elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbet girişaresbet girişteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetpadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalmisliwinpuntobahismisliwin girişmisliwinpuntobahisatlantisbahisatlantisbahis girişatlantisbahishepsibethepsibet girişpumabetpumabet girişluxbetluxbet girişaresbetaresbet girişsüratbetsüratbet girişsüratbetyakabetyakabet giriş

15 ఏళ్ల తర్వాత కోహ్లీ మ్యాచ్.. ఫ్యాన్స్‌కి నిరాశే

బెంగళూరు: టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ త్వరలో డొమెస్టిక్ క్రికెట్‌లో తిరిగి అడుగు పెట్టనున్నాడు. దాదాపు 15 సంత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ పాల్గొననున్నాడు. చివరిసారి ఫిబ్రవరి 18, 2010లో ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఆడాడు. మళ్లీ ఇన్నాళ్లకు దేశవాళీ టోర్నమెంట్‌లో కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోమవారం రాత్రి విరాట్ బెంగళూరుకు చేరుకున్నాడు.

చిన్నస్వామి స్టేడియంలో జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ అన్ని ఫ్యాన్స్‌ లేకుండానే నిర్వహించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండు స్టాండ్‌లు మాత్రమే తెలిచి 2 లేదా 3 వేల మంది అభిమానులను లోపలికి అనుమతించాలని కెఎస్‌సిఎ కోరగా.. ఆ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి నిరాకరించారు. గ్రేటర్ బెంగళఊరు అథారిటీ కమిషనర్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బెంగళూరు పోలీస్ కమీషనర్, అగ్నిమాపక, అత్యవసర శాఖలు, ఆరోగ్యశాఖతో కూడిన ఈ కమిటీ త్వరలో చిన్నస్వామి స్టేడియాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. దాని ఆధారంగా ప్రేక్షకుల అనుమతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

12 మంది పిల్లలు, 5 పందులు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్‌వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం విద్యార్థులు వరసలో నిలబడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను కెటిఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 12 మంది పిల్లలు. 5 పందులు అనే క్యాప్షన్ పెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగాయని, 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారని విమర్శించారు. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని కెటిఆర్ చురకలంటించారు. 

భర్తను చంపి…. గ్రైండర్‌లో ముక్కలు ముక్కలుగా చేసి మురికి కాలువలో శరీర భాగాలు పడేశారు

లక్నో: ప్రియుడితో కలిసి భర్తను చంపి గ్రైండర్‌లో ముక్కలుగా చేసి శరీర భాగాలను మురిక కాలువలో పడేసింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సంభాల్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  చందౌసిలోని మొహల్లా చున్నీలో రాహుల్, రుబీ అనే దంపతులు నివసిస్తున్నారు. గౌరవ్ అనే వ్యక్తితో రుబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18న భర్తను తన ప్రియుడితో కలిసి ఇనుప రాడ్‌తో కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని గ్రైండర్‌లో వైసి ముక్కలు ముక్కలు చేశారు. ఈడ్గాలోని మురికి కాలువలో శరీర భాగాలను పడేశారు. మరికొన్ని శరీర భాగాలు రాజ్‌ఘాట్‌లోని గంగా నదిలో పడేశారు. తన భర్త కనిపించడంలేదని అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈడ్గాలోని మురికి కాలువలో డిసెంబర్ 15న శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక శరీర భాగంపై రాహుల్ పేరు ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్ భార్య రూబీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కుళ్లిపోయిన శరీర భాగాలకు డిఎన్‌ఎ పరీక్షలు చేయించారు. రాహుల్‌దే మృతదేహం అని గుర్తించారు. రూబీని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

గిల్, సూర్యల మధ్య చాలా తేడాలు ఉన్నాయి: కైఫ్

టెస్ట్, వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మాన్ గిల్.. టి-20 ఫార్మాట్‌లో మాత్రం రాణించలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన టి-20 సిరీస్‌లో అతను ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ కారణంగానో.. లేక ఇతర కారణాల వల్లనో టి-20 ప్రపంచకప్‌ – 2026 కోసం ప్రకటించిన జట్టులో గిల్‌ను పక్కన పెట్టారు సెలక్టర్లు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా నిరాశపరుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని కొనసాగించి.. గిల్‌పై వేటు వేయడాన్ని కొందరు తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ స్పందించారు. గిల్, సూర్యల మధ్య చాలా తేడాలు ఉన్నాయని ఆయన అన్నారు.

