బబుల్గమ్ తో సక్సెస్‌ఫుల్ డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల తన సెకండ్ మూవీ ’మోగ్లీ 2025’ తో వస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. గురువారం మేకర్స్ సెకండ్ సింగిల్ వనవాసం రిలీజ్ చేశారు. కాల భైరవ స్వరపరిచిన ఈ పాటలో భావోద్వేగం పురాణ చిహ్నాలతో ఇంటెన్స్‌గా కనిపిస్తుంది. రోషన్, సాక్షి మడోల్కర్ కెమిస్ట్రీ అందంగా అలరిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.