Canlı Maç İzle

diyetisyen

x

Hacklink

imajbet

Agb99

Hacklink

betebet

kayaşehir escort

BetKare Güncel Giriş

taksim escort

üsküdar escort

Hacklink

casino kurulum

Hacklink

vdcasino

Hacklink

dinamobet

Hacklink

Hacklink

meritking

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

çağlayan escort

esenyurt escort

fix my speaker

deneme bonusu

meritking

SBOBET88

sekabet

Hacklink

MerlinToon

kiralık hacker

Hacklink panel

marsbahis

betturkey

grandpashabet

Hacklink

Hacklink

pusulabet

marsbahis

kingroyal

kingroyal

jojobet giriş

sekabet

Hacklink Panel

Hacklink

xx1

Holiganbet

sarıyer escort

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

bomonti escort

Hacklink

ultrabet

grandpashabet

Hacklink

özbek escort

agb99

matbet

Hacklink

Hacklink

yakabet 2026

Hacklink

Hacklink

Hacklink

Hacklink

deneme bonusu veren siteler

Hacklink

tarafbet

hititbet giriş

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Slot Mahjong

vdcasino

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

çeşme escort

Hacklink

Hacklink

Hacklink

betpas

Hacklink

หวยออนไลน์

pusulabet

Hacklink

Hacklink satın al

kavbet

Betokeys

Hacklink Panel

download cracked software,software download,cracked software

lunabet

ultrabet

vdcasino

marsbahis giriş

betcio

kralbet

స్వరం మార్చిన మోడీ

బిజెపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరం మార్చారు. పొరుగు దేశాల నుంచి సరిహద్దులు దాటుకుని చొచ్చుకు వస్తున్న చొరబాటుదారుల సమస్యపైన, ఎన్నికల కమిషన్ ఆదేశాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్‌ఐఆర్) ను సమర్థించడం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వాటినే తమ ప్రచారానికి ప్రధాన ఇంధనంగా వాగ్బాణాలు కురిపిస్తున్నారు. అంతేకాదు విపక్ష పాలిత రాష్ట్రాల్లో తుపాకులు ఎక్కుబెట్టి అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తప్పనిసరి అని బెదిరిస్తున్నారు. ‘జంగిల్‌రాజ్’ (ఆటవిక పాలన) అనే బెదిరింపుతో బీహార్‌లో ఏ విధంగా ఓట్లను కొల్లగొట్టి గెలుపొందారో అనే రీతిలో విపక్ష రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో జంగిల్‌రాజ్ బూచి చూపించి బెదిరిస్తున్నారు. చొరబాటు సమస్యపై మోడీ ఒక్కరే ఆందోళన చేస్తున్నట్టు కాదు, దాని ప్రభావం మొదటిసారి స్థానిక జనాభాపై చూపించింది. ఈ ఏడాది మొదట్లో జార్ఖండ్‌లో మోడీ ప్రయోగించిన ఏకైక అతి ముఖ్యమైన ప్రచార థీమ్ ‘చొరబాటుదారుల సమస్య’ ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చొరబాటుదారుల వల్ల స్థానిక జనాభాకు ఒక బెదిరింపుగా మారింది.

ఈ ప్లాను ఎన్నికల్లో వర్క్‌అవుట్ కానప్పటికీ గిరిజన ప్రజలు ఎక్కువగా నివసించే సరిహద్దు రాష్ట్రం అంత ఆసక్తిగా స్పందిచనప్పటికీ, రాబోయే ప్రమాదం ఉందని మోడీ హెచ్చరించారు. ఇప్పుడు ఆ థీమ్‌నే తదుపరి గమ్యస్థానానికి తీసుకెళ్తున్నారు. బిజెపి తన పార్టీ అజెండాలో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అక్కడ కొన్ని చొరబాట్లను చూపించడంలో కొంతవరకు పురోగమించగలిగింది. ఇతర రాష్ట్రాలతో సమానంగా సుస్థిర అభివృద్ధిని పార్టీ సాధించలేని పరిస్థితుల్లో అక్కడ గెలుపొందడానికి వేరే మార్గాలను అనుసరిస్తోంది. పశ్చిమబెంగాల్ విషయంలో ఎలాగైనా ఓట్ల బ్యాంకును కొల్లగొట్టాలన్న వ్యూహంతో అక్రమ చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని అందుకే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను అడ్డుకుంటోందని మోడీ పెద్ద అభాండం వేశారు. దీనికి తోడు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలు తున్నాయని, ఇది మహాజంగిల్ రాజ్ వంటి పరిస్థితి అని ఆరోపించారు. కానీ ఓటర్ల జాబితా సవరణ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగానే ఉన్నారు. సవరణ పేరుతో భారీ ఎత్తున ప్రజల ఓటు హక్కును కాజేస్తున్నారని, ప్రత్యేకించి మైనారిటీలు, పేదల ఓటు హక్కు కోల్పోతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఓటర్ల సవరణ మొదటి జాబితాలో తొలగించిన ఓటర్ల పేర్లను పరిశీలిస్తే మాతువా సామాజిక వర్గానివే ఎక్కువగా ఉన్నాయి.

