అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రాణరక్షణ కోసం నూజివీడు పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. యువతి తరపు కుటుంబ సభ్యులు, బంధువులు స్టేషన్ వద్దకు భారీగా చేరుకొని యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన పోలీసులను తోసేసి భగ్న ప్రేమికుడిని చితకబాదారు. యువతి కుటుంబ సభ్యులు గేట్లను ధ్వంసం చేసుకుని స్టేషన్ లోకి చొరబడేందుకు యత్నించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపునగర్‌కు చెందిన ప్రేమ జంట కొన్ని రోజుల పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు సమాచారం.