మన తెలంగాణ/హైదరాబాద్: దేశ వ్యాప్తంగా క్రికెట్ జోష్ శిఖరాలను తాకుతున్న వేళ ఏషియన్ పెయింట్స్, భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత క్రికెట్‌కు అధికారిక కలర్ పార్ట్‌నర్‌గా ఏషియన్ పెయింట్స్ ఎంపైకైంది. మూడేళ్ల భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లో జరిగే పురుషులు, మహిళలు, దేశవాళీ క్రికెట్ సిరీస్‌లను ఏషియన్ పెయింట్స్ కవర్ చేయనుంది. దాదాపు 110పైగా మ్యాచ్‌లకు ఈ సంస్థ కలర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుది.
దశాబ్దాలుగా భారతీయ ఇళ్లలో రంగులు, సృజనాత్మకత, భావోద్వేగాలను ప్రతిష్ఠాత్మకమైన వేడుకగా మార్చిన ఏషియన్ పెయింట్స్ తన రంగుల ప్రస్థానాన్ని దేశపు అత్యంత పెద్ద అభిరుచి అయిన క్రికెట్‌కు విస్తరించింది. ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ అమిత్ సింగిల్ ఒప్పందాన్ని భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.