హిందూ నామసుద్రలకు చెందిన వీరంతా బంగ్లాదేశ్ (నాటి తూర్పు పాకిస్తాన్) నుంచి పశ్చిమబెంగాల్‌కు 1947లో ఎప్పుడో తరలివచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నాడియా, హౌరా, కూచ్ బీహార్ తదితర సరిహద్దు జిల్లాల్లో వీరు ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండో భారీ షెడ్యూల్డ్ కులంగా మాతువా సామాజిక వర్గం ఉంటోంది. వీరు ఓటు హక్కు కోల్పోవడంపై ప్రధాని మోడీ ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడే కాదు 2019, 2021లో ప్రధాని మోడీ ఈ ప్రాంతానికి వచ్చినా వారి పౌరసత్వం గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికిన ఈ సామాజిక వర్గం ఎస్‌ఐఆర్ మొదటి దశ తరువాత ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో వీరి పేర్లు తొలగించబడ్డాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తొలగించిన ఓటర్ల పేర్లలో అనేక మంది పేర్లు ఉనికిలో లేకపోవడం కానీ, లేదా వారి తల్లిదండ్రుల పేర్లు అయినా 2002 నాటి జాబితాలో కనిపించలేదని చెబుతోంది. అయితే మాతువా సామాజిక వర్గం తమ ఓటు బ్యాంకుగా పరిగణించిన బిజెపి, మాతువాలకు, ఇతర బంగ్లాదేశ్ శరణార్థులకు చట్టం ప్రకారం పౌరసత్వం కల్పించేందుకు బిజెపి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.

ఓటర్ల జాబితాలో వీరిని చేరుస్తామని బిజెపి భరోసా ఇస్తున్నా ఇంకా వారిలో నమ్మకం కలగడం లేదు. ఎస్‌ఐఆర్ నుంచి తమ ఓటు హక్కు తొలగించారని మాతువా లోని ఒక వర్గం ఠాకూర్ నాయకత్వంలో ఆందోళన చేపట్టింది. చొరబాటుదారులన్నది పెద్ద సమస్యే. చొరబాటుదారులకు ఓటు హక్కు ఉండాలని ఎవరూ వాదించరు. కానీ దేశ పౌరులను గుర్తించడానికి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ప్రక్రియను వినియోగించి వారి పేర్లు లేవని, పౌరులు కారని వారి పేర్లను తొలగించడమే రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాని విధానం. ప్రధాని మోడీ చొరబాటుదారుల ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడంలో ఎస్‌ఐఆర్ అత్యంత సామర్థాన్ని చూపిస్తోందని పదేపదే ప్రశంసిస్తున్నారు.

కానీ దీనివల్ల ఎస్‌ఐఆర్ అంటే జాతీయ పౌరుల జాబితా తయారీ విధానాన్ని మరో మార్గంలో అమలు చేస్తున్నారని ఒక వర్గం వారికి భయాందోళనలను రేకెత్తిస్తూ మరిన్ని ఆత్మహత్యలకు దారితీస్తోంది. మరింత ఆందోళనకరంగా మైనారిటీల పట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించేలా ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన ఉద్దేశాలను స్పష్టంగా తేటతెల్లం చేయగలగాలి. చొరబాట్లను పదేపదే సూచించడం పారదర్శకం కాదు. పశ్చిమబెంగాల్‌ను ప్రధాని మోడీ జంగిల్‌రాజ్‌గా పోల్చి ప్రచారం చేయడం కూడా అత్యంత వివాదాస్పదమే. బీహార్‌లో శాంతిభద్రతలు పేలవం అన్న అంశం బాగానే ఆకట్టుకున్నా, పశ్చిమబెంగాల్‌లో అలాగే ఆ థీమ్‌ను స్వాగతిస్తారన్నది ప్రశ్నార్థకం. విచిత్రంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే థీమ్‌తో ఇదివరకటి వామపక్ష ప్రభుత్వ పాలనలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చట్టబద్ధపాలన అనే ఆలోచనను కూల్చివేసిందని ఆరోపిస్తోంది. 

ఉపాధి హామీ పథకంపై నీలినీడలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) స్థానంలో వికసిత్ భారత్ -రోజ్ గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) 2025 లేదా జి రామ్ జి బిల్లు పై చర్చ సాధారణస్థాయిని మించి సాగుతోంది. ఈ పథకం రాజ్యాంగ సూత్రాలు, ఫెడరల్ వ్యవస్థాపరమైన సంబంధాలు, సంక్షేమ పరమైన ఆర్థిక అంశాలు, రాజకీయ ప్రతివాదంతో పాటు లక్షలాది గ్రామీణ కార్మికుల జీవన వాస్తవికతతో ముడిపడి ఉంది. ఇది కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రానున్న దశాబ్దాలలో భారతదేశం తన పేద పౌరులతో ఎటువంటి సామాజిక సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటోంది అన్నదే కీలక ప్రశ్న. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంఎన్‌ఆర్ ఇజిఎ భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమంగా సాగుతోంది. గ్రామీణ పేదలకు ఏటా కనీసం 100 రోజుల పనిని హామీగా కల్పిస్తోంది. దేశంలో పరిమిత ఉపాధి అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఈ పథకం కీలక పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య భారతంలో, పారిశ్రామిక పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉండి, వేతన ఉపాధి కాలానుగుణంగా ఉండే రాష్ట్రాలకు ఇది జీవనాధారంగా ఉంది.

