కోకాపేట నియోపోలిస్ భూముల వేలం నయా రికార్డు నెలకొల్పింది. శుక్రవారం మరో రెండు ప్లాట్లకు హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించగా కోట్లలో హెచ్‌ఎండిఏకు ఆదాయం సమకూరింది, నియోపోలిస్‌లోని 15, 16 నెంబర్ ప్లాట్లకు శుక్రవారం ఈ-వేలం జరిగింది. నియోపోలిస్‌లోని 15వ ప్లాట్‌కు ఎకరాకు రూ.151.25 కోట్ల ధర పలకగా, ఈ ప్లాట్‌ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగాలలు ఈ వేలంలో ఈ ప్లాట్లను దక్కించుకున్నారు. ఇక, 16 ప్లాట్ ఎకరాకు రూ.147.75 కోట్ల ధర పలకగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.1,352 కోట్ల ఆదాయం లభించింది. గతవారంలో నిర్వహించిన వేలంతో పాటు ప్రస్తుతం నిర్వహించిన ఈ వేలం ద్వారా ఇప్పటివరకు నియోపోలిస్ ఆక్షన్ల ద్వారా రూ.2,708 కోట్ల ఆదాయం హెచ్‌ఎండికు సమకూరింది.