‘‘టి-20ల్లో సూర్య మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. ఐసిసి ర్యాంకింగ్స్‌లో అతడు టాప్-10లో ఉన్నాడు. ఎన్నో మ్యాచుల్లో భారత్‌ను ఒంటి చేత్తో గెలిపించాడు. కాబట్టి సూర్యను గిల్‌తో పోల్చలేము. గిల్ అంతర్జాతీయ టి-20ల్లో తనను తాను ఇంకా నిరూపించుకోవాలి. ఉదాహరణకు కోహ్లీ విషయమే చూస్తే.. కొవిడ్ సమయంలో ఆ రెండేళ్ల పాటు పెద్దగా పరుగులు చేయలేదు. కానీ, అంతకు ముందు అతడికి గొప్ప రికార్డు ఉంది. 10 సంవత్సరాల పాటు మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీకి మద్ధతుగా నిలవగా.. పేలవ ఫామ్‌ నుంచి బయటపడి మళ్లీ తిరిగి భారీ స్కోర్లు చేయడం ప్రారంభించాడు. సూర్య కూడా ప్రస్తుతం ఇదే కేటగిరీలో ఉన్నాడు. టి-20 ఫార్మాట్‌లో సూర్యకు గిల్ ఎక్కడా చేరువలో లేడు. ఫామ్‌లో లేని ఇద్దరిని జట్టు నుంచి తొలగించాలని అనడం సరికాదు’’ అని కైఫ్ పేర్కొన్నారు.

బాక్సింగ్‌ డే టెస్ట్.. ఆసీస్ జట్టులో కీలక మార్పులు

యాషెస్ సిరీస్ 2025-26లో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్‌పై మూడు మ్యాచుల్లో నెగ్గి.. 3-0 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్ట్ కోసం ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు చేసింది. ఈ మ్యాచ్‌కి రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరమయ్యాడు. అతడి స్థానంలో స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అనారోగ్యం కారణంగా మూడో టెస్ట్‌కు చివరి నిమిషంలో దూరమైన స్మిత్.. ఇప్పుడు తిరిగి పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు.

ఇక కమ్మిన్స్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లియోన్ కూడా అందుబాటులో లేడు. మూడో టెస్ట్‌లో లియోన్ తొడ కండరాల భాగంలో గాయమైంది. దీంతో అతడు ఆఖరి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ జట్టులోకి వచ్చాడు. లియోన్ గైర్హాజరీలో మర్ఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో మాట్ కుహ్నెమాన్, కోరీ రోచిసియోలి వంటి స్పిన్నర్లను పక్కన పెట్టి మర్ఫీ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. ఒక కమ్మిన్స్ స్థానంలో జే రిచర్డ్‌సన్‌కు జట్టులో చోటు దక్కింది. రిచర్డ్‌సన్ చివరిగా 2021లో ఆసీస్ తరఫున ఆడాడు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అతడు తిరిగి జట్టులోకి వచ్చాడు.

పేట్ బషీరాబాద్ లో విద్యార్థిపై టెన్ విద్యార్థులతో దాడి చేయించిన ప్రిన్సిపాల్

కొంపల్లి:  హైదరాబాద్‌ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం వెలుగులోకి వచ్చింది. తన మాట వినడం లేదని ఓ విద్యార్దిని 10వ తరగతి విద్యార్ధులతో విచక్షణారహితంగా ప్రిన్సిపాల్ కొట్టించాడు. కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి విద్యార్ధి సూర్యను 10వ తరగతి విద్యార్థులు చితకబాదారు.  తన మాట వినడం లేదని సూర్యను 10వ తరగతి విద్యార్ధులతో విచక్షణారహితంగా దుండిగల్ ఇంచార్జ్ ఎంఇఒ, కొంపల్లి పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ కొట్టించినట్టు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

అదంత ఈజీ కాదు.. కావాలంటే ఇంగ్లండ్‌ జట్టును అడగండి: రోహిత్ సెటైర్లు

ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ అత్యంత ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమిపాలై సిరీస్‌ని చేజార్చుకుంది. ఏ విభాగంలోనూ ఆసీస్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ జట్టుపై ఘోరంగా సెటైర్లు వేశాడు. గురుగ్రామ్‌లో జరిగిన మాస్టర్స్ యూనియన్ స్నాతకోత్సవానికి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో మరుపురాని మైలురాళ్లను రోహిత్ గుర్తు చేసుకున్నాడు.

అందులో భాగంగా 2021లో గబ్బా వేదికగా ఆసీస్‌పై విజయం సాధించిన మ్యాచ్ గురించి రోహిత్ ప్రస్తావించాడు. ‘ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవడం అంత ఈజీ కాదు. కావాలంటే ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆడగండి’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘2021 గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మేం (భారత్) గెలిచాము. రిషబ్ పంత్ అద్భుతంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. మేము గెలుస్తామని ఎవరూ నమ్మలేదు. ఆ స్థితి నుంచి పుంజుకొని టీం ఇండియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో మేం అనుకున్న ఆటగాళ్లు గాయలు, ఇతర కారణాల వల్ల అందుబాటులో లేదు. ఆ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ చేసిన కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్‌లో ఒకటి మమ్మల్ని ఆలోచనలో పడేసింది’’ అని రోహిత్ అన్నాడు.

‘‘మ్యాచ్ ప్రారంభమైనప్పుడు తుది జట్టులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లు ఉన్నారు. గబ్బా ఆసీస్‌కి కంచుకోట. అప్పటి వరకూ అక్కడ ఆసీస్‌కి ఓటమి లేదు. కానీ, గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి మేం పుంజుకొని మ్యాచ్‌లో విజయం సాధించాం. టెస్ట్ క్రికెట్ ఆడటం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఆస్ట్రేలియాలో ఆడటం కఠనమైన సవాలు. కావాలంటే మీరు ఇంగ్లండ్ ఆటగాళ్లను అడగండి. గబ్బాలో విజయం సాధించి. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం మాకు గొప్ప అచీవ్‌మెంట్’’ అని రోహిత్ అప్పటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు.

