హైదరాబాద్: సినిమాల పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ నిర్వహకుడు ఇమండి రవి రెండో విడత కస్టడీ పూర్తయింది. ఈ విచారణలో ఐ బొమ్మ పూర్తి పేరు ‘ఇంటర్నెంట్ బోమ్మ’ అని నిందితుడు వెల్లడించాడు. విశాఖలో సినిమాను బొమ్మగా పిలిచేవాళ్లమని చెప్పాడు. మరో వెబ్‌సైట్‌కు బలపం అని పేరు పెట్టాలని అనుకున్నట్లు తెలిపాడు. డొమైన్‌లో సాంకేతిక సమస్యతో ‘ఎల్’ అక్షరం తీసి ‘బప్పం’ మార్చినట్లు వెల్లడించాడు.
విచారణలో భాగంగా పోలీసులు అతడిని 3 రోజుల పాటు ప్రశ్నించి.. కీలక సమాచారం సేకరించారు. పైరసీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ గురించి పోలీసులకు రవి వివరించాడు. తాను అప్‌లోడ్ చేసిన సినిమాల్నీ టెలిగ్రామ్ నుంచి తీసుకున్నవేనని చెప్పాడు. అనంతరం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.