elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

న్యూజిలాండ్ కు నష్టం చేసే ఒప్పందం: విదేశాంగ మంత్రి విన్ స్టన్ పీటర్స్

భారతదేశం – న్యూజిలాండ్ మధ్య కొత్తగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆదేశపు విదేశాంగమంత్రి విన్ స్టన్ పీటర్స్ తీవ్రంగా విమర్శించారు. ఆ ఒప్పందం న్యాయంగాలేదు, స్వేచ్ఛ గా లేదు అన్నారాయన. పార్లమెంటులో చర్చ సందర్భంగా తమపార్టీ ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.తమ పార్టీ న్యూజిలాండ్ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుందని అంటూ, ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాల్సివచ్చినందుకు విచారిస్తున్నామని పీటర్స్ తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ల విషయంలో ఈ ఒప్పందం చాలా ఉదారంగా ఉందని, అంతే కాక, కీలకమైన పాడి పరిశ్రమ రంగంలో ఒప్పందం న్యూజిలాండ్ కు లాభదాయకంగా లేదని విన్ స్టన్ పీటర్స్ వాదించారు. ఏమైనా ఇది న్యూజిలాండ్ కు సంబంధించినంతవరకూ చెడ్డ ఒప్పందం అన్నారు. న్యూజిలాండ్ ప్రధాన పాల ఎగుమతులపై సుంకాలు తగ్గించేందుకు భారతదేశం అంగీకరించలేదన్నారు. ఇది న్యూజిలాండ్ రైతులకు నష్టదాయకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టులపై కెసిఆర్ పచ్చి అబద్దాలు: డికె అరుణ

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాజెక్టులపై పచ్చి అబద్దాలు చెబుతున్నారని బిజెపి ఎంపీ డికె అరుణ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత కెసిఆర్‌కు లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఆర్‌డిఎస్ కోసం పాదయాత్ర చేశానని చెబుతున్న కెసిఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. రాజోలిబండకు, రైతులకు తీరని అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్‌ను మార్చారని ఆమె విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి పదేళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. రెండేళ్ళ తర్వాత ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పాలమూరుకు అన్యాయం జరుగుతున్నదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరుకు కెసిఆరే కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు..‘పక్కా మాఫియా పాలన’: కెటిఆర్

తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. ‘పక్కా మాఫియా పాలన’ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు..నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్‌ల మీద జెలటిన్ స్టిక్స్‌తో బాంబులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ ‘ఇది మానవ నిర్మిత విధ్వంసం’ అని మొత్తుకుంటున్నా, ఈ ‘చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారని అన్నారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా.. ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా..? అని ప్రశ్నించారు.

భూగర్భ జలాలు పెరగాలని తాము చెక్ డ్యామ్‌లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా..? అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇప్పుడు మీ సమాధానం ఏంటి అని సిఎం రేవంత్ రెడ్డిని అడిగారు.అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు అంటూ సిఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే అని, లేదంటే ఈ బాంబుల సెగ సిఎం కుర్చీ దాకా రావడం ఖాయం అని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి..

హైదరాబాద్: విధులు ముగించుకుని వెళ్తున్న హోంగార్డును డిసిఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్, పిల్లర్ నంబర్ 192వద్ద మంగళవారం చోటుచేసుకుంది. టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సయిద్ అబ్దుల్ సత్తార్(40) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతోపాటు హసన్‌నగర్‌లో ఉంటున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా పివిఎన్‌ఆర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ వద్ద వేగంగా దూసుకుని వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో అబ్దుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతిచెందారు.

రెండంతస్తుల భవనం పై నుండి పడి ఎలక్ట్రిషన్ మృతి

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద నిర్మాణం లో ఉన్న రెండంతస్తుల భవనం పై నుండి పడి ఎలక్ట్రిషన్ వాజిద్ (32) మృతి చెందాడు. రెండంతస్తుల భవనంపై ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయి 32 ఏళ్ల ఎలక్ట్రిషియన్ చెందాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వాజిద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళల డ్రెస్సులపై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. సెలబ్రిటీలు ఫైర్

మహిళల డ్రెస్సులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ సెలబ్రిటీలు ఫైరవుతున్నారు. ఇప్పటికే శివాజీపై మాకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ నందినిరెడ్డి, నిర్మాత స్వప్నదత్, నటి మంచు లక్ష్మీ, ఝాన్సీ, సుప్రీయ యార్లగడ్డ.. శివాజీపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇక, హాట్ యాంకర్‌ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారని విమర్శించారు. “ఎవరికి నచ్చిన డ్రెస్‌ వాళ్లేసుకుంటారు.. నచ్చినట్టు తింటారు.. నచ్చిన డ్రెస్‌ వేసుకుంటారు” అంటూ ఫైరయ్యారు అనసూయ.

కాగా, ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ.. మహిళల డ్రెస్సింగ్ మాట్లాడుతూ.. అమ్మాయిలు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారని.. అందంగా కనిపించడానికి.. సామాన్లు కనిపించేలా సగం సగం దుస్తులు వేసుకోవద్దని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

స్పష్టమైన విధివిధానాలతో ముందుకెళ్తున్నాం: సిఎం రేవంత్

హైదరాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని.. రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం.. ప్రణాళికలు రూపొందించుకున్నాం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో అన్ని విభాగాల కార్యదర్శులతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. గతంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ పాలసీలు లేవని అన్నారు. అందువల్ల అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ముఖ్యమైన విభాగాలకు పాలసీలు తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ విడుదల చేశామని అన్నారు.

రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని సిఎం తెలిపారు. స్పష్టమైన విధి విధానాలతో ముందుకెళ్తున్నామని.. గొప్ప కార్యాచరణ అమలుకు అధికారుల సహకారం ఉండాలని అన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. ప్రతి నెల కార్యదర్శుల పని తీరుపై సిఎస్ సమీక్ష నిర్వహిస్తారని.. ప్రతి నెల కార్యదర్శులు.. సిఎస్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి కార్యదర్శుల పని తీరుపై తానే స్వయంగా సమీక్షిస్తానని అన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని పని చేయడం కీలకమని.. అభివృద్ధి విషయంలో సమన్వయం కోసం మెకానిజం ఉండాలని తెలిపారు. 

చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో కోహ్లీ

టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డుల గని. తన కెరీర్‌లో విరాట్ ఎన్నో అనితరసాధ్యమైన రికార్డులను బద్దలుకొట్టాడు.. సృష్టించాడు కూడా. టి-20, టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కోహ్లీ సిద్ధమవుతున్నాడు. అయితే కోహ్లీ ఎదుట మరో రికార్డు ఎదురుచూస్తోంది.

విరాట్ కోహ్లీ దాదాపు 15 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ అడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ టోర్నమెంట్‌లో బరిలోకి దిగనున్నాడు. అంధ్ర జట్టుతో డిసెంబర్ 24న మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 14,557 వన్డే పరుగులు ఉన్నాయి. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓవరాల్‌గా 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆంధ్రతో జరిగే మ్యాచ్‌లో 1 పరుగు చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు విరాట్. తద్వారా ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో కోహ్లీ కంటే ముందు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సచిన్ లిస్ట్-ఎ ఖాతాలో 21,999 పరుగులు ఉన్నాయి.

ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. టి-20ల్లో ప్రపంచరికార్డు

సాధారణంగా హ్యాట్రిక్ సాధిస్తే.. దాన్ని ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటారు బౌలర్లు.. అతడి టీమ్. మరి ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీస్తే.. అంతేకాక.. అదే ఓవర్‌తో మొత్తం మ్యాచ్‌నే గెలిపిస్తే.. ఆ ఆనందాన్ని అవుధులు ఉండవు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఇండోనేషియా-కంబోడియా మధ్య జరిగిన టి-20 మ్యాచ్‌లో జరిగింది. ఇండోయానేషియా బౌలర్ గ్రెడే ప్రియాందన ఈ మ్యాచ్‌లో సంచలనం సృష్టించాడు. టి-20ల్లో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. అంతేకాక.. తాను వేసిన తొలి ఓవర్‌లోనే ఈ ఫీట్ సాధించడం గమనార్హం.

బాలి వేదికగా మంగళవారం కంబోడియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా తొలుత బ్యాటింగ్ చేసి 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో కంబోడియా 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టంగానే కనిపించింది. కానీ, అప్పుడే గ్రెడే ప్రియాందన ఎంటరయ్యాడు. 16వ ఓవర్‌లో తొలి మూడు బంతులకే ముగ్గురిని ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత బంతి డాట్ బాల్ అయింది. ఆ తర్వాతి రెండు బంతుల మధ్యలో ఒక వైడ్ వేసి రెండు వికెట్లు తీశాడు. దీంతో కంబోడియా 107 పరుగులకే ఆలౌట్ అయింది. పలితంగా ఇండోనేషియా ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇదే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ప్రియాందన 11 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేశాడు. అయితేనేం బంతితో కంబోడియా బ్యాటర్లను వణికించాడు. 1 ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది అంతర్జాతీయ టి-20ల్లో తొలి బౌలర్‌గా నయా చరిత్ర లిఖించాడు. గతంలో ఇలాంటి ఫీట్ కేవలం దేశవాళీ క్రికెట్‌‌లో కేవలం రెండు సానకలు మాత్రమే నమోదైంది. 2013-14లో విక్టరీడే టి-20 కప్‌లో యుసిబి-బిసిబి మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ అల్ మీన్ హోస్సేన్ ఒకే ఓవర్‌లో ఐధు వికెట్లు తీశాడు. ఇక 2019-20లో సయ్యద్ మస్తాద్ అలీ ట్రోఫీలో కర్ణాటక ఆటగాడు అభిమన్యు మిథున్ హరియాణాపై ఈ ఘనతను సాధించాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ప్రియాందనదే తొలి రికార్డు.IDROVISIA

అతిగా వ్యవహరించే పోలీసులను వదిలిపెట్టేదే లేదు: హరీశ్

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రంలో సిట్‌లు ఒక ప్రహసనం అయ్యాయని ఎద్దేవా చేశారు. డిఫెన్స్‌లో పడింది కాబట్టి నాకు నోటీసు ఇస్తారట అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట అని.. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎపిలో ఏం జరిగిందో అందరూ చూశారు కాదా అని.. రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.

తమకు త్యాగాల చరిత్ర ఉందని.. అరెస్టులకు భయపడేది లేదని హరీశ్ స్పష్టం చేశారు. అరెస్టు చేస్తే చేసుకోండి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్‌లో రాస్తున్నామని.. అక్రమాలు, అరాచకాలు, సెటిల్‌మెంట్లు అన్ని నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారిని గమనిస్తున్నామని అన్నారు. అతిగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా, కేంద్ర సర్వీసులకు వెళ్లినా పట్టుకొస్తామని హెచ్చరించారు.