స్వరం మార్చిన మోడీ

బిజెపి ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తన స్వరం మార్చారు. పొరుగు దేశాల నుంచి సరిహద్దులు దాటుకుని చొచ్చుకు వస్తున్న చొరబాటుదారుల సమస్యపైన, ఎన్నికల కమిషన్ ఆదేశాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్‌ఐఆర్) ను సమర్థించడం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి వాటినే తమ ప్రచారానికి ప్రధాన ఇంధనంగా వాగ్బాణాలు కురిపిస్తున్నారు. అంతేకాదు విపక్ష పాలిత రాష్ట్రాల్లో తుపాకులు ఎక్కుబెట్టి అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం తప్పనిసరి అని బెదిరిస్తున్నారు. ‘జంగిల్‌రాజ్’ (ఆటవిక పాలన) అనే బెదిరింపుతో బీహార్‌లో ఏ విధంగా ఓట్లను కొల్లగొట్టి గెలుపొందారో అనే రీతిలో విపక్ష రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో జంగిల్‌రాజ్ బూచి చూపించి బెదిరిస్తున్నారు. చొరబాటు సమస్యపై మోడీ ఒక్కరే ఆందోళన చేస్తున్నట్టు కాదు, దాని ప్రభావం మొదటిసారి స్థానిక జనాభాపై చూపించింది. ఈ ఏడాది మొదట్లో జార్ఖండ్‌లో మోడీ ప్రయోగించిన ఏకైక అతి ముఖ్యమైన ప్రచార థీమ్ ‘చొరబాటుదారుల సమస్య’ ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న చొరబాటుదారుల వల్ల స్థానిక జనాభాకు ఒక బెదిరింపుగా మారింది.

ఈ ప్లాను ఎన్నికల్లో వర్క్‌అవుట్ కానప్పటికీ గిరిజన ప్రజలు ఎక్కువగా నివసించే సరిహద్దు రాష్ట్రం అంత ఆసక్తిగా స్పందిచనప్పటికీ, రాబోయే ప్రమాదం ఉందని మోడీ హెచ్చరించారు. ఇప్పుడు ఆ థీమ్‌నే తదుపరి గమ్యస్థానానికి తీసుకెళ్తున్నారు. బిజెపి తన పార్టీ అజెండాలో రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అక్కడ కొన్ని చొరబాట్లను చూపించడంలో కొంతవరకు పురోగమించగలిగింది. ఇతర రాష్ట్రాలతో సమానంగా సుస్థిర అభివృద్ధిని పార్టీ సాధించలేని పరిస్థితుల్లో అక్కడ గెలుపొందడానికి వేరే మార్గాలను అనుసరిస్తోంది. పశ్చిమబెంగాల్ విషయంలో ఎలాగైనా ఓట్ల బ్యాంకును కొల్లగొట్టాలన్న వ్యూహంతో అక్రమ చొరబాటుదారులకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఇస్తోందని అందుకే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను అడ్డుకుంటోందని మోడీ పెద్ద అభాండం వేశారు. దీనికి తోడు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలు తున్నాయని, ఇది మహాజంగిల్ రాజ్ వంటి పరిస్థితి అని ఆరోపించారు. కానీ ఓటర్ల జాబితా సవరణ విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగానే ఉన్నారు. సవరణ పేరుతో భారీ ఎత్తున ప్రజల ఓటు హక్కును కాజేస్తున్నారని, ప్రత్యేకించి మైనారిటీలు, పేదల ఓటు హక్కు కోల్పోతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఓటర్ల సవరణ మొదటి జాబితాలో తొలగించిన ఓటర్ల పేర్లను పరిశీలిస్తే మాతువా సామాజిక వర్గానివే ఎక్కువగా ఉన్నాయి.

హిందూ నామసుద్రలకు చెందిన వీరంతా బంగ్లాదేశ్ (నాటి తూర్పు పాకిస్తాన్) నుంచి పశ్చిమబెంగాల్‌కు 1947లో ఎప్పుడో తరలివచ్చారు. ఉత్తర 24 పరగణాలు, నాడియా, హౌరా, కూచ్ బీహార్ తదితర సరిహద్దు జిల్లాల్లో వీరు ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లో రెండో భారీ షెడ్యూల్డ్ కులంగా మాతువా సామాజిక వర్గం ఉంటోంది. వీరు ఓటు హక్కు కోల్పోవడంపై ప్రధాని మోడీ ఇంతవరకు ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఇప్పుడే కాదు 2019, 2021లో ప్రధాని మోడీ ఈ ప్రాంతానికి వచ్చినా వారి పౌరసత్వం గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో బిజెపికి మద్దతు పలికిన ఈ సామాజిక వర్గం ఎస్‌ఐఆర్ మొదటి దశ తరువాత ఓటర్ల జాబితా నుంచి భారీ సంఖ్యలో వీరి పేర్లు తొలగించబడ్డాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం తొలగించిన ఓటర్ల పేర్లలో అనేక మంది పేర్లు ఉనికిలో లేకపోవడం కానీ, లేదా వారి తల్లిదండ్రుల పేర్లు అయినా 2002 నాటి జాబితాలో కనిపించలేదని చెబుతోంది. అయితే మాతువా సామాజిక వర్గం తమ ఓటు బ్యాంకుగా పరిగణించిన బిజెపి, మాతువాలకు, ఇతర బంగ్లాదేశ్ శరణార్థులకు చట్టం ప్రకారం పౌరసత్వం కల్పించేందుకు బిజెపి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.

