ఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో చెప్పుల దుకాణంలో భారీగా మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరొకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో అన్న సతేందర్ గుప్తా, చెల్లె అనితా ఉన్నారు. స్థానికుల సమాచార మేరకు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.