జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్‌లో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో… క్రికెట్ నేపధ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మూవీ ‘జిఒఎటి’ . ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకి చేరుకుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక తాజాగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం మెలోడి బ్రహ్మ మణిశర్మ టీంలో చేరడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. త్వరలోనే సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు జరుపుతున్నారు.