రాంచీ: టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. తొలి వన్డే రాంచీలో జరుగుతుండడంతో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. రాంచీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. దీంతో టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌తో ధోనీకి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ముగ్గురు కలిసి దోనీ ఇంటికి వెళ్లారు. రాంఛీలో టీమిండియా ఆడుతుండడంతో ధోనీ ఈ మ్యాచ్‌ను వీక్షిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఐపిఎల్ తరువాత ధోనీ ఇప్పటివరకు మైదానంలో చూడలేదు. ధోని తొలి వన్డే మ్యాచ్ కోసం మైదానానికి వస్తాడని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి గాయంతో ఆటకు దూరం కావడంతో కెఎల్ రాహుల్ వన్డే కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్, విరాట్ బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులకు దక్కింది.