హైదరాబాద్: కష్టతరమైన వాటిని కూడా భారత్ సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తాను భారత్ కలిగి ఉందని అన్నారు. మోడీ ‘‘మన్ కీ బాత్’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ లో కొందరు గ్రామీణ రైతులు అద్భుతాలు చేస్తున్నారని, తేనె ఉత్పత్తి, విక్రయం, ఎగుమతుల్లో రికార్డులు సృష్టిస్తున్నారని మోడీ తెలియజేశారు. ఇటీవల హరియాణాలో కురుక్షేత్రంలో జరిగిన గీతామహోత్సవ్ నన్ను ఎంతగానో ఆకర్షించిందని, యూరప్, మధ్య ఆసియాలోనూ గీతాపఠనం చేస్తున్న వారి సంఖ్య విశేషంగా పెరుగుతోందని మోడీ పేర్కొన్నారు.