ఓటర్ల జాబితాలో వీరిని చేరుస్తామని బిజెపి భరోసా ఇస్తున్నా ఇంకా వారిలో నమ్మకం కలగడం లేదు. ఎస్‌ఐఆర్ నుంచి తమ ఓటు హక్కు తొలగించారని మాతువా లోని ఒక వర్గం ఠాకూర్ నాయకత్వంలో ఆందోళన చేపట్టింది. చొరబాటుదారులన్నది పెద్ద సమస్యే. చొరబాటుదారులకు ఓటు హక్కు ఉండాలని ఎవరూ వాదించరు. కానీ దేశ పౌరులను గుర్తించడానికి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)ప్రక్రియను వినియోగించి వారి పేర్లు లేవని, పౌరులు కారని వారి పేర్లను తొలగించడమే రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాని విధానం. ప్రధాని మోడీ చొరబాటుదారుల ఓటరు జాబితాను ప్రక్షాళన చేయడంలో ఎస్‌ఐఆర్ అత్యంత సామర్థాన్ని చూపిస్తోందని పదేపదే ప్రశంసిస్తున్నారు.

కానీ దీనివల్ల ఎస్‌ఐఆర్ అంటే జాతీయ పౌరుల జాబితా తయారీ విధానాన్ని మరో మార్గంలో అమలు చేస్తున్నారని ఒక వర్గం వారికి భయాందోళనలను రేకెత్తిస్తూ మరిన్ని ఆత్మహత్యలకు దారితీస్తోంది. మరింత ఆందోళనకరంగా మైనారిటీల పట్ల అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరించేలా ప్రోత్సహించే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన ఉద్దేశాలను స్పష్టంగా తేటతెల్లం చేయగలగాలి. చొరబాట్లను పదేపదే సూచించడం పారదర్శకం కాదు. పశ్చిమబెంగాల్‌ను ప్రధాని మోడీ జంగిల్‌రాజ్‌గా పోల్చి ప్రచారం చేయడం కూడా అత్యంత వివాదాస్పదమే. బీహార్‌లో శాంతిభద్రతలు పేలవం అన్న అంశం బాగానే ఆకట్టుకున్నా, పశ్చిమబెంగాల్‌లో అలాగే ఆ థీమ్‌ను స్వాగతిస్తారన్నది ప్రశ్నార్థకం. విచిత్రంగా తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే థీమ్‌తో ఇదివరకటి వామపక్ష ప్రభుత్వ పాలనలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చట్టబద్ధపాలన అనే ఆలోచనను కూల్చివేసిందని ఆరోపిస్తోంది. 

ఉపాధి హామీ పథకంపై నీలినీడలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ) స్థానంలో వికసిత్ భారత్ -రోజ్ గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) 2025 లేదా జి రామ్ జి బిల్లు పై చర్చ సాధారణస్థాయిని మించి సాగుతోంది. ఈ పథకం రాజ్యాంగ సూత్రాలు, ఫెడరల్ వ్యవస్థాపరమైన సంబంధాలు, సంక్షేమ పరమైన ఆర్థిక అంశాలు, రాజకీయ ప్రతివాదంతో పాటు లక్షలాది గ్రామీణ కార్మికుల జీవన వాస్తవికతతో ముడిపడి ఉంది. ఇది కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రానున్న దశాబ్దాలలో భారతదేశం తన పేద పౌరులతో ఎటువంటి సామాజిక సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటోంది అన్నదే కీలక ప్రశ్న. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎంఎన్‌ఆర్ ఇజిఎ భారతదేశంలో అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమంగా సాగుతోంది. గ్రామీణ పేదలకు ఏటా కనీసం 100 రోజుల పనిని హామీగా కల్పిస్తోంది. దేశంలో పరిమిత ఉపాధి అవకాశాలు ఉన్న రాష్ట్రాలలో ఈ పథకం కీలక పాత్ర వహిస్తోంది. ముఖ్యంగా ఈశాన్య భారతంలో, పారిశ్రామిక పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉండి, వేతన ఉపాధి కాలానుగుణంగా ఉండే రాష్ట్రాలకు ఇది జీవనాధారంగా ఉంది.