ఈ పథకం కొనుగోలు శక్తిని బలోపేతం చేసింది. కష్టాలను తీర్చింది, వలసలను తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యానికి మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా కొవిడ్ -19 వంటి సంక్షోభ సమయంలో ఆదాయ భద్రతను అందించింది. అయితే, ప్రస్తుతం ఎంఎన్‌ఆర్ ఇజిఎ పథకం అనిశ్చిత స్థితిలో ఉంది. దీనిని చక్కదిద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నం పలు ఆర్థికపరమైన, పాలనాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సైద్ధాంతిక, సాంకేతిక ప్రశ్నలనూ లేవనెత్తుతోంది. పేదల సంక్షేమ హక్కుగా ఉన్న పథకానికి మహాత్మాగాంధీ పేరుమార్పు కేవలం విధానపరమైన మార్పేనా. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న హిందుత్వ విధానాల కారణంగా, రాజకీయ సాంసృ్కతికపరమైన నేపథ్యం ఏమయినా ఉందా. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. అన్నవే ఆ ప్రశ్నలు. ఈ వ్యాసం భారతదేశంలో గ్రామీణ సమాజం, రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఇతర అంశాలను చర్చించడంతో పాటు ప్రమాదంలో పడిన సమస్యను పరిశీలిస్తుంది. ఎమ్‌ఎన్‌ఆర్ ఇజిఎ పథకం అమలు వల్ల ఎన్నో ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగాయని కార్తీక్ మురళీధరన్, పాల్ నీ హాస్, సందీప్ సుఖ్తంకర్ వంటి నిపుణులు పదేపదే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంవల్ల గ్రామీణుల ఆదాయం దాదాపు 14% పెరిగిందని, పేదరికం దాదాపు 26% తగ్గిందని క్షేత్రస్థాయిలో అధ్యయనాల ఆధారంగా నిరూపించారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల వేతనస్థాయి పెరిగింది. మార్పు వచ్చింది. వ్యవసాయ కూలీలు, కార్మికుల బేరసారాల శక్తిని పెంచింది. ఈ పథకం వల్లనే వారికి డిమాండ్, గౌరవం పెరిగింది. గ్రామీణ పేదలకు ఎంపిక చేసుకునే అవకాశం కలిగింది.

ఉపాధి హామీ పథకం భారతదేశంలో అత్యంత సంక్షోభ సమయంలో నివారణమంత్రంగా పనిచేసింది. ముఖ్యంగా కొవిడ్ -19 మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాదిమందికి సురక్షితమైన జీవనోపాధిగా మారింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి.ప్రైవేటు ఉపాధి అవకాశాలూ తక్కువే. ఏడాది పొడవునా వ్యవసాయం ఉండదు, అలాంటి రాష్ట్రాలలో ఈ మహాత్మాగాంధీ పథకం ఆర్థికపరమైన స్థిరీకరణ శక్తిగా పనిచేసింది. పేదల ఆకలి తీర్చేందుకు అవసరమైన వేతనాలను అందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పేదలకు అన్ని విధాలా అండగా నిలిచింది. అటువంటి పథకాన్ని నీరుగార్చడం అంటే, స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన సామాజిక హామీని అణచివేయడమేనని విమర్శకులు అంటున్నారు.

ఎంఎన్‌ఆర్‌ఇజిఎ స్థానే -జి రామ్ జి -భర్తీ చేయడానికి ప్రభుత్వం మూడు కారణాలు చెబుతోంది. మొదటిది. ఈ పథకం కింద పెరిగిన వేతనాలు, ఉత్పాదకతను మించిపోయాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెంచింది. రెండవది. ఉపాధి హామీ పథకం కారణంగా వ్యవసాయ కార్యకలాపాలకు కార్మికులు దూరమయ్యారు. ఫలితంగా వ్యవసాయంలో కార్మిక మార్కెట్ దెబ్బతింది. మూడవది- కార్మికులలో నైపుణ్యంపెంచి, ఉత్పాదకత ఆధారంగా అభివృద్ధి సాధించడం ద్వారా, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ కార్యక్రమంలో సంస్కరణలు, దిశానిర్దేశం అవసరం. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జి రామ్ జి బిల్లు కొత్తబిల్లు హామీ పనిదినాలను 100 నుంచి 125కి పెంచుతుంది. అవకాశాలు విస్తరిస్తాయి. ఒకే విధమైన వేతనాలను ప్రవేశపెడుతుంది. కొత్త వర్గాలకు అందుబాటులో ఉంటుంది. కేంద్రీకృత స్థాయిలో శ్రామికశక్తి ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ఈ సంస్కరణలు 2005 నుంచి పెద్దగా అభివృద్ధి చెందని పథకానికి అవసరమైన, ఆధునీకరణను ప్రతిపాదిస్తున్నది. ఏదైనా పెద్ద ప్రజా కార్యక్రమానికి కాలానుగుణంగా సమీక్ష అవసరమనే వాదన ఉండనే ఉంది.

కొత్త బిల్లు పథకం ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ హక్కుల ఆధారితమైన పథకం.పనిని డిమాండ్ చేసి పొందవచ్చు. లేకుంటే, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఇది నిర్దేశిస్తుంది. కొత్త బిల్లులో ఈ అవకాశం లేదు. డిమాండ్ ఆధారిత ఉపాధిని కేంద్రీకృత లక్ష్యాలు, బడ్జెట్ పరమితులు నిర్దేశిస్తాయి. ఈ మార్పు చట్టపరమైన హక్కును సంక్షేమ రాయితీగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్థికవేత్త ప్రతాప్ భాను మెహతా హెచ్చరించినట్లుగా ఈ సంస్కరణలు ఉపాధి హామీ పథకం సాధించిన మార్పును దెబ్బతీయవచ్చు. గ్రామీణ పేదల సాధికారత కోసం కాక, శ్రమను హక్కుగా చెప్పుకునే అవకాశం ఉంది.

