అమరావతి: బాలికపై పెంపుడు తండ్రి, బావమరిది పలుమార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ధర్మవరంలో ఓ గ్రామానికి చెందిన జంట 14 సంవత్సరాల క్రితం ఆడ శిశువును తెచ్చుకొని పెంచుకన్నారు. ఇప్పుడు బాలిక వయసు 14 సంవత్సరాలుగా ఉంది. బాలికపై తండ్రి, తల్లి సోదరుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేసి బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో తల్లి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక చెప్పిన వివరాల ప్రకారం పెంపుడు తండ్రి, తల్లి సోదరుడి పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.