ఈ పథకం కొనుగోలు శక్తిని బలోపేతం చేసింది. కష్టాలను తీర్చింది, వలసలను తగ్గించింది. ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యానికి మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా కొవిడ్ -19 వంటి సంక్షోభ సమయంలో ఆదాయ భద్రతను అందించింది. అయితే, ప్రస్తుతం ఎంఎన్‌ఆర్ ఇజిఎ పథకం అనిశ్చిత స్థితిలో ఉంది. దీనిని చక్కదిద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నం పలు ఆర్థికపరమైన, పాలనాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సైద్ధాంతిక, సాంకేతిక ప్రశ్నలనూ లేవనెత్తుతోంది. పేదల సంక్షేమ హక్కుగా ఉన్న పథకానికి మహాత్మాగాంధీ పేరుమార్పు కేవలం విధానపరమైన మార్పేనా. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న హిందుత్వ విధానాల కారణంగా, రాజకీయ సాంసృ్కతికపరమైన నేపథ్యం ఏమయినా ఉందా. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. అన్నవే ఆ ప్రశ్నలు. ఈ వ్యాసం భారతదేశంలో గ్రామీణ సమాజం, రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఇతర అంశాలను చర్చించడంతో పాటు ప్రమాదంలో పడిన సమస్యను పరిశీలిస్తుంది. ఎమ్‌ఎన్‌ఆర్ ఇజిఎ పథకం అమలు వల్ల ఎన్నో ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగాయని కార్తీక్ మురళీధరన్, పాల్ నీ హాస్, సందీప్ సుఖ్తంకర్ వంటి నిపుణులు పదేపదే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంవల్ల గ్రామీణుల ఆదాయం దాదాపు 14% పెరిగిందని, పేదరికం దాదాపు 26% తగ్గిందని క్షేత్రస్థాయిలో అధ్యయనాల ఆధారంగా నిరూపించారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల వేతనస్థాయి పెరిగింది. మార్పు వచ్చింది. వ్యవసాయ కూలీలు, కార్మికుల బేరసారాల శక్తిని పెంచింది. ఈ పథకం వల్లనే వారికి డిమాండ్, గౌరవం పెరిగింది. గ్రామీణ పేదలకు ఎంపిక చేసుకునే అవకాశం కలిగింది.

ఉపాధి హామీ పథకం భారతదేశంలో అత్యంత సంక్షోభ సమయంలో నివారణమంత్రంగా పనిచేసింది. ముఖ్యంగా కొవిడ్ -19 మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాదిమందికి సురక్షితమైన జీవనోపాధిగా మారింది. అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలలో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి.ప్రైవేటు ఉపాధి అవకాశాలూ తక్కువే. ఏడాది పొడవునా వ్యవసాయం ఉండదు, అలాంటి రాష్ట్రాలలో ఈ మహాత్మాగాంధీ పథకం ఆర్థికపరమైన స్థిరీకరణ శక్తిగా పనిచేసింది. పేదల ఆకలి తీర్చేందుకు అవసరమైన వేతనాలను అందించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పేదలకు అన్ని విధాలా అండగా నిలిచింది. అటువంటి పథకాన్ని నీరుగార్చడం అంటే, స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన సామాజిక హామీని అణచివేయడమేనని విమర్శకులు అంటున్నారు.

ఎంఎన్‌ఆర్‌ఇజిఎ స్థానే -జి రామ్ జి -భర్తీ చేయడానికి ప్రభుత్వం మూడు కారణాలు చెబుతోంది. మొదటిది. ఈ పథకం కింద పెరిగిన వేతనాలు, ఉత్పాదకతను మించిపోయాయి. ఇది ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని పెంచింది. రెండవది. ఉపాధి హామీ పథకం కారణంగా వ్యవసాయ కార్యకలాపాలకు కార్మికులు దూరమయ్యారు. ఫలితంగా వ్యవసాయంలో కార్మిక మార్కెట్ దెబ్బతింది. మూడవది- కార్మికులలో నైపుణ్యంపెంచి, ఉత్పాదకత ఆధారంగా అభివృద్ధి సాధించడం ద్వారా, భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు వీలుగా ఈ కార్యక్రమంలో సంస్కరణలు, దిశానిర్దేశం అవసరం. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జి రామ్ జి బిల్లు కొత్తబిల్లు హామీ పనిదినాలను 100 నుంచి 125కి పెంచుతుంది. అవకాశాలు విస్తరిస్తాయి. ఒకే విధమైన వేతనాలను ప్రవేశపెడుతుంది. కొత్త వర్గాలకు అందుబాటులో ఉంటుంది. కేంద్రీకృత స్థాయిలో శ్రామికశక్తి ప్రణాళికను ప్రతిపాదిస్తుంది. ఈ సంస్కరణలు 2005 నుంచి పెద్దగా అభివృద్ధి చెందని పథకానికి అవసరమైన, ఆధునీకరణను ప్రతిపాదిస్తున్నది. ఏదైనా పెద్ద ప్రజా కార్యక్రమానికి కాలానుగుణంగా సమీక్ష అవసరమనే వాదన ఉండనే ఉంది.

