బీజింగ్/హాంకాంగ్ : హాంకాంగ్‌లోని ఏడు ఆకాశ హర్యాల భవనాల్లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 128 కి పెరిగింది. ఇంకా 200 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెప్పారు. 1984 అపార్టుమెంట్లలో దాదాపు 4600 మంది నివసిస్తున్న ఈ భవనాల్లో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు. భవనాల మరమ్మతుల కోసం వాడుతున్న పాలిస్టర్‌బోర్డులు, వెదురుబొంగులు, మెష్ వంటి పరికరాల వల్లనే మంటలు మరింత పెరిగాయని భావించడంతో ఆయా పనులు చేయిస్తున్న ఒక మహిళతోసహా మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు.