ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనెస్ తమ 62వ ఏట పెళ్లి చేసుకున్నారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మనువాడిన ఘటన ఇదే తొలిసారి అయింది. దేశ రాజధాని కానెబెర్రాలో శనివారం ఆయన తన ప్రియురాలు జోడి హెడన్‌ను అత్యంత రహస్యంగా జరిగిన కార్యక్రమంలో పెళ్లి చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇది రికార్డు అయింది కేవలం 60 మంది గెస్టులు వచ్చిన దశలో కొందరు మంత్రుల హడావిడి నడుమ పెళ్లి జరిగింది. ఆస్కార్ నటుడు రసెల్ క్రోవే ఇతర ప్రముఖులు వేడుకకు తరలివచ్చారు. పెళ్లినాటి ప్రమాణాలను జంటనే రూపొందించుకుంది. వారి పెంపుడు కుక్క టోటో రింగ్ అందించింది. అక్కడికి వచ్చిన వధువు బంధువు చిన్నారి ఎల్లా పూలబాలిక అయి ఉందని తరువాత వెలువరించిన ప్రకటనలో తెలిపారు. ప్రధానికి 60 దాటింది. ప్రియురాలికి 46 సంవత్సరాలు . చాలాకాలంగా ఇరువురి మధ్య ప్రేమ జీవిత భాగస్వామ్యం నడుస్తోంది. ఇప్పుడు ఇది పెళ్లిగా మారింది.