కొత్త బిల్లు పథకం ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ హక్కుల ఆధారితమైన పథకం.పనిని డిమాండ్ చేసి పొందవచ్చు. లేకుంటే, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఇది నిర్దేశిస్తుంది. కొత్త బిల్లులో ఈ అవకాశం లేదు. డిమాండ్ ఆధారిత ఉపాధిని కేంద్రీకృత లక్ష్యాలు, బడ్జెట్ పరమితులు నిర్దేశిస్తాయి. ఈ మార్పు చట్టపరమైన హక్కును సంక్షేమ రాయితీగా మార్చే ప్రమాదం ఉంది. ఆర్థికవేత్త ప్రతాప్ భాను మెహతా హెచ్చరించినట్లుగా ఈ సంస్కరణలు ఉపాధి హామీ పథకం సాధించిన మార్పును దెబ్బతీయవచ్చు. గ్రామీణ పేదల సాధికారత కోసం కాక, శ్రమను హక్కుగా చెప్పుకునే అవకాశం ఉంది.

ఉపాధి హామి పథకం పేరు మార్పు సంచలనంగా మారింది. శ్రమకు గౌరవం కల్పించే కార్యక్రమానికి గాంధీ పేరు మార్చడం రాజకీయ పరమైన ప్రతీకవాదమే. ఈ నిర్ణయం వెనుక హిందూత్వ ఉద్దేశం ఉందా.. అన్నది ప్రశ్న. సంస్థలు, స్టేడియాలు, పథకాలు నగరాల పేర్ల మార్పు మాదిరిగానే, కొత్త సామాజిక జాతీయవాద దృక్పథానికి అనుగుణంగా ఉపాధి పథకం పేరు మార్పు జరిగింది అనుకోవచ్చు. గాంధీని బహిరంగంగా గౌరవించినా, ప్రస్తుత సర్కార్‌కు రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. ముఖ్యంగా బిజెపి సైద్ధాంతిక సూత్రాలకు చుక్కెదురు. గాంధీ పేరును వికసిత్ భారత్‌తో భర్తీ చేయడం ప్రధాని మోడీ రాజకీయపరమైన ఆలోచనే. ఇది ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో తీసుకువచ్చిన మార్పునకు తామే కారణమని క్లయిమ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. హిందూత్వ కోణం ఉన్నా లేకున్నా, పథకంపై క్లయిమ్ చేసుకోవడానికే అన్నది సుస్పష్టం. మహాత్మాగాంధీ ఉపాధి పథకం కేంద్రానికి రాజకీయంగా అసౌకర్యంగా ఉంది. పెద్ద పథకం, పెద్దఖర్చు, గ్రామీణ పేదలే నడుపుతున్నది. ఇది పంచాయితీలకు అధికారం ఇస్తుంది. కేంద్ర ఆదేశాన్ని బలహీనపరుస్తుంది. ఇది దళితులు, ఆదివాసీలు, మహిళలు, భూమిలేని కార్మికులతో సహా, అత్యంత అణగారిన వర్గాలకు అధికారాన్ని అందిస్తుంది. బిజెపి తన ఎన్నికల ప్రచారంలో ఈశాన్య రాష్ట్రాలపై గురిపెట్టింది. ఈ కార్మిక హామీని బలహీనపరచడం తీవ్ర సామాజిక, రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చు. అసోం, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్ లలో ఈ పథకంపై ఆధారపడిన గ్రామీణ కుటుంబాల ఆదాయం తగ్గడం, వలసలు పెరగడానికి దారితీయవచ్చు. ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ పథకానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రప్రభుత్వ ప్రభావాన్ని బలోపేతం చేస్తుంది.ఈశాన్య రాష్ట్రాలకు స్వతంత్ర ఆదాయ మార్గాలు లేవు. సంక్షేమ పథకాలకు అవి కేంద్రం మద్దతు పై ఆధారపడి ఉన్నాయి.

తీవ్ర ఆందోళన కలిగించే అంశం వ్యవసాయ సీజన్‌లో ఉపాధి స్తంభించే అవకాశం. పంటకోత కోసం కార్మికుల అవసరాలు తీర్చేందుకు, ఈ పథకం వీలు కల్పించవచ్చు. వ్యవసాయ ఆఫ్- సీజన్‌లో ఉపాధి హామీ వేతనాలు జీవనాధారంగా మారతాయి. అదే విధంగా, ఉపాధికి బయోమెట్రిక్ ప్రాతిపదిక కావడంతో కనెక్టివిడీ లేని ప్రాంతాలలో చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఫలితంగా, పరిమిత డిజిటల్ అక్షరాస్యత ఉన్న మహిళలు, వృద్ధ కార్మికులు, గిరిజనులు, వలసలకు వెళ్లే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం ఆర్థికంగానే కాక, సామాజికంగా కూడా విజయం సాధించింది. సంస్కరణపై చర్చ కేవలం, ఉత్పాదకత, ఆర్థిక క్రమశిక్షణ గురించి చెబుతున్నా, ఆ పథకం సాధించిన సామాజిక మార్పును గుర్తించడం లేదు. ఎంఎన్‌ఆర్ ఇజిఎ పథకం కేవలం ఆస్తులను సృష్టించలేదు. గ్రామీణులకు వాయిస్ ఇచ్చింది. లక్షలాది మంది గ్రామీణ మహిళలకు వేతన హక్కు డిమాండ్ చేసేలా నేర్పింది. మౌలిక సదుపాయాలను నిర్మించడంతో పాటు, మధ్యవర్తులను తగ్గిచింది. పని కల్పించడం రాష్ట్ర బాధ్యత అనే రాజకీయ సూత్రాన్ని స్థిరపరచింది. పథకం సాధించిన విజయాలను రాజకీయంగా, ఆర్థిక పరంగా తక్కువగా చూపడం చరిత్రాత్మకమైన తప్పిదమే.

