హైదరాబాద్: రాయదుర్గం పరిధి..అపార్ట్ మెంట్ నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. సోఫాపై దీపం పడి మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు.