అమరావతి: భార్య కాపురం చేయడానికి రావడం లేదని ఆమెకు భర్త డెత్ సర్టిఫికెట్ పంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్‌ఆర్ కడప జిల్లా ముద్దనూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కలసపాడు మండలం దూలంవారిపల్లెకు చెందిన ఆదిలక్ష్మి అనే యువతి 14 సంవత్సరాల క్రితం ముద్దనూరుకు చెందిన మారుతిరాజును పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఆదిలక్ష్మి భర్తను వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. పలుమార్లు ఫోన్ చేసి భార్యన ఇంటికి రమ్మని భర్త కబురు పంపాడు. ఆమె రాకపోవడంతో విసుగు చెంది భార్య పేరుతో డెత్ సర్టిఫికెట్ తయారు చేసి పోస్టులో పంపాడు. తాను బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ పంపడంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మారుతిరాజు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తన తల్లి పేరుతో ఉన్న డెత సర్టిఫికెట్ మారన్చి తయారు చేశానని ఒప్పుకున్నాడు.