గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కాంబినేషన్ లో వ స్తున్న డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా రు. ఎం తేజస్విని నందమూరి సగర్వం గా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ 2డి, 3డి రెం డు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హర్షాలి మల్హోత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో జనని అనే క్యారెక్టర్లో కనిపిస్తాను.జనని ఎప్పుడు ప్ర మాదంలో ఉన్న అఖండ తనకోసం వస్తారు.
లెజెండరీ నందమూరి బాలకృష్ణతో నటించడం నా అదృష్టం. బోయపాటి శ్రీను ప్రో త్సాహం నాలో మరింత ఎనర్జీని నింపింది. జననీ పాత్ర కోసం బోయపాటి నన్ను ఎం చుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నాకు ఇష్టమైన స్టార్స్ బాలయ్య, అల్లు అర్జున్, ప్రభాస్. ఇక నాకు సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో చేయాలని ఉంది. ఆయన హీరోయిన్స్ ని చూపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే నాకు అన్ని రకాల జానర్స్ చేయాలనీ వుంది‘ అని అన్నారు.