ్య చనిపోయిన వెంటనే రావాలనుకున్నా, ఉద్రిక్తతలు పెరగకూడదనే ఉద్దేశంతోనే ఆగానని తెలిపారు. మల్లయ్య కుటుంబానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, తప్పకుండా మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తుందని, రాగానే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.

బిఆర్‌ఎస్ శ్రేణులకు అభినందనలు

కాంగ్రెస్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, మొక్కవోని ధైర్యంతో పోరాడి పంచాయతీ ఎన్నికల్లో సుమారు 50 శాతం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్న గులాబీ సైనికులకు కెటిఆర్ శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. ప్రజలంతా కెసిఆర్ పాలన కోసం, ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మం త్రి, సూర్యాపేట ఎంఎల్‌ఎ జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్, బూడిద బిక్షమయ్య, నేతలు భూపాల్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.