తిరుపతి: సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని చెప్పారు. ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని ఆవేదన వ్యక్తం చేశారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలేనని మండిపడ్డారు. వ్యవస్థలో లోపాలను సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని హెచ్చరించారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడుతారని నారాయణ పేర్కొన్నారు.