దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ని భారత్ 0-2 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ ఆర్డర్‌పై, ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వచ్చాయి. గంభీర్ కోచ్‌గా కొనసాగాలా..? వద్ద..? అనే చర్చ కూడా జరిగింది. అయితే తాజాగా ఈ విషయంపై 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. ఈ రోజుల్లో ద్రవిడ్, లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు లేరని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘ప్రస్తుతం వన్డేలు, టి-20లు ఎక్కువగా ఆడుతున్నాం. దీంతో బ్యాటర్లు, బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. టెస్ట్‌లో రాణించాలంటే చాలా ఓపిక కావాలి. స్పిన్, పేస్‌ని ఎధుర్కొవాలంటే ప్ర్రత్యేకమైన నైపుణం ఉండాలి. ప్రస్తుతం ద్రవిడ్, లక్ష్మణ్ వంటి బ్యాటర్లు జట్టులో లేరు. టర్న్, బౌనర్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయాలంటే చాలా కష్టం. ఈ విషయంలో ఫుట్ వర్క్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక పంత్ విషయానికొస్తే.. అతడు దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. అతడిని డిఫెన్స్ ఆడమని.. 100 బంతుల్లో 20 పరుగులు చేయమని చెప్పాలేము. ఎందుకంటే అతడు ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టును కకావికలం చేయగల సమర్థుడు. అతడు సహజ సిద్ధమైన మ్యాచ్ విన్నర్’’ అని కపిల్ దేవ్ అన్నారు.