ఉపాధి హామి పథకం పేరు మార్పు సంచలనంగా మారింది. శ్రమకు గౌరవం కల్పించే కార్యక్రమానికి గాంధీ పేరు మార్చడం రాజకీయ పరమైన ప్రతీకవాదమే. ఈ నిర్ణయం వెనుక హిందూత్వ ఉద్దేశం ఉందా.. అన్నది ప్రశ్న. సంస్థలు, స్టేడియాలు, పథకాలు నగరాల పేర్ల మార్పు మాదిరిగానే, కొత్త సామాజిక జాతీయవాద దృక్పథానికి అనుగుణంగా ఉపాధి పథకం పేరు మార్పు జరిగింది అనుకోవచ్చు. గాంధీని బహిరంగంగా గౌరవించినా, ప్రస్తుత సర్కార్‌కు రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. ముఖ్యంగా బిజెపి సైద్ధాంతిక సూత్రాలకు చుక్కెదురు. గాంధీ పేరును వికసిత్ భారత్‌తో భర్తీ చేయడం ప్రధాని మోడీ రాజకీయపరమైన ఆలోచనే. ఇది ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో తీసుకువచ్చిన మార్పునకు తామే కారణమని క్లయిమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. హిందూత్వ కోణం ఉన్నా లేకున్నా, పథకంపై క్లయిమ్ చేసుకోవడానికే అన్నది సుస్పష్టం. మహాత్మాగాంధీ ఉపాధి పథకం కేంద్రానికి రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. పెద్ద పథకం, పెద్దఖర్చు, గ్రామీణ పేదలే నడుపుతున్నది. ఇది పంచాయితీలకు అధికారం ఇస్తుంది. కేంద్ర ఆదేశాన్ని బలహీనపరుస్తుంది. ఇది దళితులు, ఆదివాసీలు, మహిళలు, భూమిలేని కార్మికులతో సహా, అత్యంత అణగారిన వర్గాలకు అధికారాన్ని అందిస్తుంది. బిజెపి తన ఎన్నికల ప్రచారంలో ఈశాన్య రాష్ట్రాలపై గురిపెట్టింది. ఈ కార్మిక హామీని బలహీనపరచడం తీవ్ర సామాజిక, రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చు. అసోం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ లలో ఈ పథకంపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గడం, వలసలు పెరగడానికి దారితీయవచ్చు. ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ పథకానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రప్రభుత్వ ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది.ఈశాన్య రాష్ట్రాలకు స్వతంత్ర ఆదాయ మార్గాలు లేవు. సంక్షేమ పథకాలకు అవి కేంద్రం మద్దతు పై ఆధారపడి ఉన్నాయి.

తీవ్ర ఆందోళన కలిగించే అంశం వ్యవసాయ సీజన్‌లో ఉపాధి స్తంభించే అవకాశం. పంటకోత కోసం కార్మికుల అవసరాలు తీర్చేందుకు, ఈ పథకం వీలు కల్పించవచ్చు. వ్యవసాయ ఆఫ్- సీజన్‌లో ఉపాధి హామీ వేతనాలు జీవనాధారంగా మారతాయి. అదే విధంగా, ఉపాధికి బయోమెట్రిక్ ప్రాతిపదిక కావడంతో కనెక్టివిడీ లేని ప్రాంతాలలో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఫలితంగా, పరిమిత డిజిటల్ అక్షరాస్యత ఉన్న మహిళలు, వృద్ధ కార్మికులు, గిరిజనులు, వలసలకు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం ఆర్థికంగానే కాక, సామాజికంగా కూడా విజయం సాధించింది. సంస్కరణపై చర్చ కేవలం, ఉత్పాదకత, ఆర్థిక క్రమశిక్షణ గురించి చెబుతున్నా, ఆ పథకం సాధించిన సామాజిక మార్పును గుర్తించడం లేదు. ఎంఎన్‌ఆర్ ఇజిఎ పథకం కేవలం ఆస్తులను సృష్టించలేదు. గ్రామీణులకు వాయిస్ ఇచ్చింది. లక్షలాది మంది గ్రామీణ మహిళలకు వేతన హక్కు డిమాండ్ చేసేలా నేర్పింది. మౌలిక సదుపాయాలను నిర్మించడంతో పాటు, మధ్యవర్తులను తగ్గిచింది. పని కల్పించడం రాష్ట్ర బాధ్యత అనే రాజకీయ సూత్రాన్ని స్థిరపరచింది. పథకం సాధించిన విజయాలను రాజకీయంగా, ఆర్థిక పరంగా తక్కువగా చూపడం చరిత్రాత్మకమైన తప్పిదమే.

సంస్కరణ అవసరం, నిర్మాణాత్మక మార్గంలో ఇవి అవసరం. రాష్ట్ర ఆర్థిక వాటా క్రమంగా పెంచడం, పారదర్శకత విధానాలను బలోపేతం చేయడం, సామాజిక తనిఖీలను పక్కన పెట్టకుండా రక్షించడం, ఆస్తి పెంచే వర్గాలను విస్తరించడం, ఎంఎన్ ఆర్ ఇజిఎ కింద నిర్మించిన మౌలిక సదుపాయలు దీర్గకాలిక అభివృద్ధికి ఉపయోగించాలి, నీటి నిర్వహణ, నీటి పారుదల, వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఇబ్బందులను పరిష్కరించాలి, భూమి, పర్యావరణ పరిరక్షణకు తగిన పథకాలు విస్తరించాలి. సౌకర్యవంతమైన వేతన చెల్లింపు వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు ప్రాధాన్యత నిధులు అవసరం. అలాగే నిర్మాణాత్మకమైన మార్పు చేపట్టే ముందు రాష్ట్రాలను సంప్రదించాలి. ఫెడరల్ వ్యవస్థ సంస్కరణలకు అడ్డంకిగా మారకూడదు. చివరిగా, పేరు పెట్టడం ముఖ్యం. గాంధీ పేరును తొలగించడం నామ్ కే వాస్తేగా మారరాదు. సమగ్రమైన విధానం, దాని వ్యవస్థలు, లక్ష్యాలను నవీకరిస్తూ, పథకం చారిత్రక గుర్తింపును నిలుపు కోవాలి. ఉపాధి పథకం ప్రస్తుతం క్రాస్ రోడ్ దశలో ఉంది. అంటే మలుపు తిరిగిన దశలో ఉంది, సంస్కరణలు దాని విలువను మరింత పెంచవచ్చు. గాంధీ పేరును తొలగించడం మారుతున్న రాజకీయ దృక్పథాన్ని సూచిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశ సంక్షేమ నిర్మాణానికి మూలస్తంభంగా ఉండాలంటే, గ్రామీణ గౌరవం, పని చేసే హక్కును తిరిగి ధ్రువీకరించడంపై ఆధారపడి ఉంది. 

