ఒకప్పుడు వరుస హిట్స్‌తో సక్సెస్‌ఫుల్ హీరోగా ఉన్న వరుణ్ సందేశ్ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు. గత కొంతకాలంగా అతడు ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం అతడు ఒటిటిలోకి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘నయనం’ అనే వెబ్‌సిరీస్‌తో వరుణ్ సందేశ్ ఒటిటి ఎంట్రీకి ప్లాన్ చేశాడు. ఈ సిరీస్‌లో అతడు డాక్టర్ నయన్ అనే పాత్రలో కనిపించనున్నాడు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు.
జీ 5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఈ సైకో థ్రిలర్‌కి స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించారు. సోమవారం ఈ వెబ్‌సిరీస్ నుంచి వరుణ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉంటాయి.