kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetnitrobahisnitrobahis girişnitrobahis güncel girişkingbettingkingbetting girişkingbetting güncel girişgrandbettinggrandbetting girişgrandbetting güncel girişultrabetultrabet girişultrabet güncel girişpadişahbetpadişahbetyakabetyakabetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxroyalbetroyalbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabet

యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.10 కోట్లు

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయం రూ.2,10,04,942 వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. మంగళవారం కొండ కింద గల వ్రత మండపంలో స్వామివారి 29 రోజుల స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 75 గ్రాముల బంగారం, 5 కిలోల 600 గ్రాముల వెండిని భక్తులు హుండీలో సమర్పించినట్లు తెలిపారు. అమెరికా 844 డాలర్లు, ఇంగ్లాండ్ 45 పౌండ్స్, కెనడా 50 డాలర్స్, దిరామ్స్ 265, నేపాల్ 30, ఆస్ట్రేలియ 5, థాయ్ బాట్ 450, యూరోప్ 160, సింగపూర్ 79, రియల్ 16, బైసా 300, ఒమన్ 1ను భక్తులు హుండీలో సమర్పించినట్లు తెలిపారు.

అసెంబ్లీ అంటే కెసిఆర్‌కు ఎందుకంత భయం? : డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

అసెంబ్లీకి రాని కెసిఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష నాయకుని హోదా ఎందుకని, అసలు అసెంబ్లీ అంటే కెసిఆర్‌కు ఎందుకంత భయం అని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు.. ప్రతిపక్ష నాయకుడిగా రెండు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ఆయన నిలదీశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పాత పినపాక ,అన్నారుగూడెం, లింగాల గ్రామాల్లో నూతనంగా నిర్మించే 33/11 కె వి విద్యుత్ సబ్ స్టేషన్ లకు ఆయన శంకుస్థాపన చేశారు.అనంతరం స్థానికంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. పదిమంది నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్న వారిని తోలు వలుస్తాం .. తీస్తాం అంటే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరని, అసలూ ఆయన తోలు వలిచే ఉద్యోగం ఎప్పుడు తీసుకున్నారో ? చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. రెండు సంవత్సరాల పాటు ఫామ్ హౌస్ లో పడుకొని నిన్న, మొన్న ఒక పెద్దాయన మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు అంటే ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి మంచిగా చేయండి అని ఆశీర్వదిస్తారని భావించాం కానీ ఆయన తోలు తీస్తాం అంటే ఇక్కడ ఖాళీగా ఎవరూ లేరని ఆయన ఘాటుగా బదులు ఇచ్చారు.

తాము ప్రతిపక్షంలో ఉన్న పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా తాను ఏ ఒక్కరోజు అసెంబ్లీకి గైర్హాజరు కాలేదని, ప్రతిరోజు ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించామని భట్టి తెలిపారు.ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు చేపడుతున్నాం కాబట్టే ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన 85శాతం మందిని సర్పంచులు గా గెలిపించి పంపిస్తే తోలువలుస్తా అని కేసిఆర్ మాట్లాడుతున్నారు మాకు దిగజారి మాట్లాడడం రాదని, చేతల ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీఆర్‌ఎస్ నేతలకు తగిన బుద్ధి చెప్పిస్తామని భట్టి విక్రమార్క అన్నారు.రాష్ట్రంలో అత్యంత ప్రజాస్వామ్య పద్ధతుల్లో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మద్దతుదారులు ప్రజలకు అన్ని విషయాలు వివరించారు అయినప్పటికీ కాంగ్రెస్ బలపరిచిన 85 శాతం మంది అభ్యర్థులను రాష్ట్ర ప్రజలు గెలిపించి ఆశీర్వదించారని ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు పనికిరాని పక్కకు కూర్చోబెట్టారు, తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు పల్లె ప్రజలు పట్టం కట్టారని డిప్యూటీ సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ అవుతుంది, రాష్ట్రానికి దేశవ్యాప్తంగా నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు.