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్ 

పొంచి ఉన్న యురేనియం ఉపద్రవం

భూగర్భజలాల్లో, బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు ఇటీవలి పరిశోధనల్లో బయటపడడం శాస్త్రవేత్తల నుంచి వైద్య నిపుణుల వరకు ఆందోళన కలిగిస్తోంది. దీని రేడియో థార్మిక ప్రభావం కన్నా దాని రసాయన విష ప్రభావమే ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యురేనియం స్థాయిలను తగ్గించడం ప్రభుత్వవర్గాలకు ఒక సవాలుగా మారింది. సహజంగా లభించే యురేనియం ఇటీవల దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు సార్లు బయటపడింది. దేశరాజధాని ఢిల్లీలో భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సిజిడబ్య్లుబి) అధ్యయనంలో తేలింది. బీహార్‌లో ఎఐఐఎంఎస్ పరిశోధకులు, మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ తల్లుల స్తన్య పాలల్లో కూడా యురేనియం అత్యధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ రెండు అధ్యయనాలు ఈ యురేనియం స్థాయిలు పెరిగిపోతుండడాన్ని తీవ్రంగా పరిగణించి అత్యవసర చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీలో సేకరించిన 83 భూగర్భజలాల నమూనాల్లో 24 నమూనాలు బిఐఎస్ స్థాయిలకు మించి యురేనియం ఉందని సిజిడబ్లుబి వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం పరిమితి ఫరవాలేదు. సహజ యురేనియం వాయువ్య భారతం లోని రాళ్లల్లో ఉంటుంది. హైడ్రొలాజికల్ పరిస్థితుల్లో రాళ్లలోంచి కరిగికరిగి నీటివనరుల్లో చివరకు భూగర్భ జలాల్లో కలుస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల యురేనియం ఆహార గొలుసులోకి చేరుకునే అవకాశం ఉంది. దీని కచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు చేస్తోంది. నైట్రేట్, ఫ్లోరైడ్, స్లైనిటీ, భారీ లోహాలు కూడా అనేక ప్రాంతాల్లో ఎక్కువస్థాయిల్లో కనిపించాయి. దీనిని బట్టి నీటివనరులపై ఈ లోహ మూలకాల ప్రభావం పెరిగిందని బయటపడింది. బీహార్‌లోని ఆరు జిల్లాలకు చెందిన దాదాపు 40మంది బాలింతల తల్లిపాల నమూనాల్లో యురేనియం ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. అన్ని నమూనాల్లో యురేనియం (యు238) ఉన్నట్టు ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్‌వర్మ వెల్లడించారు. దీని గాఢత 0 నుంచి 5.25 మైక్రోగ్రాములు, లీటరు మధ్య నమోదైంది. దాదాపు 70% శిశువుల్లో యురేనియం ప్రభావం వల్ల అనేక అనారోగ్య సమస్యలువచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల అంచనా.అయితే బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని తాగే శిశివులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనివల్ల తల్లుల ఆరోగ్యం పైనా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే బీహార్ బాలింతల పాలలో గుర్తించిన యురేనియం స్థాయిలు సురక్షితమైన పరిమితుల్లోనే ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే తాగునీటి లోనే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా యూరేనియం స్థాయిలు ఉన్నాయని బయటపడింది. ముఖ్యంగా బీహార్‌లోని ఖగారియా జిల్లాలో యురేనియం సగటు స్థాయి అత్యధికంగా ఉండగా, కటిహార్‌లో ఒకే నమూనాలో అత్యధిక గాఢత నమోదైంది. అయితే తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతాదులో ఉన్నప్పటికీ శిశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని మరికొందరు పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) తాగు నీటిలో యురేనియం కోసం నిర్దేశించిన పరిమితి 30 మైక్రోగ్రాములు/లీటరు. తల్లిపాల నమూనాల్లో లభించిన స్థాయి (గరిష్టంగా 5.25 మైక్రోగ్రాములు/ లీటరు) ఈ డబ్లుహెచ్‌ఒ ప్రమాణం కంటే చాలా తక్కువగా ఉంది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం తల్లి శరీరంలోకి చేరిన యురేనియంలో ఎక్కువ భాగం మూత్రం ద్వారానే బయటకు వెళ్లిపోతుంది. తల్లిపాల లోకి చేరే యురేనియం శాతం చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. భూగర్భజలాల్లో యురేనియం ఉన్నట్టయితే రేడియో ధార్మిక లక్షణాల కన్నా రసాయన కాలుష్యం ఎక్కువగా పెరుగుతుందని చెబుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. యురేనియం గనుల్లో పనిచేసేవారికి, యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్లలో పనిచేసే వారికి మూత్రపిండాలు దెబ్బతినే సమస్య ఏర్పడుతుంది.

