హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా గుర్తుండి పోయేలా ఉజ్వల తెలంగాణలో పాలు పంచుకోండి.. అనే నినాదంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహిస్తుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ భారత ఫ్యూచర్ సిటీ లో ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌లో భారీ డ్రోన్ షోకు ప్రభుత్వం సన్నహకాలు చేస్తోంది. డ్రోన్ షోతో గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా ఏర్పాటు చేస్తోంది. మొత్తం 3 వేల డ్రోన్‌లతో ఈ షో జరుగనుంది. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల వినియోగంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించారు. ఈ రికార్డును గ్లోబల్ సమ్మిట్‌లో అధిగమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.