జగదల్‌పూర్: నక్సల్స్ సీనియర్ కేడర్, భయంకర చైతుతోసహా మొత్తం పది మంది నక్సల్స్ ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలో శుక్రవారం లొంగిపోయారు. వీరిలో తొమ్మిది మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. వీరందరి తలపై మొత్తం రూ.65 లక్షల రివార్డు ఉంది. సామాజిక ఏకీకరణ కోసం పునరావాసం (పూనా మార్గెం) అన్న సంకల్పంతో వారు తమంతట తామే జగదల్‌పూర్‌లోని సీనియర్ పోలీస్, సెంట్రల్ రిజర్వు పోలీస్, అధికారుల ముందు లొంగిపోయారని ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ పట్టిలింగం వెల్లడించారు. మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదా(63) లొంగిపోవడం
హింసాత్మక, ప్రజావ్యతిరేక మావోయిస్టు భావజాలం వేగంగా నశిస్తోందనడానికి స్పష్టమైన సంకేతంగా పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన చైతు అసలు పేరు గిరడ్డి పవనానందరెడ్డి.1985లో మావోయిస్టుల్లో చేరాడు. మహారాష్ట్ర నుంచి దండకారణ్యకు 199192లో మారాడు. ఆయన తలపై రూ. 25లక్షల రివార్డు ఉంది.