యురేనియం తక్కువ స్థాయిలో ఉన్న నీటిని తాగిన వారికి రేడియేషన్ కన్నా, రసాయన విష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీలోని భూగర్భజలాల్లో రేడియో థార్మికత బలహీనంగా కనిపించినా, మూత్రపిండాల కణాలపై దాని విష తీవ్రప్రభావమే దేశంలో తీరని సమస్యగా ఉంటోంది. యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ పరంగా ప్రేరేపితమైన మూత్రపిండాల వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం, కొన్ని రసాయనాలకు గురికావడం మూత్రపిండాల వ్యాధులకు దోహదం చేస్తున్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆహారం, తాగునీటిద్వారా యురేనియం లోపలికి ప్రవేశించడం సర్వసాధారణమే అయినప్పటికీ దుమ్ముధూళి పీల్చడం ద్వారా లేదా గాయపడిన చర్మం ద్వారా కూడా యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. లోపలికి వెళ్లిన తరువాత ప్రధానంగా మూత్రపిండాలపైనే యురేనియం ప్రభావం మొదట కనిపిస్తుంది. ప్రధానంగా మూత్ర నాళికలను పాడు చేస్తుంది. దాంతో అవి పనిచేయకుండా పోతాయి. యురేనియం అత్యధిక స్థాయిల్లో ఉంటే క్రమేణా కాలేయం, ఊపిరితిత్తులు, నాడీవ్యవస్థలకు హాని కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో వాపు కనిపిస్తుంది. బరువు తక్కువ శిశువులు జన్మించడం లేదా నెలలు నిండకముందే ప్రసవించడం వంటి సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. 

కె. యాదగిరి రెడ్డి 98667 89511

గద్వాల్ లో మొసలి సంచారం. భయంతో వణికిపోయిన రైతులు

మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మద్దెలబండ చిన్న తండాలోని పొలాల్లో మొసలిని రైతులు గుర్తించారు. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఆగ్రామానికి చేరుకొని మొసలిని తీసుకెళ్లారు. చీకటిలో మొసలి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీకటిలో మొసలిని రైతులు బలే గుర్తించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

మల్దకల్ లో మొసలి సంచారం. భయంతో వణికిపోయిన రైతులు

మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మద్దెలబండ చిన్న తండాలోని పొలాల్లో మొసలిని రైతులు గుర్తించారు. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఆగ్రామానికి చేరుకొని మొసలిని తీసుకెళ్లారు. చీకటిలో మొసలి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీకటిలో మొసలిని రైతులు బలే గుర్తించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

ఐటి ఉద్యోగులకు ఎఐ ఎసరు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఊడ్చేస్తోంది. ఒకప్పుడు తిరుగులేని ఉద్యోగ రంగంగా ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో కొలువు. ఈ రోజుల్లో గాల్లో దీపంలా మారింది. గతంలో ఓ ఉద్యోగిని తొలగించారంటే ఎన్నో కారణాలు ఉండేవి. ఈ ఏడాది ఎఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఉద్యోగాలు పోయినట్లు అంతర్జాతీయ గణాంకాలు చెబుతుండగా, వీటిలో నూటికి 90 టెక్ ఉద్యోగాలే కావటం గమనార్హం. ఇలా ఉద్యోగాలు పీకేసిన సంస్థల్లో టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి కంపెనీలుండటం గమనార్హం. వీటిలో ఒక్క టిసిఎస్ సుమారు 20 వేల ఉద్యోగులను ఇంటికి పంపింది. గతంలో ఎవరి ఉద్యోగమైనా పోతే.. అనేక కారణాలుండేవి. కానీ, ప్రస్తుతం ఏ టెక్ సంస్థ అయినా లేఆఫ్ ప్రకటించిందంటే దానికి ఎఐ ప్రభావమే కారణమవుతోంది. ఈ నేపథ్యంలో టెక్ రంగంలోని ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సి వస్తోంది. ఏ రోజుకారోజు దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షుఅన్నట్లుగా వారు భయభయంగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో తమ ఉద్యోగులను పెద్దమొత్తంలో తొలగించనున్నట్టు 41% కంపెనీలు పేర్కొన్నట్టు వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) ఇటీవల ఒక నివేదికలో వెల్లడించింది. ప్రధాన రంగాల్లోకి ఎఐ ప్రవేశించడమే దీనికి కారణంగా వివరించింది. అమెజాన్ ఎఐలో భారీ పెట్టుబడులు పెడుతోంది. 2025 నాటికి ఎఐ మెషిన్ లెర్నింగ్‌లో సుమారు ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉందని ప్రకటించింది. ఈ పెట్టుబడులతో, సంస్థలోని హై-పెయిడ్ వైట్-కాలర్ ఉద్యోగులను ఎఐద్వారా భర్తీచేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తోంది. అమెజాన్ లేఆఫ్‌ల ప్రత్యక్ష ప్రభావం భారతదేశంపై పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఇతర బహుళజాతి కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌లోని అవుట్‌సోర్సింగ్ హబ్‌లు ఇప్పటికే ఎఐ నుండి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. చాలా వరకు ఐటి కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఉద్యోగులకు శిక్షణ కూడా ఇస్తున్నాయి.

