దక్షిణ థాయ్‌లాండ్‌లో భారీ వర్షాల కారణంగా ముంచెత్తుతున్న వరదలకు ఇప్పటి వరకు 145 మంది ప్రానాలు కోల్పోయారు. 1.2 మిలియన్ కుటుంబాలకు చెందిన 3.6 మిలియన్ మంది వరదలకు బాధితులయ్యారని వైపరీత్య నివారణ విభాగం వెల్లడించింది. 12 దక్షిణ ప్రావిన్స్‌లు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. ఎనిమిది ప్రావిన్సుల్లో ముఖ్యంగా సాంగ్‌ఖ్లా ప్రావిన్స్ లోనే 110 మంది మృతి చెందారని ప్రభుత్వ అధికార ప్రతినిధి సిరిపాంగ్‌అంగ్ కసకుల్‌కియాత్ వివరించారు.