అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో కారుకు అగ్ని ప్రమాదం జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు అప్రమత్తమై కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కదిరి రోడ్డులో రాయలసీమ స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కారులో ప్రయాణించిన వారికి ఏమీ కాకపోవడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.