హైదరాబాద్: నర్సరీ విద్యార్థినిపై ఆయా అమానవీయంగా ప్రవర్తించింది. చిన్నారిపై కాలు వేసి తొక్కుతూ ఆయా లక్ష్మి పైశాచిక ఆనందం పొందింది. జీడిమెట్ల పరిధి షాపూర్‌నగర్‌లోని పూర్ణిమా స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారిని ఆయా లక్ష్మి ఇష్టారీతిన కొట్టింది. చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల ముగిసిన గంట తర్వాత వచ్చారు. ఆయా తనని కొట్టినట్లు తల్లిదండ్రులకు చిన్నారి తెలిపింది. దీంతో ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. ఈ ఘటన కారణంగా చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్చారు. దాడి జరిగిన సమయంలో పాఠశాల పక్కింటి వ్యక్తి ఆ ఘటనను వీడియో తీశాడు. ఆయా దాడి దృశ్యాలను ఆ వ్యక్తి తల్లిదండ్రులకు ఇచ్చాడు. దాడి దృశ్యాల ఆధారంగా చిన్నారి తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.