హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామా మూవీగా ఇది రూపొందుతోంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు సినిమాపై హైప్ పెంచుకున్నారు. ఎప్పడైతే ‘ఫస్ట్ షాట్’ పేరుతో సినిమా నుంచి చిన్న గ్లింప్స్ వదిలారో ఆ హైప్ మరింతగా పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘చికిరి’ అంటూ సాగే తొలి సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాట సూపర్ హిట్ కాగా.. మిలియన్స్‌లో వ్యూస్ సంపాదించుకుంటుంది.
అయితే ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేశారట దర్శకుడు బిచ్చిబాబు. అందులో ఓ ఫైట్ సీన్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారట. ప్రముఖ బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ పర్యవేక్షణ ఈ ఫైట్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఈయన గతంలో ‘దంగల్’ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రాఫీ చేశారు. ఈ న్యూస్ తెలిసిన అభిమానులు సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసుకున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.