అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో నకిలీ సిఐ శివయ్య హల్‌చల్ చేశాడు. తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సిఐగా పనిచేస్తున్నా అంటూ హడావిడి చేశాడు. చినగొట్టిగల్లు మండలం జంగవాండ్లపల్లిలో ఓ జంట మధ్య రాజీ కేసులో స్టేషన్‌లో నకిలీ సిఐ శివయ్య హంగామా చేశాడు. అనుమానం రావడంతో శివయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో నకిలీ సిఐ బాగోతం బట్టబయలైంది. అన్నమయ్య జిల్లా కే.వి.పల్లి పోలీస్ స్టేషన్‌లో గతంలో శివయ్యపై రెడ్ శాండిల్ కేసు కూడా ఉంది. కలకడ మండలం పెద్దకమ్మపల్లి వాసిగా పోలీసులు అతడిని గుర్తించారు. గతంలో సిఐగా చెప్పుకుంటూ సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు దిగాడు. పోలీసులు శివయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.