హిల్ట్ పి పేరుతో రూ. లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం
దీనిపై రాహుల్ గాంధీ మౌనం ఆమోదానికి సంకేతం
ఆయన స్పందించకుంటే ఈ అవినీతిలో భాగ్యస్వామ్యం ఉన్నట్లే
మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాలలో ఒకటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ(హిల్ట్ పి) అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా..? అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. సిఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన హిల్ట్ పి విధానం వల్ల తెలంగాణ ప్రజలకు రూ.5 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలోని బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రాపురం, హయత్‌నగర్ వంటి కీలక క్లస్టర్‌లలో మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించాయని కెటిఆర్ తన లేఖలో వివరించారు. ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన, దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, కొత్త హిల్ట్ పి కింద, పారిశ్రామిక భూములను కలిగి ఉన్నవారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్‌లుగా మార్చుకోవడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం(ఎస్‌ఆర్‌ఒ) విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆరోపించారు. ప్రస్తుత మార్కెట్ ధరలు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ విధానం ప్రజలకు దక్కాల్సిన ఆస్తులను తక్కువ ఖర్చుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, లక్షల కోట్ల విలువైన భూమిని నామమాత్రపు ధరకు క్రమబద్ధీకరిస్తుందని ఆరోపించారు.
ప్రక్రియలో పారదర్శకత లేదు
వేల కోట్ల విలువైన ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లో ఫాస్ట్-ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కెటిఆర్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకత లేదని, కేవలం డబ్బులు దండుకోవాలని మాత్రం వలననే సరైన విచారణ లేకుండానే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరపాటుతనం, ఈ మొత్తం పాలసీలో దాగున్న రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలను లేవనెత్తుతుందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ (ఒఆర్‌ఆర్) వెలుపలికి కాలుష్య పరిశ్రమలను తరలించాలనే ఈ విధానం లక్ష్యం పేరు చెప్పి తప్పుడు దారిలో లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసిందని ఆరోపించారు.
పరిశ్రమల తరలింపు ప్రధాన లక్ష్యం అయితే, ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయంగా కాకుండా పూర్తి స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలనడం, ఒక్కొక్క దరఖాస్తు వారీగా ప్రత్యేకంగా ప్రభుత్వం భూముల ట్రాన్స్‌ఫర్‌కి ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, ప్రస్తుతం ఉన్న పరిశ్రమల తరలింపుకు ఎలాంటి గడవు నిర్ధారించకపోవడం, పరిశ్రమలు తరలి వెళ్తాయా లేదా అన్న అంశాన్ని ప్రకటించకపోవడం వంటి అనేక లోపభూహిష్ఠమైన పాలసీని కేవలం డబ్బులు దండుకోవడమే ఏకైక లక్ష్యంగా తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
తరలించాలనుకునే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ విధానం గుర్తించలేదని, ఈ భూముల ట్రాన్స్‌ఫర్ వలన కలిగి ఆవరణ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటి లోపాలు పాలసీలో ఉన్నాయని కెటిఆర్ లేఖలో ప్రస్తావించారు. దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామికాభివృద్ధికి బదులుగా, పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు, వాణిజ్య సముదాయాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విధానం కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు, పలుకుబడి గల రియల్ ఎస్టేట్ గ్రూపులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు, కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించబడిందని ఆరోపించారు.
ఈ అవినీతికి రాహుల్‌గాంధీ అడ్డుకట్ట వేయాలి
బిఆర్‌ఎస్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడికి పారిశ్రామిక యూనిట్లు ఎస్‌ఆర్‌ఒ విలువలో 100 నుండి 200 శాతం చెల్లించాలని కఠినమైన నిబంధనలను అమలు చేసిందని కెటిఆర్ గుర్తు చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సరైన పరిహారం అందేలా చూసుకుందని వివరించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిబంధనలు తొలగించి, తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేతల అనుచరులకు ఎటిఎంగా మార్చేశారని విమర్శించారు. పెద్దఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి ఇప్పటివరకు తెలియకుంటే కనీసం ఇప్పుడైనా తెలంగాణలో జరుగుతున్న ఐదు లక్షల కోట్ల అవినీతి స్కామ్‌ని అడ్డుకోవాలని రాహుల్‌గాంధీని కోరారు. లేకుంటే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీకి భాగస్వామ్యం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం తెలంగాణలో జరుగుతున్నదని భావించాల్సి ఉంటుందని అన్నారు.
రాహుల్ గాంధీ ఈ అంశంలో ఇప్పటికైనా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడతామంటే ఒప్పుకునేది లేదని, ప్రజల తరఫున బిఆర్‌ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని కెటిఆర్ డిమాండ్