సంస్కరణ అవసరం, నిర్మాణాత్మక మార్గంలో ఇవి అవసరం. రాష్ట్ర ఆర్థిక వాటా క్రమంగా పెంచడం, పారదర్శకత విధానాలను బలోపేతం చేయడం, సామాజిక తనిఖీలను పక్కన పెట్టకుండా రక్షించడం, ఆస్తి పెంచే వర్గాలను విస్తరించడం, ఎంఎన్ ఆర్ ఇజిఎ కింద నిర్మించిన మౌలిక సదుపాయలు దీర్గకాలిక అభివృద్ధికి ఉపయోగించాలి, నీటి నిర్వహణ, నీటి పారుదల, వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలి. ఈశాన్య రాష్ట్రాలలో ఇబ్బందులను పరిష్కరించాలి, భూమి, పర్యావరణ పరిరక్షణకు తగిన పథకాలు విస్తరించాలి. సౌకర్యవంతమైన వేతన చెల్లింపు వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. పారిశ్రామిక సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు ప్రాధాన్యత నిధులు అవసరం. అలాగే నిర్మాణాత్మకమైన మార్పు చేపట్టే ముందు రాష్ట్రాలను సంప్రదించాలి. ఫెడరల్ వ్యవస్థ సంస్కరణలకు అడ్డంకిగా మారకూడదు. చివరిగా, పేరు పెట్టడం ముఖ్యం. గాంధీ పేరును తొలగించడం నామ్ కే వాస్తేగా మారరాదు. సమగ్రమైన విధానం, దాని వ్యవస్థలు, లక్ష్యాలను నవీకరిస్తూ, పథకం చారిత్రక గుర్తింపును నిలుపు కోవాలి. ఉపాధి పథకం ప్రస్తుతం క్రాస్ రోడ్ దశలో ఉంది. అంటే మలుపు తిరిగిన దశలో ఉంది, సంస్కరణలు దాని విలువను మరింత పెంచవచ్చు. గాంధీ పేరును తొలగించడం మారుతున్న రాజకీయ దృక్పథాన్ని సూచిస్తోంది. ఈ కార్యక్రమం భారతదేశ సంక్షేమ నిర్మాణానికి మూలస్తంభంగా ఉండాలంటే, గ్రామీణ గౌరవం, పని చేసే హక్కును తిరిగి ధ్రువీకరించడంపై ఆధారపడి ఉంది. 