ఈ సమయంలో తాము ఎక్కడ కనిపించకుండా పోతామని ఆందోళనతో రెండు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం పై విషయం కక్కి తిరిగి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి వెళ్లారు మీకు ప్రజలే బుద్ధి చెబుతారని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రంలోని 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 85 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారని ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆశీర్వాదం లభించలేదని అన్నారు. ప్రజల మధ్య నిలబడి ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం నిర్ణయాలు చేయడంతోనే సర్పంచి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గెలుపొందారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి మాలోత్ రాందాస్ నాయక్ జిల్లా కలెక్టర్ అనుదీప్,రాష్ట్ర గిడ్డంగులసంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వర్రావు,డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఇతర అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

హీరోయిన్లపై అసభ్య కామెంట్స్.. శివాజీకి మహిళా కమిషన్‌ నోటీసులు

నటుడు శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈక్రమంలో ఆయన మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న ఉదయం11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించింది. మరోవైపు, తన వ్యాఖ్యలపై శివాజీ క్షమాపణల చెబుతూ వీడియో విడుదల చేశారు. మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలను ఉపయోగించానని.. తనను క్షమించండని శివాజీ క్షమాపణలు తెలిపాడు.

కాగా, హీరోయిన్ల డ్రెస్సులపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై పలువురు సెలబ్రిటీలు ఫైరవుతున్నారు. ఇప్పటికే ఆయనపై ‘మా’కు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ నందినిరెడ్డి, నిర్మాత స్వప్నదత్, నటి మంచు లక్ష్మీ, ఝాన్సీ, సుప్రీయ యార్లగడ్డ.. శివాజీపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇక, హాట్ యాంకర్‌ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారని విమర్శించారు. “ఎవరికి నచ్చిన డ్రెస్‌ వాళ్లేసుకుంటారు.. నచ్చినట్టు తింటారు” అంటూ ఫైరయ్యారు అనసూయ. సింగర్ చిన్మయ్ కూడా శివాజీ వ్యాఖ్యలపై మండిపడుతూ సోషల్ మీడియాలో ద్వజమెత్తారు.

ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ.. మహిళల డ్రెస్సింగ్ పై మాట్లాడుతూ.. హీరోయిన్లు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారని.. అందంగా కనిపించడానికి.. సామాన్లు కనిపించేలా సగం సగం దుస్తులు వేసుకోవద్దని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నేషనల్ మీడియాలోనూ శివాజీ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

ఉన్నావ్ అత్యాచారం కేసులో కుల్‌దీప్ సెంగార్ జైలుశిక్ష నిలిపివేత

బిజెపి బహిష్కృత నేత, ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవితకాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న కుల్‌దీప్ సెంగార్‌కు భారీ ఊరట లభించింది. ఆయన జైలు శిక్షను మంగళవారంనాడు ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సుబ్రహ్మణం ప్రసాద్, హరీశ్ వైద్యనాథ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విడుదలకు ఆదేశించింది. రూ.15లక్షల విలువైన మూడు పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. బాధితురాలి నివాసానికి ఐదు కిలో మీటర్ల దూరం పాటించాలని, ఆమెతో పాటు కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బెదిరింపులకు గురిచేయరాదని ఆదేశించింది. వీటిలో ఏ నిబంధనను కూడా అతిక్రమించినా బెయిల్ రద్దు చేస్తామని సెంగార్‌ను కోర్టు హెచ్చరించింది. 2019 డిసెంబర్‌లో ట్రయల్ కోర్టు ఆదేశాలను సెంగార్ ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పెండింగ్‌లో ఉండడంతో వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది. ఒకవేళ పెండింగ్‌లో ఉన్న అప్పీల్‌పై తీర్పు వెలువడి దోషిగా తేలితే సెంగార్ పూర్తి శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. 2017లో సెంగార్ మైనర్ బాలికను కిడ్నాప్ చేయడమే కాకుండా ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

న్యూజిలాండ్ కు నష్టం చేసే ఒప్పందం: విదేశాంగ మంత్రి విన్ స్టన్ పీటర్స్

భారతదేశం – న్యూజిలాండ్ మధ్య కొత్తగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆదేశపు విదేశాంగమంత్రి విన్ స్టన్ పీటర్స్ తీవ్రంగా విమర్శించారు. ఆ ఒప్పందం న్యాయంగాలేదు, స్వేచ్ఛ గా లేదు అన్నారాయన. పార్లమెంటులో చర్చ సందర్భంగా తమపార్టీ ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు.తమ పార్టీ న్యూజిలాండ్ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తుందని అంటూ, ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాల్సివచ్చినందుకు విచారిస్తున్నామని పీటర్స్ తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ల విషయంలో ఈ ఒప్పందం చాలా ఉదారంగా ఉందని, అంతే కాక, కీలకమైన పాడి పరిశ్రమ రంగంలో ఒప్పందం న్యూజిలాండ్ కు లాభదాయకంగా లేదని విన్ స్టన్ పీటర్స్ వాదించారు. ఏమైనా ఇది న్యూజిలాండ్ కు సంబంధించినంతవరకూ చెడ్డ ఒప్పందం అన్నారు. న్యూజిలాండ్ ప్రధాన పాల ఎగుమతులపై సుంకాలు తగ్గించేందుకు భారతదేశం అంగీకరించలేదన్నారు. ఇది న్యూజిలాండ్ రైతులకు నష్టదాయకం అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టులపై కెసిఆర్ పచ్చి అబద్దాలు: డికె అరుణ