రానున్న రోజుల్లో దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్, ఐబిఎం వంటి పెద్ద కంపెనీలు సుమారు 70,000 మంది ఉద్యోగులను తొలగించారు. మైక్రోసాఫ్ట్ లాభదాయకతను పెంచుకోవడం, ఎఐ, డేటా సెంటర్లలో భారీ పెట్టుబడుల కోసం ఉద్యోగులను తొలగిస్తోంది. ఐబిఎం హెచ్‌ఆర్ కార్యకలాపాలలో ఎఐ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టి 8 వేల మంది ఉద్యోగులను తగ్గించింది. అమెరికా టెక్ దిగ్గజాలు భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సేల్స్, సపోర్ట్ వంటి విభాగాల్లో భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ లేఆఫ్‌లు భారతీయ ఉద్యోగులపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపుతాయి. ఐటి రంగంలో ఇప్పుడు ఆటోమేషన్, ఎఐ టెక్నాలజీలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల పుణ్యమా అని పునరావృత పనుల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. మిగతా పనుల్లోనూ ఐటి కంపెనీలు ఎఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. అందుకోసం ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఐటి ఉద్యోగులకు ఎఐ ఒక పెద్ద సవాలుగా మారింది. పొదుపు చర్యలు, పెరుగుతున్న నైపుణ్య అవసరాలు, ఆటోమేషన్, ఎఐ అడాప్టేషన్ ఒత్తిళ్లతో ఉద్యోగ ప్రపంచం తలకిందులవుతోంది. ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అనే టెన్షన్‌తో టెకీలు ఆందోళన చెందుతున్నారు. ఇఎంఐలు ఎలా కట్టాలి? మరో ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. కంపెనీలు వ్యయం తగ్గింపు, నష్టాల నియంత్రణ వంటి కారణాలకు బదులు, ఇప్పుడు సంస్థ పునర్నిర్మాణం, పురోగతి, వర్క్‌ఫోర్స్ ఆప్టిమైజేషన్ వంటి పదాలను ఉపయోగిస్తూ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కమ్యూనికేషన్లు, పాడ్‌కాస్టింగ్, పరికరాలు, హెచ్‌ఆర్, సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లలో కోతలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత ఐటి రంగంలో సైలెంట్ లేఆఫ్‌లు ఉద్యోగుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఎఐ సాంకేతికతతో ఇంజనీరింగ్ పనులను ఆటోమేట్ చేయడం, వ్యయ తగ్గింపు చర్యలు, వ్యాపార వృద్ధిలో మందగమనం వంటివి దీనికి కారణాలు. కంపెనీలు సామూహిక లేఆఫ్‌లను ప్రకటిస్తే మార్కెట్లో చెడు సంకేతం వెళ్తుందని భావించి, ఉద్యోగులే స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా ఒత్తిడి చేసే పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఎఐ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5 శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. వచ్చే పదేళ్లలో 40 శాతం వరకు జాబ్స్ ఎఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని, దీంతో 89 శాతం మేర ఇంజినీర్లు ఎఐ, ఎంఎల్ లోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని ఆ అధ్యయంలో పేర్కొంది. ఎఐ విప్లవంపై మరో వాదన కూడా ఉంది. ఎఐ అభివృద్ధి వల్ల ఉద్యోగాల స్వరూపం మారుతుందని ఒకవైపు చర్చ జరుగుతుంటే, అనేక సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాలను తొలగిస్తూ, దానికి ఎఐ ని కారణంగా చూపుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఎఐ సాధనాలు ఇప్పటివరకు కొన్ని రంగాల్లో మాత్రమే ప్రభావవంతంగా ఉన్నాయని, వేలాది మంది ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసే స్థాయికి ఇంకా చేరలేదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఎఐ సునామీని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది, భారతీయ ఉద్యోగ మార్కెట్ ఈ మార్పులకు అనుగుణంగా మారాల్సి ఉంటుంది.

కోడూరు సాల్మన్ రాజు

96525 82025

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి… సంగారెడ్డిలో ట్రావెల్స్ బస్సు బోల్తా

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనమంట్ర మండలంలో రోడ్డుప్రమాదం జరిగింది. పోలమూరులో మద్యం మత్తులో ముగ్గురు యువకుడు గోడను ఢీకొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి చౌరస్తాలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు31 మంది ప్రయాణికులతో ముంబయి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాణ నష్టం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

సైబర్ వలలో చిక్కుకొని మాజీ ఐపిఎస్ అధికారి ఆత్మహత్యాయత్నం

ఛండీగఢ్: సైబర్ వలకు చిక్కుకొని విలవిలలాడి ఓ మాజీ ఐపిఎస్ అధికారి తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ సంఘటన పంజాబ్‌లోపి పటియాలాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమర్ సింగ్ చహల్ అనే ఐపిఎస్ అధికారి గతంలో పంజాబ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డిబిఎస్ బ్యాంకు సిఇఒ, సంపద నిర్వహణ అధికారిగా పని చేశారు. పదవీ విరమణ చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని అమర్ సింగ్‌కు సైబర్ నేరగాళ్లు ఆశ చూపారు. ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టడంతో అధిక మొత్తంలో లాభాలు చూపించడంతో అమర్ సింగ్ వారిని గుడ్డిగా నమ్మారు. వాటిని ఉపసంహరించుకునేందుకు సర్వీసు రుసుము, పన్నుల రూపంలోనూ భారీ మొత్తంలో చెల్లించాడు. నకిలీ డ్యాష్‌బోర్డులు ద్వారా తనని నమ్మించారని గ్రహించాడు. అప్పటికే అతడు రూ.8.10 కోట్లు మోసపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఒక మాజీ ఐపిఎస్ అధికారిగా ఉండి సైబర్ వలలో చిక్కుకోవడంతో మానసికంగా కుంగిపోయాడు. తాను మోసపోయానని గ్రహించి పంజాబ్ డిజిపికి 12 పేజీల లేఖ రాశాడు. అనంతరం తన వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డు తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 

