హైదరాబాద్: తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం కోసం ఇందిరమ్మ క్యాంటీన్ లలో అల్పాహారం, మధ్యాహ్న సమయంలో భోజనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ ఎన్ టిపిసి వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుందని, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం జరుతుందని వివరించారు.