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రాజెక్టులపై పచ్చి అబద్దాలు చెబుతున్నారని బిజెపి ఎంపీ డికె అరుణ నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత కెసిఆర్‌కు లేదని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. ఆర్‌డిఎస్ కోసం పాదయాత్ర చేశానని చెబుతున్న కెసిఆర్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. రాజోలిబండకు, రైతులకు తీరని అన్యాయం చేశారని ఆమె విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డిపిఆర్‌ను మార్చారని ఆమె విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి పదేళ్ళు అధికారంలో ఉన్నా ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. రెండేళ్ళ తర్వాత ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు పాలమూరుకు అన్యాయం జరుగుతున్నదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలమూరుకు కెసిఆరే కాదు ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.

తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు..‘పక్కా మాఫియా పాలన’: కెటిఆర్

తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. ‘పక్కా మాఫియా పాలన’ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు..నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్‌ల మీద జెలటిన్ స్టిక్స్‌తో బాంబులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ ‘ఇది మానవ నిర్మిత విధ్వంసం’ అని మొత్తుకుంటున్నా, ఈ ‘చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారని అన్నారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్‌లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా.. ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా..? అని ప్రశ్నించారు.

భూగర్భ జలాలు పెరగాలని తాము చెక్ డ్యామ్‌లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా..? అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇప్పుడు మీ సమాధానం ఏంటి అని సిఎం రేవంత్ రెడ్డిని అడిగారు.అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు అంటూ సిఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే అని, లేదంటే ఈ బాంబుల సెగ సిఎం కుర్చీ దాకా రావడం ఖాయం అని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి..

హైదరాబాద్: విధులు ముగించుకుని వెళ్తున్న హోంగార్డును డిసిఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్, పిల్లర్ నంబర్ 192వద్ద మంగళవారం చోటుచేసుకుంది. టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సయిద్ అబ్దుల్ సత్తార్(40) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతోపాటు హసన్‌నగర్‌లో ఉంటున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా పివిఎన్‌ఆర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ వద్ద వేగంగా దూసుకుని వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో అబ్దుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతిచెందారు.

రెండంతస్తుల భవనం పై నుండి పడి ఎలక్ట్రిషన్ మృతి

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద నిర్మాణం లో ఉన్న రెండంతస్తుల భవనం పై నుండి పడి ఎలక్ట్రిషన్ వాజిద్ (32) మృతి చెందాడు. రెండంతస్తుల భవనంపై ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయి 32 ఏళ్ల ఎలక్ట్రిషియన్ చెందాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వాజిద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళల డ్రెస్సులపై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు.. సెలబ్రిటీలు ఫైర్

మహిళల డ్రెస్సులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ సెలబ్రిటీలు ఫైరవుతున్నారు. ఇప్పటికే శివాజీపై మాకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ నందినిరెడ్డి, నిర్మాత స్వప్నదత్, నటి మంచు లక్ష్మీ, ఝాన్సీ, సుప్రీయ యార్లగడ్డ.. శివాజీపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇక, హాట్ యాంకర్‌ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారని విమర్శించారు. “ఎవరికి నచ్చిన డ్రెస్‌ వాళ్లేసుకుంటారు.. నచ్చినట్టు తింటారు.. నచ్చిన డ్రెస్‌ వేసుకుంటారు” అంటూ ఫైరయ్యారు అనసూయ.

కాగా, ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ.. మహిళల డ్రెస్సింగ్ మాట్లాడుతూ.. అమ్మాయిలు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారని.. అందంగా కనిపించడానికి.. సామాన్లు కనిపించేలా సగం సగం దుస్తులు వేసుకోవద్దని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.