మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తూ, మావోయిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి జనవరి 1వ తేదీన అందరం కలి సి లొంగిపోతామని మావోయిస్టు పార్టీ పేర్కొంది. శుక్రవారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ స్పె షల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ, ఆడియో విడుదల చేసింది. ఇంకా లేఖలోని అంశా లు ఇలా ఉన్నాయి. ఆడియో సందేశం విన్న తరువాత పార్టీ నేతలు అందరూ ఎక్కడ ఉన్నా వీలైనం త త్వరగా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి రావాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాల ని, అందరం కలిసి నిర్ణయం తీసుకోవడానికి తగి న సమయం లేదని తెలిపారు. చర్చల కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్, 435.715 ను విడుదల చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహ నం కోల్పోవద్దని, ఓపికగా ఉండాలని, వ్యక్తిగతం గా లొంగిపోవద్దని ఎంఎంసి సహచరులందరికీ విజ్ఞప్తి చేశారు.
జనజీవన స్రవంతిలో చేరి ప్రజలలో పనిచేయలని నిర్ణయించామని, ఈ నిర్ణయం తరువాత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోనుదాదా, సిసిఎం కామ్రేడ్ సతీష్ దాదా, చంద్రన్న, అధిక సంఖ్యలో ఆయుధాలను విడిచిపెట్టి ప్రభుత్వం కల్పించిన పునరావాసంలోకి వచ్చారని తెలిపారు. ఇది లొంగుబాటు కాదని, పూనఃమార్గం అని పిలవాలని సహచర నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు వదులుకోవడంమంటే ప్రజలకు ద్రోహం కాదని, పోరాటాన్ని ఆపమని, ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆయుధాలను వదులుకోవడం అనే అంశం తరువాత చర్చించస్తామని, ప్రస్తుత కాలం సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి అనుకూలంగా లేదన్నారు. చాలా మంది సహచరులను కోల్పోయామని, ఇంకా ఓడిపోవాలనుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, వామపక్ష, సంకుచిత మనస్తత్వం కలిగిన, సాహసోపేత పంథా పార్టీపై ఆధిపత్యం చెలాయించిందన్నారు. గతంలో సాయుధ పోరాటం ఉద్యమానికి దేశం, ప్రపంచం ప్రత్యేక గుర్తింపును ఇచ్చిందని, నేడు ఆ ఆయుధాలే ప్రజలను చేరుకోకుండా నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయుధాలను దగ్గర ఉంచుకోవడంలో అర్థం ఏమిటన్నారు. సోను దాదా సందేశాన్ని అందరికీ తరువాత తెలియజేస్తానని చెప్పారు.