బోడుప్పల్ లో ప్రియుడితో కలిసి భర్తను చంపి… హార్ట్ ఎటాక్ గా నమ్మించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని హత్యకు కుట్ర

భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

మన తెలంగాణ/బోడుప్పల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలు తన ప్రియుడు, స్నేహితులు కలిసి భర్తను చంపింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… బోడుప్పల్ లోLR తూర్పు బృందావన్ కాలనీలో వి జె అశోక్ (45) తన భార్య పూర్ణిమ(36), కొడుకుతో నివాసం ఉంటున్నారు. అశోక్ శ్రీనిధి విశ్వవిద్యాలయంలో లాజిస్టిక్ మేనేజర్ గా, భార్య పూర్ణిమ ఇంటి దగ్గరే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.తన భార్య పూర్ణిమ,గతంలో అదే కాలనీలో నివాసం ఉన్న ప్రియుడు భవన నిర్మాణ కార్మికుడు పాలేటి మహేష్ తో అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్న భర్త తన భార్యను ప్రశ్నించడం వేధించడం ప్రారంభించాడు. దీని కారణంగా తన భార్య ప్రియుడుతో కలిసి భర్తను అంతమొందించడానికి కుట్రపన్నారు. ప్రియుడి స్నేహితుడైన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూక్య సాయికుమార్ (22) సహాయంతో ఈనెల 11న తన భర్త పని నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మహేష్ ,సాయి కుమార్ అతని పట్టుకుని దాడి చేయగా భార్య అతని కాళ్లు పట్టుకుంది. మహేష్ మూడు చున్నీలతో మృతుడిని గొంతు కోసి హత్య చేశారు. హత్య తర్వాత నిందితుడు మృతుడి బట్టలు మార్చాడు. సాక్షాలు లేకుండా చేయడానికి వస్తువులను పడేశాడు. తన భర్త గుండెపోటు వల్ల మరణించాడని బంధువులను తప్పుదారి పట్టించింది. తన భర్త ఇంటి వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని మల్కాజ్గిరి ప్రభుత్వాసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మొదట్లో ఎలాంటి అనుమానం కలుగలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతదేహంపై అనుమానాస్పద గాయాలు కనిపించడం, చెంప, మెడపై గాయాలు కూడా ఉండడంతో మరణంపై కొంత అనుమానం రావడంతో సిసిటివి ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు ఆపిల్ ఫోన్ (ఏ2), రక్తంతో తడిసిన మూడు చున్నీలు, మరకలున్న చొక్కా బనియన్, మరణించిన వ్యక్తి విరిగిన పళ్ళు, నేరారూపణ చేసే ఫోటోలు, వీడియోలు ఉన్న ఒక పెన్ డ్రైవ్, ఫ్యాషన్ ప్రో 2 వీలర్ బైక్ (ఏ 3), రక్తపు మరకలు ఉన్న ప్యాంటు చొక్కా (ఏ3) ఆధారాలతో ఏ1 తన భార్య పూర్ణిమ, ఎ2 పాలేటి మహేష్ , ఎ3 భూక్య సాయికుమార్‌గా నిందితులుగా గుర్తించారు. కేసును సెక్షన్ 194 బిఎన్‌ఎస్‌ఎస్ నుండి సెక్షన్ 103(1),238 ఆర్/డబ్ల్యూ 3(5) బిఎన్‌ఎస్ కు మార్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ఐపిఎస్ నాయకత్వంలో మల్కాజిగిరి జోన్ డిసిపి సిహెచ్ శ్రీధర్, మల్కాజ్గిరి డివిజన్ ఎసిపి ఎస్ చక్రపాణి, ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసును గుర్తించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరెడ్డి , ఎస్ఐ నర్సింగరావు, ఉదయ భాస్కర్, సిబ్బంది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తాం

మన తెలంగాణ/మోత్కూర్: గ్రామాలకు వచ్చే నిధులన్నింటినీ గ్రామాల అభివృద్ధికి వినియోగించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తామని నూతన సర్పంచులు ప్రకటించారు. మోత్కూరు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఆయా గ్రామపంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయించగా బాధ్యతలు స్వీకరించారు. దాచారం సర్పంచ్ కర్నె జ్యోతివీరేశంతో తహసీల్దార్ జ్యోతి, పాటిమట్ల సర్పంచ్ బండ రమవిజయరెడ్డితో ఏవో కీర్తి, సదర్శాపురం సర్పంచ్ మునుకుంట్ల నీలకంఠంతో ఇరిగేషన్ఏ ఈ అఖిల్,  అనాజిపురం సర్పంచ్ బీసు వెంకటయ్యతో ఎంఈవో టి. గోపాల్ రెడ్డి, పొడిచేడు సర్పంచ్ జిట్ట సైదులుతో ఈ ఈ మంగులాల్, దత్తప్పగూడెం సర్పంచ్ గుండు యాదగిరితో ఎంపీవో జనార్దన్ రెడ్డి, పాలడుగు సర్పంచ్ అంతటి భగవంతుతో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, ముశిపట్ల సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డితో పీఆర్ ఏఈ శివ, పనకబండ సర్పంచ్ లోతుకుంట రేణుకఅనిల్ కుమార్తో ఎంపీడీవో బాలాజీనాయక్, రాగిబావి సర్పంచ్ మెండు శ్రీవాణి చంద్రశేఖర్రెడ్డితో ఎంపీవో జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో పాటు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీల నూతన పాలకవర్గ సభ్యులను నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పని చేయడంతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చేస్తామని ప్రకటించారు.