న్యూఢిల్లీ: అయ్యప్పభక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభ వార్త తెలిపింది. శబరిమలకు విమానాలలో వెళ్లే అయ్యప్పస్వాములు తమ ఇష్టదైవపు ఇరుముడిని తమ వెంట ఉండే క్యాబిన్ లగేజ్‌లో తీసుకువెళ్లవచ్చు. దీనిని వారు చెక్ ఇన్ బ్యాగేజ్‌లలో పంపించాల్సిన అవసరం లేదు, భక్తులు తాము ఇరుమడి వెంట ఉంటేనే వెళ్లగల్గుతామని, ఇది స్వాముల ఆచార వ్యవహారం అని తేల్చిచెప్పారు. దీనితో ఇందుకు అనుగుణంగా ఇప్పుడు ఇరుముడిని వెంట తీసుకువెళ్లేందుక అనమతి కల్పించినట్లు పౌర విమానయాన మంత్రి కె రామ మోహన్ నాయుడు శుక్రవారం ప్రకటించారు.
శుక్రవారం (నేటి) నుంచి వచ్చే ఏడాది జనవరి 20 వరకూ ఈ వెసులుబాటు అమలులో ఉంటుంది. అప్పటికి మకర దర్శన ఘట్టం ముగుస్తుంది. స్వాములు తిరుగు ప్రయాణం అవుతారు. పవిత్ర ఇరుముడి సంప్రదాయం అంతర్లీనంగా దాగి ఉన్న విశ్వాసాలను అర్థం చేసుకున్నామని ఈ మేరు భక్తులు ఇరుమడి తమ వెంట ఉండే బ్యాగ్‌లలో తీసుకువెళ్లేందుకు వీలు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఇక సంబంధిత అన్ని భద్రతా ఏర్పాట్ల నిబంధనలను పాటించడం జరుగుతుంది. స్వాములు తనిఖీలకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది. క్షుణ్ణంగా నిబంధనల మేరకు తనిఖీల తరువాత ఇరుముడిని వెంట తీసుకెళ్ల వచ్చు, అయితే తమ లగేజ్ బ్యాగ్‌లలో పెట్టుకుని ఉండాలి. భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది.