భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు రాష్ట్రంలోని 38 జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జులను నియమించారు. ఈ మేరకు ఆ జాబితాను శనివారం విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే అరుణతార, మంచిర్యాల ఇన్‌చార్జిగా కె.ఓదెలు, నిర్మల్‌కు గోపిడి శ్రవంత్‌రెడ్డి, కొమురం బీం ఆసిఫాబాద్ జిల్లాకు కోమల ఆంజనేయులు, నిజామాబాద్‌కు మాధవరం కాంతారావు, కామారెడ్డికి విక్రమ్‌రెడ్డి, కరీంనగర్‌కు బండారి శాంతికుమార్, జగిత్యాలకు గడ్డం శ్రీనివాస్, పెద్దపల్లికి రాజమౌళిగౌడ్, రాజన్న సిరిసిల్లకు గంగడి మోహన్‌రెడ్డి, సంగారెడ్డికి పెదకుల శ్రీనివాస్, మెదక్‌కు బోఖా నరసింహారెడ్డి, సిద్ధిపేటకు జె.సంగప్ప, రంగారెడ్డి అర్బన్‌కు అలె భాస్కర్, రంగారెడ్డి రూరల్‌కు వీరబెల్లి రఘునాథరావు, వికారాబాద్‌కు ఏ.సుధాకర్‌రావు, మేడ్చల్ అర్బన్‌కు సేవెళ్ల మహేందర్, మేడ్చల్ రూరల్‌కు సామ రంగారెడ్డి, నల్గొండకు ఉదయ్ ప్రతాప్,
సూర్యాపేటకు డా.తూటుపల్లి రవికుమార్, యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎన్.శ్రీవర్ధన్‌రెడ్డిని నియమించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా బిజెపి ఇన్‌చార్జిగా రంజిత్ మోహన్, వనపర్తి జిల్లాకు బొక్కా బాల్‌రెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాకు కెవిఎల్‌ఎన్ రెడ్డి (రాజు), జోగులాంబ గద్వాలకు బాపురెడ్డి, నారాయణ్‌పేట్‌కు మాజీ మేయర్ బండా కార్తీక్‌రెడ్డి, హన్మకొండకు డా.బూర నర్సయ్యగౌడ్, వరంగల్‌కు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ధషమంత్‌రెడ్డి, జనగాంకు కట్టా సుధాకర్‌రెడ్డి, మహబూబాబాద్‌కు డా.జారుప్లవత్ గోపి (కళ్యాణ్ నాయక్), ములుగుకు డా.కోరాడల నరేష్, ఖమ్మంకు బద్దం మహిపాల్‌రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెంకు డా.విజయ్‌చంద్రారెడ్డి, గోల్కొండ గోషామహల్‌కు యాతిపాటి శ్రీధర్, భాగ్యనగర్ మలక్‌పేట్‌కు జె.రంగారెడ్డి, మహంకాళి సికింద్రాబాద్‌కు నదనం దివాకర్, హైదరాబాద్ సెంట్రల్‌కు వీరెళ్లి చంద్రశేఖర్‌లను నియమించినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు.