హైదరాబాద్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ భారీ సెంచరీ చేయడంతో భారత్ గెలుపొందింది. వన్డేల్లో విరాట్ 52వ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. గతంలో సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పాడు. విరాట్ తరువాత వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఒక ఫార్మాట్‌లో కూడా సచిన్ రెండో స్థానంలోనే ఉన్నాడు. దీంతో విరాట్‌ను టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ ప్రశంసించారు. విరాట్‌తో కలిసి ఆడిన ఆటగాళ్లు మాత్రమే వన్డేల్లో గ్రేట్ అని అంటారన్నారు. రికీపాంటింగ్ సైతం వన్డేల్లో విరాట్ మించిన వారు లేరు అన్నారని గుర్తు చేశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ల నుంచి ప్రశంసలు రావడం అనేది చాలా అరుదు అని అన్నారు. సచిన్ రికార్డులను కోహ్లీ బద్దలు కొట్టాడంటే అతడు అంటే ఏంటో అర్థం చేసుకోవాలని సునీల్ మెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ టి20, టెస్టు క్రికెట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ టెండూల్కర్ వంద సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ 83 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. వరసగా రికీ పాంటింగ్(83), సంగక్కరా (63), జాక్వస్ కలిస్(62)గా ఉన్నారు.