* సమగ్ర రోడ్ మ్యాప్‌ను రూపొందించండి
* అధికారులకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం
* ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి రూ. వెయ్యి కోట్లతో అదితి అమలు
* రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, వస్త్రాలు వంటి ఇతర క్లస్టర్లకు విస్తరించాలని కేంద్రానికి విజ్ఞప్తి
* ఎంఎస్‌ఎంఈ రంగాలను ఆర్ధికంగా బలోపేతం చేయడంలో అదితి గేమ్ ఛేంజర్
* జాతీయస్థాయిలో రోల్ మోడల్‌గా మార్చడానికి తెలంగాణ సమగ్ర రోడ్‌మ్యాప్
మెదక్ లోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి శ్రీధర్‌బాబు
మన తెలంగాణ / హైదరాబాద్: అదితి పథకం కింద ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడానికి సమగ్ర రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈలకు నిజమైన గేమ్-ఛేంజర్లుగా మారగలవని మంత్రి పేర్కొన్నారు. అదితి పథకాన్ని ప్రోత్సహించడంపై విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని బీఈఈ, ఈఈఎస్‌ఎల్ మీడియా సలహాదారు ఏ చంద్ర శేఖర రెడ్డి తయారుచేసిన ప్రత్యేక నివేదికను ఆదివారం మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతది పథకం ఎంఎస్‌ఎంలకు ఒక వరమని ప్రశంసించారు. తెలంగాణలోని అదనపు ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లకు అదితి ప్రయోజనాలను విస్తరించాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వీటిలో రసాయనాలు, ఆహార ప్రాసెసింగ్, స్టీల్ రీ-రోలింగ్, ఇతర రంగాలకు ఆర్థిక, పర్యావరణ లాభాలను కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ త్మ కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లను ఇంధన సామర్థ్యంతో కూడినవిగా చేయడం కేవలం తక్కువ ఖర్చుతో కూడుకున్నదే కాకుండా ఉత్పాదకతను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తద్వారా ఎంఎస్‌ఎంఈలను బలోపేతం చేస్తుందని చెప్పిన ఆయన స్థిరమైన అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని చెప్పారు. అదితి అమలులో తెలంగాణ జాతీయ రోల్ మోడల్‌గా మారాలని తాము కోరుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
2035 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ లక్షం:
ఈ లక్ష్యాన్ని సాధించడానికి, రాష్ట్రం జాతీయ స్థాయిలో బీఈఈ, ఈఈఎస్‌ఎల్, విద్యుత్, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలులు రాష్ట్ర స్థాయిలో ఇంధన శాఖ కింద టీఎస్ రెడ్‌కో తో కలిసి పనిచేస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. 2035 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా మార్చడానికి అన్ని వాటాదారులూ కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరుల అమలు, గ్లోబల్ స్టాండర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్‌లో 24/7 విద్యుత్ సరఫరా అందించడం ఈ భారీ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వివరించారు. తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక పురోగతిని ఆయన మరింతగా హైలైట్ చేశారు. రాష్ట్రం కేవలం 18 నెలల్లో రూ. 3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, ఇది చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని తెలిపారు. హైదరాబాద్ ఇప్పుడు ఆర్ అండ్ డీ, ఏఐ, డేటా సెంటర్ పెట్టుబడులలో దేశంలోని టాప్ మూడు పట్టణ ఎఫ్‌డీఐ గమ్యస్థానాలలో ఒకటిగా ఉందన్నారు.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఎంఎస్‌ఎంఈ వెన్నెముక :
లక్షలాది మందికి ఉపాధి కల్పించే, నూతన ఆవిష్కరణలను తీసుకువచ్చే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రంగం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఈ రంగాన్ని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ‘అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎన్జ్రీ ఎఫిషియంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (అదితి)కు పూర్తి మద్దతును అందించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మద్దతుతో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) అమలు చేస్తున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా ఊపందుకుంది. నేషనల్ అదితి సిరీస్‌లో భాగంగా తెలంగాణ ఈ పథకాన్ని అధికారికంగా స్వాగతించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందే మొదటి క్లస్టర్లలో ఒకటిగా మెదక్ జిల్లాలోని ఫార్మా పరిశ్రమను ఎంచుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బీఈఈ కృతజ్ఞతలు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలి : బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్
దేశ వ్యాప్తంగా అదితి పథకం యొక్క ప్రయోజనాలను అమితంగా పెంచడమే లక్షంగా పనిచేస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని కోరుతున్నామని బీఈఈ కార్యదర్శి మిలింద్ డియోర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పెంచుకునేలా ఈ ఏడాది రూ. వెయ్యి కోట్ల నిధిని కేటాయించామన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వినియోగించుకోవాలని కోరారు. ఇది ఎంఎస్‌ఎంఈ రంగంలో ఇంధన సామర్థ్యంతోపాటు పోటీతత్వాన్ని పెంపొందిస్తుందన్నారు. ఫార్మా పరిశ్రమలో గణనీయమైన సామర్థ్యం కారణంగా తెలంగాణలోని మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.
అదితి పథకంలో పరిశ్రమలకు ఎండ్-టు-ఎండ్ మద్దతు ఉంటుంద్న్నారు. ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్స్ (ఐజీఈఏ), వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలు (డీపీఆర్‌లు), ఫైనాన్సింగ్ సహాయం, పర్యవేక్షణ – ధృవీకరణ (ఎం అండ్ వీ) వంటి సహకారాలతో సహా మొత్తం రూ. 9 వేల కోట్లకు పైగా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నామన్నారు. అదితి పథకం యొక్క విజయం ఆయా రాష్ట్రాల పటిష్ట అమలుపై ఆధారపడి ఉంటుందని డియోర్ అన్నారు. ఎంఎస్‌ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం, పర్యావరణ బాధ్యతాయుతంగా మారడానికి ఎస్‌డీఏలు ఈ పథకాన్ని చేరుకోవడం, హ్యాండ్‌హోల్డింగ్ చేయడం, స్కేలింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అదితి కార్యక్రమం ప్రస్తుతం 60 పారిశ్రామిక క్లస్టర్లు, 14 శకి ్త-ఇంటెన్సివ్ రంగాల్లో పనిచేస్తోందని తెలిపారు. వీటిలో వస్త్రాలు, ఫౌండ్రీలు, ఆహార ప్రాసెసింగ్ వంటివి ఉన్నాయన్నారు. ఈ రంగాల్లో నిర్దేశించుకున్న ఫలితాలను సాధించడానికి దశల వారీగా క్లస్టర్-నిర్దిష్ట అమలు నమూనాను అనుసరిస్తున్నాయని తెలిపారు.