గీతార్థ పాఠక్

ఈశాన్యోపనిషత్ 

పొంచి ఉన్న యురేనియం ఉపద్రవం

భూగర్భజలాల్లో, బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు ఇటీవలి పరిశోధనల్లో బయటపడడం శాస్త్రవేత్తల నుంచి వైద్య నిపుణుల వరకు ఆందోళన కలిగిస్తోంది. దీని రేడియో థార్మిక ప్రభావం కన్నా దాని రసాయన విష ప్రభావమే ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యురేనియం స్థాయిలను తగ్గించడం ప్రభుత్వవర్గాలకు ఒక సవాలుగా మారింది. సహజంగా లభించే యురేనియం ఇటీవల దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు సార్లు బయటపడింది. దేశరాజధాని ఢిల్లీలో భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సిజిడబ్య్లుబి) అధ్యయనంలో తేలింది. బీహార్‌లో ఎఐఐఎంఎస్ పరిశోధకులు, మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ తల్లుల స్తన్య పాలల్లో కూడా యురేనియం అత్యధికంగా ఉన్నట్టు కనుగొన్నారు. ఈ రెండు అధ్యయనాలు ఈ యురేనియం స్థాయిలు పెరిగిపోతుండడాన్ని తీవ్రంగా పరిగణించి అత్యవసర చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీలో సేకరించిన 83 భూగర్భజలాల నమూనాల్లో 24 నమూనాలు బిఐఎస్ స్థాయిలకు మించి యురేనియం ఉందని సిజిడబ్లుబి వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లీటరు నీటిలో 30 మైక్రోగ్రాముల వరకు యురేనియం పరిమితి ఫరవాలేదు. సహజ యురేనియం వాయువ్య భారతం లోని రాళ్లల్లో ఉంటుంది. హైడ్రొలాజికల్ పరిస్థితుల్లో రాళ్లలోంచి కరిగికరిగి నీటివనరుల్లో చివరకు భూగర్భ జలాల్లో కలుస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయన ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల యురేనియం ఆహార గొలుసులోకి చేరుకునే అవకాశం ఉంది. దీని కచ్చితమైన మూలాన్ని తెలుసుకోవడానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు చేస్తోంది. నైట్రేట్, ఫ్లోరైడ్, స్లైనిటీ, భారీ లోహాలు కూడా అనేక ప్రాంతాల్లో ఎక్కువస్థాయిల్లో కనిపించాయి. దీనిని బట్టి నీటివనరులపై ఈ లోహ మూలకాల ప్రభావం పెరిగిందని బయటపడింది. బీహార్‌లోని ఆరు జిల్లాలకు చెందిన దాదాపు 40మంది బాలింతల తల్లిపాల నమూనాల్లో యురేనియం ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది. అన్ని నమూనాల్లో యురేనియం (యు238) ఉన్నట్టు ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన డాక్టర్ అశోక్‌వర్మ వెల్లడించారు. దీని గాఢత 0 నుంచి 5.25 మైక్రోగ్రాములు, లీటరు మధ్య నమోదైంది. దాదాపు 70% శిశువుల్లో యురేనియం ప్రభావం వల్ల అనేక అనారోగ్య సమస్యలువచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల అంచనా.అయితే బాలింతల పాలల్లో యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ వాటిని తాగే శిశివులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనివల్ల తల్లుల ఆరోగ్యం పైనా ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే బీహార్ బాలింతల పాలలో గుర్తించిన యురేనియం స్థాయిలు సురక్షితమైన పరిమితుల్లోనే ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన పరిమితి కంటే తాగునీటి లోనే దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా యూరేనియం స్థాయిలు ఉన్నాయని బయటపడింది. ముఖ్యంగా బీహార్‌లోని ఖగారియా జిల్లాలో యురేనియం సగటు స్థాయి అత్యధికంగా ఉండగా, కటిహార్‌లో ఒకే నమూనాలో అత్యధిక గాఢత నమోదైంది. అయితే తల్లిపాలలో యురేనియం స్వల్ప మోతాదులో ఉన్నప్పటికీ శిశువులకు ఎలాంటి ప్రమాదం ఉండదని మరికొందరు పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) తాగు నీటిలో యురేనియం కోసం నిర్దేశించిన పరిమితి 30 మైక్రోగ్రాములు/లీటరు. తల్లిపాల నమూనాల్లో లభించిన స్థాయి (గరిష్టంగా 5.25 మైక్రోగ్రాములు/ లీటరు) ఈ డబ్లుహెచ్‌ఒ ప్రమాణం కంటే చాలా తక్కువగా ఉంది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం తల్లి శరీరంలోకి చేరిన యురేనియంలో ఎక్కువ భాగం మూత్రం ద్వారానే బయటకు వెళ్లిపోతుంది. తల్లిపాల లోకి చేరే యురేనియం శాతం చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. భూగర్భజలాల్లో యురేనియం ఉన్నట్టయితే రేడియో ధార్మిక లక్షణాల కన్నా రసాయన కాలుష్యం ఎక్కువగా పెరుగుతుందని చెబుతున్నారు. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడుతుంది. యురేనియం గనుల్లో పనిచేసేవారికి, యురేనియం ప్రాసెసింగ్ ప్లాంట్లలో పనిచేసే వారికి మూత్రపిండాలు దెబ్బతినే సమస్య ఏర్పడుతుంది.

యురేనియం తక్కువ స్థాయిలో ఉన్న నీటిని తాగిన వారికి రేడియేషన్ కన్నా, రసాయన విష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఢిల్లీలోని భూగర్భజలాల్లో రేడియో థార్మికత బలహీనంగా కనిపించినా, మూత్రపిండాల కణాలపై దాని విష తీవ్రప్రభావమే దేశంలో తీరని సమస్యగా ఉంటోంది. యూరప్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యావరణ పరంగా ప్రేరేపితమైన మూత్రపిండాల వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా గాలి కాలుష్యం, కొన్ని రసాయనాలకు గురికావడం మూత్రపిండాల వ్యాధులకు దోహదం చేస్తున్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆహారం, తాగునీటిద్వారా యురేనియం లోపలికి ప్రవేశించడం సర్వసాధారణమే అయినప్పటికీ దుమ్ముధూళి పీల్చడం ద్వారా లేదా గాయపడిన చర్మం ద్వారా కూడా యురేనియం శరీరంలోకి ప్రవేశిస్తుంది. లోపలికి వెళ్లిన తరువాత ప్రధానంగా మూత్రపిండాలపైనే యురేనియం ప్రభావం మొదట కనిపిస్తుంది. ప్రధానంగా మూత్ర నాళికలను పాడు చేస్తుంది. దాంతో అవి పనిచేయకుండా పోతాయి. యురేనియం అత్యధిక స్థాయిల్లో ఉంటే క్రమేణా కాలేయం, ఊపిరితిత్తులు, నాడీవ్యవస్థలకు హాని కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఊపిరితిత్తుల్లో వాపు కనిపిస్తుంది. బరువు తక్కువ శిశువులు జన్మించడం లేదా నెలలు నిండకముందే ప్రసవించడం వంటి సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి. 

కె. యాదగిరి రెడ్డి 98667 89511